మమత అసలు పేరు..
ఆ.వె:
1) పుట్టగానే శిశువు పులకించు పోవును /
అమ్మ యనెడి పిలుపు కాత్ర పడును /
పసిద నమును చూసి పరవశమొందును /
కన్న తల్లి కరుణ కలత దీర్చు!!
2)కడుపులోన మోసి కనులలో ననుదాచి /
జాబిలమ్మ జూపి హాయినిచ్చు /
గోరు ముద్ద బెట్టి గోముగా ముద్దాడు /
కన్న తల్లి కరుణ కలత దీర్చు!!
3)అమ్మ మాట యొకటి యమృతంబు తొలకరి /
"లాలి జోజొ" యంటు లాలి పాడు
మమత మారు పేరు మాతయని యెరుగురా /
కన్న తల్లి కరుణ కలత దీర్చు!!
4) అమ్మ చూడు మనల యాలనా పాలనా /
తల్లి యొడిన యుండు తీపి పేర్మి/
కడుపు లోని కరుణ కమ్మగా కురిపించు /
కన్న తల్లి కరుణ కలత దీర్చు!!
5) తెలుగు వాడు బిలుచు తల్లని పేర్మితో/
తెలుగు భాష లోని తీపి పదము/
"మమ్మి "అన్న పిలుపు మరువుము/ సోదరా
కన్న తల్లి కరుణ కలత దీర్చు!!
రచన :గోదా. లిఖిత్ కుమార్
10వ తరగతి, యస్. ఆర్. ఆర్. యమ్. జి. హెచ్. స్కూలు, బనిగండ్లపాడు.
ఈ పద్యాలు మా అమ్మ రాణిగారికి అంకితం చేస్తూ. .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి