27, ఆగస్టు 2020, గురువారం
మన అభిమాన బాలల పత్రిక మొలక న్యూస్ లో ప్రచురించిన నా ముత్యాల పూసలు (మిత్రుడు)
16, ఆగస్టు 2020, ఆదివారం
ముత్యాల పూసలు ప్రక్రియలో మూడోవ వారం అంశం:- బాల కార్మిక వ్యవస్థ-చట్టం
ముత్యాల పూసలు నూతన కవితా ప్రక్రియ
(బాల కార్మిక వ్యవస్థ - చట్టం నిర్మూలన)
కవి:- లిఖిత్ కుమార్ గోదా
వృత్తి:- ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం,మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల.
చిరునామా:- ఇంటి నెంబర్:- 1-115/3,
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202.
0️⃣1️⃣
అవ్యాజ కన్నుల్లో కన్నీళ్లు
పసి బుగ్గలపై మసి
చిట్టి చేతులకు బొబ్బలు
దెబ్బలు దాచిన పాదాలు
కుటుంబం ఆర్థిక పరిస్థితులకై
పలక బలపం వీడి
పారలు పట్టిన పిల్లలు.
0️⃣2️⃣
బడి బాట తెలియరు
పొత్తం పరిమళం ఎరుగరు
కుటుంబ పోషణ కోసం
చిన్నవాళ్లు అయినా కానీ
పెద్ద మనసుతో నడక
మార్చాలి మనమంతా కలిసికట్టుగా
బాల కార్మిక వ్యవస్థను.
0️⃣3️⃣
తాగుతున్న నాన్నను చూసి
కన్నీరెడుతున్న అమ్మను చూడలేక
బడి బాట పట్టాల్సిన
చిన్నారి పొన్నారి బాలలు
పారా పలుగు చేపట్టి
పేదరికానికి ఎదురుగా నిలబడి
సంపాదనకై కూలీ పనులు.
0️⃣4️⃣
చిరిగిన బట్టలు మేనుపై
మాంసపు కండలు కరిగి
రక్తపు ముద్దలు అరిగి
బొబ్బలు చేరిన చేతులతో
దెబ్బలు తగిలిన పాదాలతో
దేహం స్వేదంతో తడిచి
అనాధలుగా బాల కార్మికలు.
0️⃣5️⃣
ఆశలు ఎన్నో అణుచుకొని
బడిలో చదువులు వదులుకొని
ఇంట్లో సరదా మాపుకొని
చిట్టి కడుపుకు కూడుకై
ఇంటి బాధ్యత తీసుకొని
ఇల్లు కర్మాగారాలు పొలాలు
వైపు అడుగులు చూపి
కష్టాలు కొలిమిలో మొగ్గలు.
0️⃣6️⃣
ప్రభుత్వం ముందడుగు వేయాలి
బాల కార్మిక నిర్మూలనకై
కనబడిన బాల కార్మికులను
అనాధలుగా మిగిలిన బాలల్ని
పాఠశాలకు దారి చూపి
ఆసరాగా అండగా నిలిచి
సమాజాన్ని రూపు మాపాలి.
0️⃣7️⃣
బాల కార్మిక వ్యవస్థను
నిర్మూలించడానికి నేడు మనం
ముక్కు పచ్చలారని పసివాళ్ళను
పనులు బాట మాన్పి
బడుల బాట పట్టించాలి
చేయూత ఇచ్చి మనమే
చిట్టి మనసుల నవ్వులు
కనులారా చూసి తరించాలి.
0️⃣8️⃣
జనులలో ఆలోచన రావాలి
మానవత్వం మనిషిలో పరిమళించాలి
కనిపించిన బాల కార్మికులను
వివక్ష వీడి ప్రజలు
సాటి మనిషిలా చూసి
కన్న బిడ్డల్లా తలచి
కొండంత అండగా నిలవాలి.
0️⃣9️⃣
పలుకు పారా వీడాలి
పలకా బలపం పట్టాలి
పొత్తంలో పాఠాలు చదివి
విద్య విలువ ఎరిగి
చదువు సంధ్యలో మునిగి
తోటివారితో నెయ్యం పెరిగి
ఉన్నత శిఖరాలు ఎక్కాలి .
🔟
తలపై మోయలేని బరువులు
కన్నుల్లో కన్నీళ్లు ధారలు
అలసి సొలసిన దేహంతో
సిమెంట్తో ఒళ్ళు తడుపుకుని
కాలుతున్న కాళ్ళ నడకలు
కోరికలు చంపుకుంటున్న బాల
కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి.
8, ఆగస్టు 2020, శనివారం
ముత్యాల పూసలు నూతన కవితా ప్రక్రియలో భాగంగా గృహహింస చట్టం పై అవగాహన కవితలు
ముత్యాల పూసలు నూతన కవితా ప్రక్రియ
రూపకర్త:- ఆత్రం మోతిరాం
కవి-లిఖిత్ కుమార్ గోదా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల బోనకల్ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం-507204.
నివాసం:-బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202.
----------
1)
అమ్మలా చూడాలి భార్యని
గౌరవించాలి ప్రతి ఇల్లు
అతివల శ్రేయస్సు ముద్దని
గృహహింసలు అసలే కద్దని
అంటూ సాగితే ప్రతి
ఇల్లు అవుతుంది స్వర్గం
ఆనందాలు వెలిసే దేవాలయం.
2)
ఇల్లాలి శోకం ఇంటికి
తెస్తుంది చేటు సత్యం
గృహ హింస జరిగితే
ఉపేక్షించదు భారత ప్రభుత్వం
ఇల్లాలి నవ్వులు తెచ్చును
ఇంటికి హరివిల్లుల సంబరం
ఇంటికి దీపం ఇల్లాలు.
3)
బోనులో బంధించిన జీవియై
పడతి శోకాల సంద్రంలో
సంకెళ్ళు చేతికి వేసుకొని
ఇక్కట్ల క్షోభ అనుభవిస్తే
చెల్లించాలి భారీ మూల్యం
ప్రతి కుటుంబ సభ్యుడు
ఇంటికి వెలుగు పడతి.
4)
పట్టీల సవ్వడితో పండుగలను
గాజుల రవళితో చందమామలా
ఇంటిని ఆనందంగా నిలిపే
అతివని అల్లరి చేస్తే
అమ్మ నాన్నలై తోడు ఉండాల్సిన
అత్తమామలే క్షోభ పెడితే
ప్రభుత్వ చట్టమే అండ.
గృహహింస- చట్టం పై అవగాహన భాగంలో ముత్యాల పూసలు ప్రక్రియలో 10 కవితలు రాసినందుకు పొందిన"చైతన్య ముత్యం"పురస్కారం..
5)
కార్చీకట్లో గదిలో సంసారం
తాగుబోతుల తారకులు మ(మృ)గాళ్ళు
సిగరెట్ల వాతలు అనుభవిస్తే
తాగి తందనాలు ఆడితే
తీరిక లేకుండా దండిస్తుంటే
తిట్ల దండకాలు క్షోభపెడితే
కాలుమోపు చట్టం వైపు.
6)
ఇంట్లో పతియే యముడయ్యి
ఇంటి నరకంగా మార్చి
అనునిత్యం సూటిపోటి మాటలతో
తాగి తందనాలు ఆడుతూ
పడతిని గుచ్చిగుచ్చి వేధిస్తే
గురుడికి తప్పదు చిప్పకూడు
జైలు అతనికి గూడు.
7)
చట్టానికి విరుద్ధంగా మారి
కట్నాల కష్టాలు పెట్టి
కన్నీళ్లతో ముఖాన్ని తడిపి
కలహాలతో మనసును నలిపి
మానసిక క్షోభకు గురిచేస్తే
ఆడది చట్టంకై నడిస్తే
మగాడికి తప్పవు కొరడాదెబ్బలు.
8)
అవ్యాజము తన ప్రేమ
అసమానం తన కష్టం
ఆప్యాయత అనురాగం ప్రేమ
అత్తమామలను చేయును నిత్యం
అమ్మ లాగా లాలన
నాన్న లాగా పాలన
గృహహింసలు తెచ్చిన చేటు.
9)
యత్ర నార్యంతు పూజ్యంతే
రమంతే తత్ర దేవత
అన్న సూక్తిని మరిచి
అవధులు దాటి హేళనచేస్తూ
సూది లాంటి మాటలు
దెబ్బలు కొట్టి వేధించడం
తగునా నీకు మగాడా?
10)
గొళ్లాల చాటున రోదన
ఇల్లాలు ఇక్కట్లు పడుతుంటే
అమ్మ లాంటి అతివలను
అవధులు దాటి అల్లరిపరిస్తే
సహనం కోల్పోయి భార్య
సంసారం బాగు కోసం
చట్టం వైపు నడకలు
30, జులై 2020, గురువారం
ముత్యాల పూసలు నూతన కవితా ప్రక్రియలో
రచనలు
కుట్టు ఎవుసం పోయెమ్
కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...
-
కదిలించే కవనాలు... "హరివిల్లు"ల అక్షర జలపాతాలు Download e-book తరి ముందుకు నడుస్తున్న కొద్దీ తెలుగు సాహితీవనంలో కొత్త కొత్త మొల...
-
కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...
-
*మణిపూసల కుటుంబ సభ్యులకు వినమ్ర నమస్కారాలు!* నా పేరు *లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం* _మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీస...














