తరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, నవంబర్ 2020, శనివారం

తరణం జాతీయ దినపత్రిక నిర్వహించిన "బాలలు భావి భారత పౌరులు" అనే అంశంపై నేను పంపిన సమ్మోహనాల లఘు కవితలు

 


తరణం జాతీయ దినపత్రిక


బాలల దినోత్సవం సందర్భంగా


బాలలు భావి భారత పౌరులు


           బాలలు సమ్మోహనాలు


కపట మెరుగని కనులు/
కనులు నవ్వె చినుకులు/
చినుకులు శ్రీ శ్రీ కవితలు వారు కుమారా/!

చిలిపి పలుకులు పలికి/
పలికి నవ్వులు చిలికి/
చిలికి మనసులు మోహనపరుచును కుమారా/!

గువ్వలా కవ్వింత/
కవ్వింత కేరింత/
కేరింతలతో బాలలాడును కుమారా/!

స్నేహితులతో కలిసి/
కలిసి ఆటలోలిసి/
అలిసిన మనసుల నవ్వులు చూడు కుమారా/!

మాటకు పాట నేర్పి/
నేర్పి ప్రేమను కలిపి/
కలిపి పెద్దలను మురిపించెదరు కుమారా/!

తోటలో పువ్వులా/
పువ్వులా తారలా/
తారలై దేశ కీర్తి పెంచును కుమారా/!

*లిఖిత్ కుమార్ గోదా*, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ,మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్, ఖమ్మం.
ఫోన్:- 9949618101.



4, జూన్ 2020, గురువారం

నేను (22-09-2018)లో రాసిన ఈ కవిత చదవగలరు 🌟🌟🏵️🏵️


[తరణం దినపత్రిక లో ప్రచురించిన నా కవిత (28/06/2020)]
రచన:- లిఖిత్ కుమార్ గోదా
శీర్షిక:-మదిలో విషాద విపినం
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

మనసులోన ముసురుకున్న విషాద విపినం ఏదో?
ఎదలో నుండి ఎగిరిపోని బాధలేంటో?
మదిలోన ఉద్భవిస్తున్న శోకసంద్రంలేంటో?
మనసులోన శోకాన్ని
మాన్పడానికి వచ్చే మిత్రులు ఎవరో?
నేత్రాల నుండి జాలువారే శోకసంద్రాన్ని
తుడిచివేసే చూపుడువేలేదో?
సర్ది చెప్పే సన్నిహితుడు ఎవరో?
నాకైతే అంతుపట్టడం లేదు.
నేను ఎదురు చూడాలి,
అందరూ నా వాళ్ళేలే అని
కదంబ హస్తాలతో చేర్చుకునేవాడు
ఈ జగతిలో ఏకాకేనా?
ఎడదలో కల్మషం లేకుండా కలిసిపోదామనుకుంటే,
కపట బుద్ధిగలవారు కలవనీయరంతేనా?
ఈ లోకం,
కల్మషం లేనివాడిని నమ్మదు,
అక్కున చేర్చుకోలేదు,
కమ్మని ఊసులు పంచుదామనుకుంటే
కన్నెర్ర చేస్తుందీ కపట లోకం.
నా వ్యధే నిజమైతే 
ఆ దేవుడే నా బాధను బాపునులే
నన్ను స్వచ్ఛమైన ప్రపంచం వైపు నడిపించునులే!
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇👇


https://tharanam.net/మదిలో-విషాద-విపినం-లిఖిత/
చిత్రాలు 👇👇👇

23, మే 2020, శనివారం

లిఖిత్ కుమార్ గోదా నానోలు-1 (10)

 నానోలు -1(1-10)
లిఖిత్ కుమార్ గోదా.


________________________
1)చిరునవ్వు
    ఆరోగ్యం
    కంటతడి
    అనారోగ్యం.
________________________
2)కవిత్వం
   కోడికూత
   కవి
   "మేలు"కో(రు)డి.
_________________________
3)కాకి గానం
   వికారం,
   కోకిల గాత్రం
   వినసొంపు.
_________________________
4)మాట రెండు
   విధాలుగా
   పిలుపు
   అరుపు.
_________________________
5)కోవెల
   దేవుళ్లు
   ఇల్లు
   తల్లిదండ్రులు.
_________________________
6)సంకల్పం
   మార్గం
   గమనం
   లాంతరు.
_________________________
7)శాంతం
    మిత్రుడు
    కోపం
    విరోధి.
________________________
8)పబ్జి 
    పిచ్చి,
    పిచ్చికి
    సూచిక.
_________________________
9)కల్పన
   వినసొంపు
   నిజం
   విషాదం.
_________________________
10)విసుగు
      దోమ
      విలువ 
      చీమ.
నానోలు 👇👇👇 క్రింది లింక్లో చదవొచ్చు 👇👇👇

https://tharanam.net/నానోలు-రచన-లిఖిత్-కుమార్

23, ఏప్రిల్ 2020, గురువారం

||క్వారంటైన్ రైటింగ్స్ -1 | {తరణం దినపత్రిక లో ప్రచురించిన కవిత}|

||క్వారెంటైన్ రైటింగ్స్ -1||
||కవిత-1||
రచన:లిఖిత్ కుమార్ గోదా.
https://drive.google.com/file/d/1Aia0ADtuZad4vdt935pHvOr2T-IF1pOv/view?usp=drivesdk


ప్రచురించిన 57వ రచన. తరణం దినపత్రికలో 3వ కవితా ప్రచురణ ‌🌀🌀🌀🌸🌸🌺🌺🌺🌺
 

📙📘📙📙పుస్తకం...📙📙📘📙
[తరణం దినపత్రికలో ప్రచురితమైన కవిత (30/06/2020)]

పుస్తకం,
మనిషి నుండి మనీషిలా
రుషి నుండి మహర్షి లా మర్చే
ఓ టానిక్..

పుస్తకం,
వ్యక్తి నుండి వ్యవస్థ దాకా
అమ్మ నుండి అనంత విశ్వం దాకా
తెలుసుకునేలా చేసే
ఓ దృశ్యసూచిని..

పుస్తకం,
అడుగంటిన ఆత్మావేదనను
ఎదలో దాగిన మురికిని తొలిగించే
ఓ డిటర్జెంట్..

పుస్తకం,
దయనీయంగా సాగే బ్రతుకులను
కంటికి కనబడని సమాజ నడకని
క్షుణ్ణంగా చూపించే
ఓ మైక్రో స్కోప్.

పుస్తకం,
మనిషి మస్తిష్కంలో పాతుకుపోయి
నిరంతరం ఎదుగుతూ ఉండే
ఓ మొక్క..

పుస్తకం,
ప్రతి మనిషీ దాచుకునే
జ్ఞాపకాల కోట
ప్రతి మనిషినీ దోచుకునే
సిరిసుమాల తోట..

పుస్తకం,
వెనుక తరాల గురించి వెల్లడించింది
ముందు తరాల గురించి ముచ్చటించింది
మనల్ని పయనించేలా చెసే
ఓ టైం మెషీన్..

పుస్తకం,
సంబరంలోనైనా బాధల్లో నయినా మనతో తోడుండే
ఓ నేస్తం..

||23/04/2020||
క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇👇👇
https://tharanam.net/పుస్తకం-రచనలిఖిత్-కుమార/



రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...