27, సెప్టెంబర్ 2020, ఆదివారం

భగత్ సింగ్ (మణిపూసలు)- సంచిక అంతర్జాల వారపత్రిక (27.09.2020)

          భగత్ సింగ్( మణిపూసలు )



మణిపూసల కవి:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.


భారతీయ సింహమతడు

బంగాలో పుట్టెనతడు

భగత్ సింగ్ వీరుడే

కుష్వంత్ సింగ్ కు కుమారుడు!

    ********

భారతమాత పుత్రుడు

భయమే లేని వీరుడు

లక్ష్యం స్వాతంత్ర్యమే

ఎదురే లేని ధీరుడు!

     *******

బాంబుల వాన కురిసే

అసెంబ్లీయే జడిసే

విప్లవ వీరున్ని చూసి

దేశమంతా మురిసే!

     *******

అనంతం దేశభక్తి

అపారం అతడి యుక్తి

తెల్ల దొరలు చూసెను

విప్లవ వీరుని శక్తి!

     *****

స్వరాజ్యంకై పోరాడె

ఉరితాడునే ముద్దాడె

భగత్ సింగ్ త్యాగం చూసి

ప్రజలు పోరుకు కదలాడె!

     *********

సంచిక అంతర్జాల వారపత్రికలో నా రచన లింక్ 👇👇👇

https://www.sanchika.com/bhagat-singh/






సంచిక అంతర్జాల వారపత్రిక
96వ రచనా ప్రచురణ
27.09.2020
🔥🔥🔥🔥🔥

21, సెప్టెంబర్ 2020, సోమవారం

మహతీ సాహితీ కవిసంగమం కరీంనగరం వారు నిర్వహిస్తున్న గాంధీ 151 జయంతి వేడుకలు సందర్భంగా ఆ సంకలనం కోసం రాసిన మణిపూసలు. ప్రశంసా పత్రం కూడా పొందాను

 


పొందిన ప్రశంసా పత్రం 👆👆👆

        జాతిపిత మహాత్మాగాంధీ (మణిపూసలు) 



పోర్బందర్లో పుట్టెను

పుతలీబాయి తరించెను

చిట్టి గాంధీని చూసి

కరంచంద్ కళ్లు మురిసెను!


బోసి నవ్వుల తాత

రాసెను చక్కని రాత

మహాత్ముని కథ తెలుసుకుని

చాటుము అతని ఘనత!


సత్యశోధన ఆత్మకథ

ఆదర్శం ఆయని కథ

అలుపే లేని నడకతో

సృజించెను నూతన గాథ!


స్వచ్చభారత్ నాశించె

సువర్ణమైన మది గలిగె

ఫలితమేమీ కోరకా

స్వరాజ్యాన్నే అందించె!


కవి:- లిఖిత్ కుమార్ గోదా

ఊరు:- బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం- 507202

చరవాణి:- 9949618101

18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా రాసిన కవిత ఇది

 (అక్టోబర్ 15 దివంగత రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి జన్మదినం సందర్భంగా రాస్తున్న కవిత)





          మార్గ కిరణం.. అబ్దుల్ కలాం

కవి:- లిఖిత్ కుమార్ గోదా,

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం,

మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల ,బోనకల్.

చిరునామా:-

హౌస్ నెంబర్:-1-115/3,

బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202.

ఫోన్:-9949618101,7658980766.

_________________



ఆయనో గొప్ప "జ్ఞాన కిరణం",

ఆయనే భారతదేశపు "మార్గ కిరణం",

ఆయని మాటే వినసొంపు "చరణం",

కష్టపడటమే ఆయన నోట "స్మరణం",

ఆయన విజయకాంక్షకు పునాదులు వేసినవి

కోరిక,నమ్మకం,ఆశ పెట్టుకోవడమే కా"రణం",

ఆయన శరీరమంతా

విద్య, క్రమశిక్షణ తో నిండిన "కణం";

శాంతిని ఆచరించడం, మంచిని గౌరవించడం

ఎల్లప్పుడూ కృషి చేయడం,

క్రమశిక్షణ అలవడి మెలగడం,

గొప్ప రచనలు చేయడం,

ఇవే ఆయన గడిపిన "తరుణం",

ఆయన ముఖానిది,

భ్రాంతి లేని క్రాంతి "గుణం",

రాష్ట్రపతిగా జనాన్ని ,యువతను 

ఉత్తేజ పరిచింది ఆయన "ఆచరణం",

ప్రజలపై ఆయన చూపినది "ప్రజోపకారణం",

రాష్ట్రపతి పదవిని విడిచాక

ఆయన విద్యార్థులకు చూపింది "గురు చరణం",

క్రమశిక్షణే ఆయన నుండి

భారతీయులు నేర్చిన "ఉదాహరణం",

దేశ భవితకై, పురోగతికై

ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే

బాధ్యతలు తను చేపట్టి

అపజయం తనను తొలిసారి పలకరించినా,



ఆనందం శాంతత్వం ఆయన ధరించిన "ధారణం",

ఆయన రచనలవన్నీ,

యువతకు సందేశానిచ్చే "గుణం",

అసలు విజయం ఆయన ఇంటి "తోరణం",

ఆయన దేశ అభివృద్ధికై,

ప్రజలని మేల్కొల్పడానికి,

రామేశ్వరంలో జన్మించిన ఓ "సూర్యకిరణం",

ఆ భారతరత్న పుట్టి

తెచ్చాడు భారత దేశానికి "గర్వకారణం",

ఆయన పుట్టిన సస్యశ్యామల దేశంలో

నేను పుట్టినందుకు నాకెంతో "గర్వకారణం",

ఆయన ఓ "అమర కిరణం",

ఆయన సేవని నిత్యం

మనందరం చేద్దాం "స్మరణం".

______________________________

👩‍🚀👩‍🚀👩‍🚀👩‍🚀👩‍🚀👩‍🚀👩‍🚀👩‍🚀👩‍🚀

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

మార్గ కిరణం.. అబ్దుల్ కలామ్ https://sanchika.com/maarga-kiranam-abdul-kalam/

హరివిల్లులు (13-16) నేటి (18/09/2020) అల దినపత్రికలో ప్రచురితమైనది

         హరివిల్లులు


మనిషికి కావాలి
మానవత్వపు బుద్ధి,
మనిషివై నిర్మూలించు
సమాజ రోగాల్ని శుద్ధి. (13)   


పరులకు సాయం చేస్తే
మనిషి కీర్తి గగనం,
పరులకై కృషి చేస్తే
మనిషి నిలుచును భువనం! (14)

మనిషికి తప్పదు పోరు
మనసుకు తప్పదు గోడు
మలినం లేకుంటె మనిషి
లోకం నిలుచును తోడు!(15)

స్పందిస్తే హృదయం
సంధించును కవనం,
సమాజ హితం కోరి
కవి చూపు గమనం!(16)

✍️ లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా.
ఫోన్:- 9949618101





🌊🌊89వ రచనా ప్రచురణ🌊🌊

అల దినపత్రిక

18.09.2020

☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️☝️

16, సెప్టెంబర్ 2020, బుధవారం

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనోద్యమం సందర్భంగా రాసిన కవిత

 దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచనోద్యమం సందర్భంగా రాసిన కవిత



లిఖిత్ కుమార్ గోదా

బనిగండ్లపాడు గ్రామం.

కవిత రాసినందుకు పొందిన ప్రశంసా పత్రం 👆👆👆


శీర్షిక:- తిరగబడిన తెలంగాణ జోదులకు..




తిరగబడిన తెలంగాణ జోదులకు..


అమర వీరులకు జోహార్లు జోహార్లు.

నీఛ నైజాముల గుండెకు ఫిరంగులు ఎక్కుపెట్టి తిరగబడిన దివ్య రణం,

రాక్షసులు రజాకార్ల నెదిరించిన రాటుతేలిన పర్వదినం,

విప్లవ వీరులు,వీర వనితలు తుపాకులను చేబట్టి,

తెలంగాణ తల్లి సంకెళ్లను, బానిసత్వాన్ని తుంచడానికి,

భగభగ మండే సహరిలా నిజాం కపట గుండెలో,

ప్రాణభయం పుట్టించిన అమర దినం.

చాకలి ఐలమ్మ కత్తి పోరాటం, దొడ్డి కొమురయ్య వీర మరణం,

మొత్తంగా ప్రపంచమే తెలంగాణ శూరత్వాన్ని కనులారా తరించిన చరిత్ర పుటం.

మాకై అసువులు బాసిన మాన్యులకు,

తెలంగాణ రణ చండీలకు అందిస్తున్నామిదే జోహార్లు.

ఉక్కు మనిషి తిరుగులేని సాహసానికి

అందిస్తున్నామిదే భారత దేశ సమేత వందనాలు..




----సమాప్తం----


 తెలంగాణ విలీన వీరులకు, విమోచన వీరులకు జన జోహార్లు 2020


1) కవితలు form లోనే రాయాలి


2) మీ పేరు, ఊరు రాసిన తర్వాత మాత్రమే కవిత రాయాలి


3) దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 1,2 

వాట్సాప్ గ్రూపులకే ఈ form పరిమితం.

బయటకు షేర్ చేయరాదు


https://docs.google.com/forms/d/e/1FAIpQLScc0kCr5DOhq2vi0Wu6d_vnumsXHIVBiBOzg9uiZbs9RRMpEQ/viewform


  👇👇👇👇



కాళోజీ పుస్తకం మొన్ననే వచ్చింది కాబట్టి కాళోజీ గురించి మళ్ళీ అవసరం లేదు.


తెలంగాణ సాయుధ పోరాట యోధులు చాలా మంది ఉన్నాయి

1 రావి నారాయణ రెడ్డి

2 అరుట్ల రామచంద్ర రెడ్డి

3 కమలాదేవి

4 దొడ్డి కొమురయ్య

5 చాకలి ఐ లమ్మ

6 కొమురం భీం

7 బద్దం ఎల్లా రెడ్డి

వీళ్ళు కమ్యూనిస్టులు


స్వామి రమానంద తీర్థ

బూర్గుల రామకృష్ణ


యిలా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వాళ్లు ఉన్నారు.


కొద్దిగా వెతికి రాయండి



      Download e-book






10, సెప్టెంబర్ 2020, గురువారం

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారు నిర్వహిస్తున్న ఈ-సంకలనం కోసం నేను రాసిన కవిత

              ప్రజారాజ్యం.. తెలంగాణ

కవి:-లిఖిత్ కుమార్ గోదా,

       ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

పొందిన ప్రశంసా పత్రం 👆👆




విలసిల్లుతుంది నా తెలంగాణ ప్రజా సంక్షేమ పథకాలతో,

దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది మా ప్రజా రాజ్యంతో.

మిషన్ కాకతీయతో తటాకాల వైభవం,

మిషన్ భగీరథతో ఇంటింటికి సలిల హరివిల్లు,



కాళేశ్వరం కళకళతో రైతన్నల హర్షాలు,

తెలంగాణ ఆడబిడ్డకు కళ్యాణి లక్ష్మి తోడ్పాటు,

షాదీ ముబారక్ తో ముసల్మాన్ బిడ్డలకు మేలైన సహకారం,

ప్రజా శ్రేయస్సునే లక్ష్యంగా అడుగులేస్తుంది నా తెలంగాణ,



గులాబీ నవ్వులతో గుభాళిస్తుంది నా తెలంగాణ,

ప్రభుత్వ పాఠశాలలో తళుకులు సిరి కళలు

ప్రతి పేదవాణి ముంగిట్లో పరవళ్ళు తొక్కుతోంది నా తెలంగాణ.

గురుకులాల శోభలు, గగనానికి వినిపిస్తుంది

జై తెలంగాణ..నా తెలంగాణ

 ప్రజా క్షేమ మాగాణి.

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారు నిర్వహించిన కొన్ని సాహిత్య కార్యక్రమాల సంకలనాలకు కవితలు పంపినందుకు, క్విజ్ లో పాల్గొన్నందుకు అందుకున్న ప్రశంసా పత్రాలు 





9, సెప్టెంబర్ 2020, బుధవారం

ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కాళోజీ యాది కవి సమ్మేళనంలో నేను ఆలపించిన కవిత


 *తెలంగాణ భాష దినోత్సవం* మరియు *ప్రజా కవి కాళోజి జయంతి* ని పురస్కరించుకుని

ఉసావే సాహితీ సంచిక వాట్సప్ సమూహం ద్వారా నిర్వహించే *"కాళోజి యాది కవి సమ్మేళనం"*

https://chat.whatsapp.com/JtV0eaoO3yH6WP0jlsvuV9

●తెలుగు రాష్ట్రాలు(తెలంగాణ, ఆంద్రప్రదేశ్) కవులు పాల్గొనవచ్చు.


● ప్రజా కవి కాళోజి గురించి 3 నిమిషాల వ్యవధిలో స్వీయ కవిత పఠనం/ పరిచయం తో వీడియో రికార్డు చేసి ఉసావే సాహితీ సంచిక వాట్సప్ సమూహం లో పోస్ట్ చేయాలి.


● వీడియో క్రింద పేరు ఖచ్చితంగా నమోదు చేయాలి.


● *కాళోజి యాది కవి సమ్మేళనం* లో పాల్గొన్న కవి/కవయిత్రి కి ఈ-ప్రశంసా పత్రము అందించడం జరుగుతుంది.


*★ నిర్వహణ:*


*● కొండగుర్ల లక్ష్మయ్య*

      ఉసావే అధ్యక్షులు.


● *జాదవ్ బంకట్ లాల్*

 ఉసావే ప్రధాన కార్యదర్శి.


● *ఆత్రం మోతిరామ్*

  ప్రచార కార్యదర్శి



పొందిన ప్రశంసా పత్రం 👆👆👆





8, సెప్టెంబర్ 2020, మంగళవారం

మణిపూసలు నూతన కవితా ప్రక్రియలో నేను రాసిన లఘు కవితలు

         

💎💎*మణిపూసలు నూతన కవితా ప్రక్రియ*💎💎

*మణిపూసల నియమాలు*


1) మణిపూసలో నాలుగు పాదాలుంటాయి.


2) 1,2,4 పాదాల్లో అంత్యానుప్రాస మరియు 10, 11, 12 మాత్రల నుండి ఏదైనా ఒక సంఖ్యనే ఉపయోగించాలి. అనగా ఈ పాదాల్లో మాత్రలు సమానంగా ఉండాలి. 


3) 3వ పాదానికి అంత్యానుప్రాస ఉండరాదు.10 నుండి 12 మాత్రలుండాలి.


4) 3, 4 పాదాల్లో కవితా మెరుపుండాలి.


【లఘువు(I)ను ఒక మాత్రగా, గురువు(U)ను రెండు మాత్రలుగా లెక్కిస్తారు.】


*ఉదా:*


ప్రేమను పంచని సతి

U l l U l l l l

2 1 1 2 1 1 1 1=10


బాధ్యత మొయ్యని పతి

U l l U l l l l

2 1 1 2 1 1 1 1=10


ఉన్నలాభ మేమిటయ్య

U l U l U l U l

2 1 2 1 2 1 2 1=12


ఇడుములు బాపని మతి

l l l l U l l l l

1 1 1 1 2 11 1 1=10


*******************


మంచితనం పంచుదాం

U l l U U I U

2 1 1 2 2 1 2=11


మలినగుణం తుంచుదాం

I I I I U U I U

1 11 1 2 2 1 2=11


మనిషికొక్క మొక్కనాటి

I I I U I U I U I

1 11 2 1 2 1 2 1=12


మరువకుండ పెంచుదాం

I I l U I U I U

1 1 1 2 1 2 1 2=11


*******************


మణిపూసల కవులకంత

I I U I I I I I U I

1 1 2 1 1 1 11 2 1=12


చదువుచున్న జనులకంత

I I I U I I I I U I

11 1 2 1 1 1 1 2 1=12


వందనాలు వందనాలు

U I U I U I U I

2 1 2 1 2 1 2 1=12


ప్రోత్సహించుఘనులకంత

U I U I I I I U I

2 1 2 1 1 1 1 2 1=12



*వడిచర్ల సత్యం*

మణిపూసల సృష్టికర్త

7989511543.

సృష్టికర్త:- వడిచర్ల సత్యం గారు



మణిపూసల కవి :- లిఖిత్ కుమార్ గోదా


*మణిపూసలు*


మణిపూసలు నూతన కవితా ప్రక్రియ

సృష్టికర్త:- వడిచర్ల సత్యం గారు

మణిపూసల కవి :- లిఖిత్ కుమార్ గోదా


చిరునవ్వులకు రేడు

జనులందరూ వేడు

రాజశేఖరుడతడే

నిర్మూలించెను చెడు. (01)


పులివెందులలో జననం

ప్రజాసేవనే మననం

రామరాజ్యం పాలన

జనులు పొందెను పావనం. (02)


తెలుగు రాజకీయ తంత్ర

ప్రజలకై చేసెను యాత్ర

ప్రజా గోడు తీర్చుటలో

పోషించె కీలక పాత్ర!(03)


బ్రహ్మ వాక్కు అతని మాట

స్వర్గమయె నడిచిన బాట

నిండు మనసుతో ఆడెను

ప్రజల కొరకు వాదులాట!(04)


మార్మోగెనులే సదస్సు

వెలిగిపోయెను తేజస్సు

తపో దీక్షతో రేడే

తెచ్చెను తెలుగుకు ఉషస్సు!(05)

సామాజిక తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన నా మణిపూసలు (23/09/2020)👆👆








93వ రచనా ప్రచురణ

సామాజిక తెలంగాణ దినపత్రిక

23/09/2020



జ(విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి (సెప్టెంబర్ 10) సందర్భంగా)


నందమూరు జననం

అలరించెను కవనం

విశ్వనాథ కవిసామ్రాట్

కీర్తి పొందె గగనం.


     * * * * *

జ్ఞానపీఠ్ పురస్కారం

తెలుగు జాతి మణిహారం

వివిధ ప్రక్రియల్లో

చేసెనతడు సంచారం.


     * * * * 


తెలుగు భాష ప్రియుడతడు

సంస్కృతాంగ్లమున ఘనుడు

వేయిపడగలు మోహనమే

తెలుగు వారి పూజ్యుడతడు.


     * * * *


కావ్యాలెన్నో రాసెను

విమర్శలెన్నో చేసెను

విశ్వనాథ మాన్యుడే

తెలుగుకు వన్నెను తెచ్చెను.


   * * * *


కిన్నెరసాని పాటలు

కనువిందైన తోటలు

విశ్వనాథుల అక్షరపాణి(కరకవనం)

సృజించె పూల మాలలు.

https://molakanews.page/vZiDJ7.html


🌱🌱86వ రచనా ప్రచురణ 🌱🌱

************


ఖలుడు వీడడు కుటిలం

అతని మార్చుట జటిలం

కారణం తెలుసునా

మనసు ఉండదు పదిలం! (08)


పుస్తకమో పాలపుంత

తీర్చును మదిలో చింత

మిక్కిలి పఠనం చేసి

మారుదాం మనమో వింత! (09)


మిత్రుడు మనకొక నీడ

తొలిగించు రిపుల పీడ

మిత్రుడే మన బలము

ఉండకు అతన్ని వీడ. (10)


పెద్దలను సేవించు

పిన్నలను ప్రేమించు

అందరినీ ఆదరించి

లోకాన్ని శాసించు! (11)


వీడాలి కపట బుద్ధి

కావాలి చిత్తశుద్ధి

చిగురించిన ఆశలతో

వెలుగును మానవ వృద్ధి. (12)

త్రిశూల్ సమాచారం దినపత్రికలో ప్రచురితమైన నా మణిపూసలు

87వ రచనా ప్రచురణ

12.09.2020






___________________

తెలగాణయే మురిసే

కవన సమరం మెరిసే

కాళోజీ యోధునికి

నిజాం నవాబు జడిసే!


నిండుగ నిరాడంబరుడు

తెలగాణ వైతాళికుడు

రజాకార్ల నెదిరించిన

అపర పోరాట యోధుడు!


వ్యంగ్య కథా రచయిత

అస్త్రం అతని కవిత

కాళోజీ చూపెనులే

తెలంగాణకు భవిత!


వివక్షనెదిరించిన కవి

ప్రజలను మేల్కొలిపిన రవి

లూయీ అరగాన్ గా

శ్రీశ్రీ పొగిడిన జనకవి.


కాళోజీ నారాయణరావు మణిపూసలు మొలక న్యూస్ లో ప్రచురితమైనవి. క్రింది లింక్లో మణిపూసలు చదవొచ్చు 👇👇👇

https://molakanews.page/ash_DG.html

🌱🌱85వ రచనా ప్రచురణ 🌱🌱

🌱🌱మొలక న్యూస్🌱🌱

🌱🌱వేదాంత సూరి తిరునగరి గారు 🌱🌱


తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ (పాలమూరు) ఆధ్వర్యంలో జూమ్ యాప్లో నిర్వహించిన కవి సమ్మేళనంలో(కాళోజీ నారాయణరావు జీవితం-సాహిత్యం) పాల్గొన్నందుకు అందుకున్న ప్రశంసా పత్రం 👆👆


✍️లిఖిత్ కుమార్ గోదా,

 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.


06.09.2020

హరివిల్లు నూతన కవితా ప్రక్రియ

 🌈🌈 హరివిల్లులు నూతన కవితా ప్రక్రియ 🌈🌈



కోకిల గానం తెచ్చు

తెలుగింటికి పరవళ్లు

కవుల కమ్మని కలమే

సృజించును హరివిల్లు.(ప్రోత్సాహక విజేత)

(26.08.2020)



గర్జించితే సింహమే

వణుకే పొందును వనము

కలం పెడితే కవులే

కవనం భేరి ఘనము.(2) 27.08.2020.



అంకిత భావ కవులే

సృజించు కమ్మని కవనం,

మహిలో ప్రశాంతికి చెట్లు

తపించి పంచును పవనం (03)

(28.08.2020)


ఖలుని కమ్మని పలుకులే

తెచ్చును మనకు ముప్పు

చల్లగా ఉండు నీరే

ఇనుముకు పట్టును తుప్పు!(04)

(ప్రోత్సాహక విజేత)

(29.08.2020)



తనలోని ప్రతిభను మరిచి

పరులలో వెతుకు మనిషి.

తనలో సౌరభం మరిచి

పూలను వెతుకు కస్తూరి.

(30.08.2020)












కపటం కలిగిన మదికి

తిమిరమై ఉండు లోకం

అవ్యాజముగల మనిషికి

దరిచేరదులే శోకం.(06)

(ప్రోత్సాహక విజేత)

(31.08.2020)


గాయం చేయును పరులకు

ఎక్కువ(మిక్కిలి) పెరిగిన గోరు.

బాధే పెట్టును పరులను

అదుపే లేని నోరు.! (07)

(ద్వితీయ విజేత){01.09.2020}


వెలుగే లేని దారిలో

పయనించితే కే(వే)తనం.

వెలుగులున్న బాటలో

శ్రమించకుంటే పతనం. (08)(02.09.2020)

🔱🔱త్రిశూల్ సమాచారం దినపత్రిక 🔱🔱

08.09.2020

84వ రచనా ప్రచురణ

ఖలుడ్ని ఎంత తిట్టినా

బాధపెట్టవు చివాట్లు,

ఎంత చెబితేని గేదెకు

మార్చదు తన అలవాట్లు. (09)(03/09/2020)


ఘోర తపస్సు చేసినా

ఖలుడు వీడడు కుటిలం,

పాలు కలిసిన "వారి"ని

విడదీయుట జటిలం. (10)

(ప్రోత్సాహక విజేత)(04.09.2020)


నిత్యం కష్టపడినా

గర్వపడదెపుడూ చీమ,

గొప్ప కార్యాలు చేసిన

పోడు వివేకి ధీమా!(11)

05.09.2020


మానవత్వమున్న మనిషి

తీర్చును పరుల గోడు,

కష్టం తెలిసిన మనిషి

నిత్యం ఉండును తోడు. (12)

(ప్రోత్సాహక విజేత)(06.09.2020)




నేటి ప్రస్థానం జాతీయ దినపత్రిక (వెన్నెల సాహిత్య పేజీ)

88వ రచనా ప్రచురణ

14.09.2020.

మనిషికి కావాలి

మానవత్వపు బుద్ధి,

మనిషివై నిర్మూలించు

సమాజ రోగాల్ని శుద్ధి. (13)

(07.09.2020)


పేరు:- లిఖిత్ కుమార్ గోదా

ఊరు:- బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202

   హరివిల్లు నూతన కవితా ప్రక్రియ నియమాలు 👇👇

రోజుకొక హరివిల్లు చొప్పున రాసిన వారికి,100 హరివిల్లులు అయిన తర్వాత హరివిల్లు పురస్కారం ఇవ్వబడును

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


  🌈🌈 *ప్రక్రియ ..హరివిల్లు* 🌈🌈



 రూపకర్త :-

 *శ్రీ మామిడి రమేష్ గారు** 


నిర్వాహకులు:-

 *శ్రీ వి.టి.ఆర్. మోహనరావు గారు* 

 *శ్రీ సీర హరిప్రసాద్ గారు* 



 *నియమాలు* 


 *1. నాలుగు పాదాలు* 


 *2.ప్రతీపాదములో 8నుండి 12 మాత్రలు మాత్రమే ఉండాలి.* 


 *3. 2,4 పాదాలలో చివర అంత్య ప్రాస ఉండాలి.* 


 *4. రోజుకు ఒక హరివిల్లు మాత్రమే రాయాలి .* 


🌈1

హృదయం మేఘమైతే

భావం కురిసే జల్లు

సాహిత్యాకాశంలో

కైత విరిసే హరివిల్లు


🌈2

గొప్పకాదు బతుక 

కొన్ని వత్సరములు 

నీతి తప్పకుండ 

నిముషమైన చాలు



🌈3

మనసులోని భావాలు

సుస్వరాల రాగాలు

చక్కని కళాఖండాలు

అవే మన హరివిల్లులు  




🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

హరివిల్లు సంఖ్య.. 


--------------------------

-------------------------

-------------------------

---------------------------


పేరు... 

ఊరు.. 


   పై ఫార్మేట్ ప్రకారం రోజుకి ఒక హరివిల్లు మాత్రమే రాయగలరు..

   ప్రతీ రోజు ఉదయం ..6 నుండి సాయంత్రం 6 లోపు పోస్ట్ చెయ్యాలి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...