కరోనా కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కరోనా కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఆగస్టు 2020, బుధవారం

కరోనా పై కవితలు సంకలనం కోసం మహమ్మద్ రఫీ (ఈ-వేమన) గారి ఆహ్వానం మేరకు రాసిన కవిత ఇది.

   ఘరానా కరోనాకు              చరమగీతం..

లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్, ఖమ్మం జిల్లా, తెలంగాణ-507204.



__________________________


కాటేస్తున్న కరోనాను కోరలు పీకి కదలాలి

జన చైతన్యం పొందితేనే కరోనాని జయించేది,

నిద్ర లేచింది మొదలు నిద్ర లోకి జారు వరకు

జాగ్రత్తలు తీసుకుంటే కరోనాని పడగొట్టినట్లే.

వేడి నీళ్లు తాగవోయ్ విపరీతంగా

కరోనాని మూడు చెరువులు నీళ్లు తాగించు.

సబ్బుతోన చేయి కలిపి కడుగు చేతిలెప్పుడు

కరోనాకు కన్నీరు తెప్పించు.

నిరంతరం పట్టుకోవాలి ఆవిరి

కోవిడ్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి.

బయటకు వెళుతున్న తరుణంలో మాస్కు పెట్టు ముఖానికి

కరోనాకి గోడ కట్టి కట్టిపెట్టు.

సామాజిక దూరం పాటించు

దుష్టులకు దూరంగా ఉండినట్లు.

వేరే వ్యాక్సిన్ వచ్చేదాకా ఆగడం ఎందుకు?

మేలు జరుగును చూడు

పూర్వీకులు సూచించిన జాగ్రత్తలు ఆచరిస్తే.

కరోనా సోకిన వ్యక్తికి

మానవత్వంతో బాసటగా నిలువు.

విధించిన షరతులను తూచా తప్పకుండా పాటిస్తే

ప్రతి మనిషీ కరోనాని జయించినట్లే

చరమగీతం పాడి కరోనాని తరిమితరిమి కొట్టినట్లే.


_________________


చిరునామా:- 


బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202

ఫోన్:- 9949618101


 

8, జూన్ 2020, సోమవారం

కరోనా కవిత-2

కవితా శీర్షిక:- కరోనా కష్టాలు
కవితా రచన:- లిఖిత్ కుమార్ గోదా (చిన్ని)
______________________
కవితా శీర్షిక:-కరోనా కష్టాలు
కవితా రచన:-లిఖిత్ కుమార్ గోదా.
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
"నాన్నా! నేను కరోనాపై
ఓ కవిత రాశా! వింటావా"
అని అడిగా సోఫా మీద
కూర్చుని దర్జాగా
టీవీ సంద్రంలో 
మునిగిపోయిన నాన్నని
"ఇప్పుడు తీరిక లేదు పో"
అని గంభీరంగా అన్న 
నాన్న మాటలు వినబడడంతో వెనుదిరిగి
పది పరీక్షలు రిజల్ట్ కోసం 
వేచి ఉన్న విద్యార్థులా కూర్చుని
లూడో ఆడుతున్న అమ్మ దగ్గరికి వెళ్లి
"అమ్మా!'కరోనా కవిత' రాసా
వింటావా"అని
పనసతొనలు పెట్టి అడిగినట్టు అడిగా,
పెద్ద బిజినెస్ వ్యవహారం నడుపుతున్నట్లు
"ఆగు నాని! మంచి రసవత్తరంగా 
ఆట కొనసాగుతుంది.
సాయంత్రం వింటా వెళ్ళు"
అని నాకే తిరిగి
పనసతొనలు పెట్టింది.
చక్కగా మంచం మీద కూర్చుని
వాట్సాప్ లో నిమగ్నమైన
అక్కని అడిగా
"కాంట్ టాక్, వాట్సప్ ఓన్లీ"
అని అనడంతో ఇక వెనుదిరిగి
గుడ్లప్పగించి, కళ్లార్పకుండా
"పబ్జి"ఆడుతున్న తమ్ముడుని అడిగా
"నన్ను డిస్టర్బ్ చేయొద్దు అన్నయ్య,
 చికెన్ డిన్నర్ చేయాలి" అంటూ
ముందుకు తోసేసాడు.

సరే బయటకూర్చున్న 
తాతయ్య నడిగితే
తేనీరు తాగుతూ తాతయ్య
"యూట్యూబ్"లో మహాభారతాన్ని
ఏదో టెస్ట్ మ్యాచ్ చూసినట్టు చూస్తూ
'ఇప్పుడు తీరికలేదు మనవడా'
అంటూ కళ్ళజోడు సరిచేసుకున్నాడు.
నానమ్మ దగ్గరికి వెళితే
నానమ్మ కూడా అదే యూట్యూబ్లో
పంచాంగాన్ని పరీక్షిస్తూ
"నాకు ఇప్పుడు గ్రహాలు 
అనుకూలంగా లేవు వెళ్ళు మనవడా"
అని సాగనంపింది.
పక్కింటి అక్కని,
ఎదురింటి అన్నయ్యని అడిగితే
"టిక్ టాక్ చేసుకోవాలి..
 డోంట్ టాక్"
అని నన్ను పంపేశారు.
సర్లే చివరాకరకు
వెనుకింటి ఫ్రెండ్స్ ని అడిగితే
"మామా నేను పబ్జి,
 ఫ్రీ ఫైర్ ఆడుతున్న
 నీకు రిక్వెస్ట్ పంపిస్తా,
నాతో కలిసి ఆడతావా"అని ఒకడు,
"బాబాయ్! ఇంస్టాగ్రామ్ లో
 మంచి ఫోటో ఒకటి పెట్టా 
 చూసి ఒక లైక్ ఇచ్చుకో"
అని ఇంకొకడు మతి పోగొట్టారు.
ఇక లాభం లేదు లే
అని మొబైల్ ఆన్ చేసి
ఈ కరోనా కవితని
"ఫేస్బుక్లో" పెట్టేసా.
😷😷😷😷😷😷😷😷😷😷😷😷😷😷

క్రింది లింక్లో కవితని చదవగలరు 🦚💐
https://molakanews.page/3hvnlh.html
లేదా
https://molakanews.page/article/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%B6%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%95:-%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%95%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%A8:-%E0%B0%B2%E0%B0%BF%E0%B0%96%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%97%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE.-%22%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE!-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%81-%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AA%E0%B1%88-%E0%B0%93-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B6%E0%B0%BE!-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%9F%E0%B0%BE/3hvnlh.html


7, జూన్ 2020, ఆదివారం

కరోనా కవిత[సంచిక అంతర్జాల వారపత్రికలో ప్రచురితమైన కవిత]{28/06/2020}

కరోనా కవిత- 1
కవితా శీర్షిక:- కరోనా పై కవిత్వం (సంచిక అంతర్జాల వారపత్రికలో)
{28/06/2020}
కవితా రచన:- లిఖిత్ కుమార్ గోదా

సాహితీవేత్తలందరూ
బ్యాట్ పట్టి క్రీజులోకి దిగి
కరోనా పై శతకాల దంచేస్తుంటే,
నేనేమో బ్యాట్ పట్టి కూడా
విడ్డూరంగా ఒక్క రన్ కూడా తీయలేదు
కనీసం కరోనా అన్న పేరు
రాయడం కాదు కదా!
అసలు దాని ఊసే మర్చిపోయాను.
రాద్దాం అనుకుంటే
ప్రతిసారి "శానిటైజర్తో
హ్యాండ్ వాష్" అంటూ
చేతులు కడిగి కడిగి
చేతులు నానిపోయాయి.
బ్యాట్ (పెన్ను) పట్టుకుంటే జారిపోతుందాయే.
"గంటకోసారి నీళ్లు తాగుతూ ఉంటే
నోట్లో నానుతున్న "కరోనా కవిత"
మళ్లీ నీటితో పాటే
లోనికి వెళ్లి పోతుందాయే."
సరే గట్టిగా కష్టపడి
'కరోనా పై సమరం'అంటూ
ఏదో రాద్దామనుకున్నా
వాయిస్ టైపు చేసి
బాల్ ని బౌండరీకి తరలిద్దామనుకుంటే
ఫీల్డర్లు చుట్టుముట్టినట్టుగా 
"మాస్క్ నా మూతికి అడ్డుగా" ఉందాయే!
సరే! జనంలోకి వెళ్లి
జన సంచారం చేస్తూ
ఎవరన్నా కవిమిత్రుల దగ్గర
కరోనా పై కవిత్వం చెప్పి
"వాహ్.. క్యా బాత్ హై"
అనిపించుకుందాం అనుకుంటే
ఇంటి బయటికి పోతే
పోలీసు మామయ్యలు బాల్ ని ఎప్పుడు
క్యాచ్ పడదామా అన్నట్టు
కళ్లప్పగించి నిప్పులు కక్కే ఎండలో ఎదురుచూస్తున్నారు.

ఇక "జనసంచారంని విరమించుకున్నా"
కరోనా కవిత్వానికి
లాక్ డౌన్ వేసా.
ఇక ఏమీ చేయలేక
నాకు నేనే లాక్‌డౌన్‌ వేసుకుని
ఇంట్లోనే ఉంటూ
వలస కూలీల ఇక్కట్లను ,
మహా దాతల త్యాగశీలితా బుద్ధిని,
రాలుతున్న జీవితాలను, 
వెజ్జు మహాశయుల
మహోన్నత కృషిని,
కరోనా పై కొత్త అప్డేట్స్ తిలకిస్తూ
వేసవికాలంలో
ఎండ తీవ్రతకు
నన్ను తడిపే చెమటను
నివారించుకోవడం కోసం
"వ్యక్తిగత శుభ్రత" పాటిస్తున్నాను.
ఇక ఏం చేయాలో
ఆ పరమేశ్వరుడుకెరుక.
ఈ కరోనా భావమేమి తిరుమలేశా?
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀

క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇
https://www.sanchika.com/corona-pai-kavitvam/

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...