మొలక పిల్లల పత్రిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మొలక పిల్లల పత్రిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, సెప్టెంబర్ 2020, ఆదివారం

🌱🌱మాన్యులు శ్రీ వేదాంత సూరి తిరునగరి గారు సెప్టెంబర్ 17న వాట్సాప్ ద్వారా "క.శ.ప (కథా శతక పద్యం) అనే పుస్తకాన్ని సమీక్ష చేయమని చెప్పి పంపారు. పుస్తకం,అందులోని క.శ.ప లు అత్యద్భుతంగా ఉన్నప్పటికీ నాకు తోచిన రీతిలో పుస్తక సమీక్ష చేసాను. అది మన అభిమాన బాలల పత్రిక మొలక న్యూస్ లో ఈరోజు (06.09.2020)నా ప్రచురితమైంది. ఇది నా 4వ పుస్తక సమీక్ష. 80వ రచనా ప్రచురణ 🌱🌱.

 తెలుగు వారసులకు బహుమతి.. క.శ.ప (కథా శతక పద్యం) (పుస్తక సమీక్ష)


పుస్తక రచయిత:-  బి.వి.ఎన్. స్వామి


పుస్తక సమీక్షకుడు:-  లిఖిత్ కుమార్ గోదా,

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల.
_________________
తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియకు, శతక పద్యాలకు విశిష్టమైన స్థానం ఉంది. కథ చెప్పుకోవడానికి కనువిందుగా ఉంటే, నీతిశతక పద్యాలలో మాత్రం నాలుగు పాదాల్లో శతక కవి ఏం చెప్పదలచుకున్నాడో ఇట్టే అర్థమైపోతాయి.
రెండు సాహిత్య ప్రక్రియలు కూడా నైతిక విలువలు నూరుపోస్తూ, చక్కని నడవడిని నేర్పిస్తూ, ఆలోచింపజేసే తత్వాన్ని రేకెత్తిస్తాయి.
పసి మనసుల్లో సద్గుణాలు విరబూయాలనే దృక్పథంతో ఆనాడు కథలు, సామాజిక విలువలు, చైతన్యం, ప్రజా జాగృతి రావాలనే సదుద్దేశంతో ఆనాడు శతక కవులు నీతి శతకాలను రాశారు. వేమన పద్యాలు, సుమతి సూక్తులు ఈనాటికీ ప్రతి తెలుగువారి నాలుకలపై నాట్యం చేస్తూ అందరిని రంజింప చేస్తున్నాయి.

క.శ.ప(కథా శతక పద్యం) పుస్తకం ముఖచిత్రం.


క.శ.ప పుస్తక రచయిత శ్రీ బి.వి.యన్.స్వామి గారు
(మాన్యులు శ్రీ వేదాంత సూరి తిరునగరి గారికి బావ గారు)

🌱🌱 మొలక న్యూస్ ఆన్లైన్ మ్యాగజైన్ సంపాదకులు శ్రీ వేదాంత సూరి తిరునగరి గారు 🌱🌱




ప్రస్తుతం నేటి బాలల్లో కథలు చదివే తత్వం కాస్తోకూస్తో ఉంది. కథల పుస్తకమో, లేదా ఉపాధ్యాయులు చెప్పే చిట్టి చిట్టి కథలుకు మురిసిపోయి గంతులేస్తుంటారు. కానీ మన వారసత్వంగా వచ్చిన అమూల్యమైన నీతి శతక పద్యాలు అంటే కాస్త చేదు భావాన్ని వ్యక్త పరుస్తారు. "ఈ పద్యాన్ని నేనెలా గుర్తుంచుకుంటాను బాబోయ్, ఈ పదాలు నేనెక్కడ పలకగలను బాబోయ్," అంటూ వెనక్కి మళ్ళి పోతున్నారు. నీతి శతక పద్యాలు అంటే కేవలం నీతి సంపదే కాదు, జ్ఞానం పదకోశ భాండాగారం. నాలుగు పాదాల్లో గొప్ప అర్ధాన్నిచ్చే మన నీతి శతక పద్యాలను పక్కన పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే మనది తెలుగుజాతి. నీతి శతక పద్యాలు మనకు వజ్రవైఢూర్యాలు తో సమానం. ఎంత దాచుకుంటే అంత ఉన్నతుడిని చేస్తాయి.

ఆధునిక పరిజ్ఞానం పెరగడం ద్వారా సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు వంటివి పిల్లల చేతుల్లోకి రావడం వలన తెలుగు పిల్లలు పద్యాలను పక్కన పెట్టేస్తున్నారు. రేపు మన శతక పద్యాలు, శతక కవులు, కమ్మని కథలు మరుగున పడిపోకూడదనే సత్సంకల్పంతో రచయిత బి.వి.ఎన్ స్వామి గారు తమ సాహిత్య అనుభవాలుతో ఈ క.శ.ప(కథా శతక పద్యాలు) అనే నిత్యనూతన కథా ప్రక్రియను సృజించారు. మన తెలుగు భాషలో కవిత్వం, కొత్త సోయగాలతో రోజుకొక ప్రక్రియగా రూపుదిద్దుకుంటున్నాయి. కానీ కథా ప్రక్రియ మటుకు "గల్పిక, కార్డు కథలు, మినీ కథలు వంటి" వేళ్ళ మీద లెక్క పెట్టే సంఖ్యలోనే ఉంటున్నప్పటికీ కొత్తగాను, కొత్తదై పరిమళిస్తుంది తెలుగు కథా ప్రక్రియ.

తెలుగు కథా సాహిత్యానికి, నీతి శతక పద్యాలకు నూతన రూపాన్ని సృష్టించాలనే దృక్పథంతో క.శ‌‌.ప ను సృష్టించి ఉంటారని అనుకుంటున్నాను.
క.శ.ప నియమాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. ఈ ప్రక్రియలో కథ ఒక కథానాయకుడు (బుంగి )చేత ఇంకో పాత్రతో , అంటే ఒకరకంగా మనతో చెబుతున్నట్లు తలపిస్తుంది. కథల్లో మనము లీనమై, బుంగీతో మాట్లాడుతున్నట్టు, కాస్త తెలంగాణ యాసను జోడిస్తూ రచయిత చిట్టి చిట్టి కథలతో, శతక పద్యాలతో క.శ.పను అల్లారు. పుస్తకం మొత్తాన్ని చూసుకున్నట్లైతే ఇందులో మొత్తం 117 కి.శ.ప లు రాయబడి ఉన్నాయి. వివిధ శతక కవులను పద్యాలను పరిచయం చేస్తూ తెలుగు జాతికి తెలియని శతకకవులును కూడా పరిచయం చేశారు రచయిత.
నియమాలు ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం ఎనిమిది నియమాలున్నాయి.
1)ముందుగా మనం ఒక కథను అల్లుకుని, తర్వాత దానికి అనుగుణంగా ఉన్న,
2) నాలుగు పాదాలు ఉండి,
3) నాలుగో పాదం మకుటంగా రచించబడిన నీతి శతక పద్యాలను ఎన్నుకోవాలి.
4) ఇతివృత్తం ఏదైనా, ఒక అంశానికి పరిమితం అయి ఉండి, సంభాషణాత్మకంగా, రెండు పాత్రల ద్వారా కథ నడిపించాలి. అందులో మొదటిది కల్పిత పాత్ర, రెండోది స్వయంగా కథకుడే కావాలి.
5)స్వల్ప వ్యవధిలో పూర్తయ్యేలా ఉండి, 6)పద్యంలోని మూడో పాదం లోని ఏదో ఒక పదాన్ని కథకు శీర్షికగా పెట్టాలి. ఆ పదం కథలో ఎక్కడైనా ఉపయోగించి ఉండాలి.
7) తెలుగు లోని అన్ని శతక పద్యాలను గ్రహించి ఉండాలి.
8) పద్యం ఏ కాలానికి సంబంధించినదైనా, కథలోని అంశం, భావం కొత్తదనంతో ఉట్టిపడాలి. వాస్తవ కల్పనతో వాసికెక్కాలి.
ఇవి రచయిత కరముల నుండి జాలువారిన నియమాలు.

గడిచిన సాహిత్య తరిని పరిశీలించి చూస్తే కొంతమంది సాహిత్యకారులు కథను అల్లుకుని, దానికి తోడుగా పద్యాన్ని జతచేసి క.శ.ప ను పోలిన కథ- పద్యాలు రాసినప్పటికీ అవి ఒకే శతక కర్తనో, శతక పద్యాలనో ఎన్నుకొని రాసినవి.
వారిలో బొల్లేపల్లి మధుసూదన్ రావు గారు"తాతయ్య చెప్పిన కథలు"అనే 64 బాలల కథలకు తోడుగా 64 వేమన శతక పద్యాలను జోడించి పుస్తక రూపంలోకి వెలువరించారు.
తర్వాత బెల్లంకొండ నాగేశ్వరరావు వంటి బాల సాహితీవేత్తలు కూడా వేమన శతకంలోని నీతి సుధలను ఎన్నుకుని పురాణ కథలు, కల్పితకథలు అల్లారు. కానీ అవి ఏవి క.శ.ప నియమానుసారం రాసినవి కావు. అంతే కాకుండా 100 కథ-పద్యాలు పూర్తి ఎందులోనూ కాలేదు.

క.శ.ప కేవలం బి.వి.యన్ స్వామి గారి సాహిత్య అనుభవ కృషి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

"సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్

సిరా దా బోయిన బోవును

కరి మ్రింగిన వెలగ పండు కరణిని సుమతీ!

"

అంటూ సుమతీ కంద పద్యాలు రాసిన శతక కర్త బద్దెన పద్యాన్ని ఎన్నుకొని బుంగితో "సిరి" క.శ.పను నడిపించారు రచయిత,
"వర్షాలు పడక దిగుబడి లేకపోవడంతో అప్పులు పాలైన ఒక రైతు పంటకు ఖర్చయినా పెట్టుబడిని తీర్చడానికి అప్పులు చేసి మరీ దుబాయ్ వెళ్తాడు. అక్కడ ఉదయం నాలుగు గంటలకు మొదలు రాత్రి 12 గంటల వరకు గొడ్డు చాకిరీ చేయించుకుని 12000 వేతనం ఇచ్చేవారని, వాటిలో తన ఖర్చులను సమకూర్చుకుని ఇంటికి 8000 పంపేవాడని తెలియపరిస్తాడు.
దీని వలన ఇంకా అప్పులు పాలవడంతో ఇక తిరిగి ఊరు వచ్చేసి అక్కడ ముప్పావు వంతు ఇక్కడ కృషి చేస్తే తన బాకీలు అన్ని తీరిపోతాయని అనిపించి బొప్పాయి, మామిడి తోటలు రెండు సంవత్సరాలు ఓపిక కృషిచేయగా తన అప్పులన్నీ తీరిపోయాయి"అని చెప్పడంతో కథ ముగుస్తుంది.
నేటి సమాజంలో రైతులందరూ పడుతున్న క్షోభ ఇదే. కనికరించని వరుణదేవుడు వల్లో, రసాయనాల వల్లో పంట సరిగ్గా దిగుబడి కాక అప్పుల పాలవుతున్న రైతులు బయటి దేశాలకు వలసలు పోతున్నారని రచయిత చక్కగా వివరించారు. పరాయి దేశాలు పోవడం కంటే ఉన్న ఊళ్లోనే గొప్ప సంకల్పంతో కృషి చేస్తే సిరి దానంతట అదే వస్తుందని తెలిపారు.


" 

  పట్టు పట్టరాదు పట్టి విడువరాదు 

 పట్టెనేని బిగియ పట్టవలయు 

పట్టు వినుట కన్నా పడి చచ్చుటే మేలు
విశ్వదాభిరామ వినురవేమ!
"
అంటూ వేమన పద్యం లోని సారాన్ని ఉదాహరణగా తీసుకొని నవ్వు తెప్పించే ఎలుక కథ ఒకటి భలే వివరించారు రచయిత. ఈ పట్టు కథను చదువుతున్నంత వరకు కథలో ఆ రెండో వ్యక్తి ఎవరు? బహుశా దెయ్యమా? అన్నట్టు తలపిస్తుంది మనకు." చివరికి గోడపై కనబడిందది. కర్రతో బలంగా కొట్టిన. చచ్చి పడింది ఎలుక" అని ముగించడం తో ఈ కథలో రెండో పాత్ర ఎలుకదా? అని తెలియడంతో ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది ‌. నవ్వులాగవు అసలు ఈ కథ చదువుతున్నంత సేపు.

" ధనము గలుగు చోట ధర్మంబు కనరాదు

 ధర్మం ఉన్న చోట ధనము లేదు 

ధనము ధర్మమున్న మనుజుడే ఘనుడురా

లలిత సుగుణ జాల! తెలుగు బాల!

 
"
-జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తమ తెలుగు బాల శతకం లో రాసిన చక్కటి పద్యం ఇది.
ఈ క.శ.ప శీర్షిక "ధనము.. ధర్మము".

"వ్యాపారం కొత్త దారులు తొక్కుతున్నది"బుంగి అన్నడు.
"నిజమే డబ్బే సరుకుగా వడ్డీ వ్యాపారం జరుగుతుంది". ఈ రెండు సంభాషణలు నేటి కాలంలో వడ్డీ వ్యాపారం ఎలా గంతులేస్తుంది తెలుస్తుంది. ఒకప్పుడు షావుకార్లు ప్రజల అవసరాల కోసం డబ్బులు ఇచ్చి తమ కొట్టును నడిపే వారిని. ఇప్పుడు ప్రజల అవసరాలు ని లాభంగా చేసుకుని గోల్మాల్ చేస్తున్నారని అంటాడు బుంగి.
కథలు ఇలా సంభాషణ కూడా జరుగుతుంది-
"ఆనాటి వ్యాపారులకు తాము జనం వల్ల బ్రతుకుతున్నాము అనే స్పృహ ఎక్కువగా ఉండేది. ఈనాటి వాళ్లు మా వల్లనే జనం బ్రతుకుతున్నారు అనే అహం లో ఉన్నారు"అంటూ లేచి వెళ్ళి పోతాడు బుంగి.
అలా లేచి వెళ్లిపోవడంలో సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై అసహనం మనకు తీక్షణంగా కనపడుతుంది. ఎందుకంటే బుంగి నిజాయితీ కలిగిన వ్యక్తి.

"మాటలు యీటెల వంటివి
 దాటినచోనవి పెదవి ధాటిగ వచ్చున్
మాటే ప్రాణ నమంబుగా
మాటలు మాట్లాడు మంచి మన్నన మురళీ! "-
అంటూ పబ్బ మురళి తన మురళి శతకంలో నుంచి గ్రహించబడింది.

ఈ కథలో ఒక వ్యక్తి ఇంటర్వ్యూ కి వెళ్లి నీకు నచ్చిన రచయిత పేరు చెప్పమంటే తప్పకుండా వస్తాడు. సాహిత్య విద్యార్థి అయ్యుండి కూడా సమాధానం ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు.
"పుస్తకం చదవడం, పరీక్షరాయడం, మార్కులు కొట్టేయడం ఇదే నాకు తెలుసు"అంటూ సమాధానం ఇస్తాడు.
తర్వాత కాస్త చిరాకు వ్యక్తం చేస్తాడు.
ఈ క.శ.పను జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ
పై మాటలు ప్రస్తుత విద్యార్థుల చదువులను తెలియజేస్తున్నాయి. పాఠాలు చదవడం, పరీక్షల్లో వాటికి అనుగుణంగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయడమే కానీ అందులో ఉన్న సారాన్ని, ముఖ్య ఉద్దేశాన్ని నేటి విద్యార్థులు ఎవరు గ్రహించడం లేదని చేదు నిజాన్ని వ్యక్తపరుస్తున్నారు రచయిత.
ఇలాంటి కథలు మరెన్నో ఈ ఈ కథ శతక పద్యంలో నిక్షిప్త పరిచి ఉన్నాయి. ఇవి కేవలం పిల్లల కోసం రాసిన ఏమి కాదు. ఒక సామాజిక దృక్పథంతో, సమాజంలో చోటు చేసుకుంటున్న దుర్గతులను తెలియపరచాలని సదుద్దేశంతో రాసిన క.శ.పలు. ఇవి అన్ని తరాల వారికి ఉపయోగకరం. అందరూ ఆచరణీయ కరం.
కథలు చదువుతూ పద్యాలు నేర్చుకోవడం ద్వారా మన తెలుగు భాషను కాపాడుకుని నట్లు అవుతుంది, మన జ్ఞాన భాండాగారాన్ని మరింత మెరుగ్గా, నైతిక విలువలతో కూడా మెలగడమూ తెలుస్తుంది. రచయితలందరం ఈ క.శ.పను అనుసరించి మన తెలుగు వారసులకు గొప్ప బహుమతిని అందిద్దాం. తెలుగు వాణి(శతకపద్యాలు, నీతి శతక పద్యాలు) వినిపించి తెలుగు వారిని తెలుగు వాళ్ళగా మలచి ధన్యులుగా జీవించేలా చేద్దాం. భవిష్యత్తులో తెలుగు భాషా మహోన్నతంగా విలసిల్లాలని ఆశిద్దాం. మరోమారు రచయిత కృషికి ధన్యవాదాలు చెప్పకుండా ఉండలేం.
______________

పుస్తక సమీక్షలు-4
మొలక న్యూస్
సంపాదకులు శ్రీ వేదాంత సూరి తిరునగరి
81వ రచనా ప్రచురణ
06.09.2020

క్రింది లింక్లో పుస్తక సమీక్షను చదవొచ్చు 👇👇👇

https://molakanews.page/sE_1VO.html
🔥🔥🔥🔥🔥🔥🔥🔥

5, సెప్టెంబర్ 2020, శనివారం

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా రెండవ కవితా ప్రచురణ నేటి 🌱🌱 మొలక న్యూస్ 🌱🌱 లో

      (ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా)

 
మొలక న్యూస్ ఎడిటర్: తిరునగరి వేదాంత సూరి గారు
           మార్గదర్శకులు.‌.గురువులు

గురువులంటే.. మార్గదర్శకులు ,బహుముఖ ప్రజ్ఞాశాలులు.
గుడిలాంటి బడిలో పాఠాల పూజారులు.
కల్మషం లేని మనసుల్లో సంస్కారాన్ని నాటి
ఛాత్రులను నిరంతరం కంటికి రెప్పలా కాపాడి
ప్రపంచానికి స్వచ్ఛమైన మనుషుల్ని పరిచయం చేసే తోటమాలులు.
నల్లని పలకపైన తెల్లని రాతలు రాసి, దిద్దించి
అంధకారం నుండి వెలుగులోకి తీసుకు వచ్చి
ఉన్నతి వైపు అడుగులను మలిచే ఉదయ భానులు.
దిశానిర్దేశాల్లో అర్జునుడిలా సతమవుతున్నప్పుడు,
శ్రీ కృష్ణుడి లాగా భుజం తట్టి, 
గీతోపదేశం చేసి మార్గనిర్దేశకునిగా మారతారు.
తమ వద్ద ఉన్న సృజనను
స్వచ్ఛమైన మనసుతో పిల్లలందరికీ పంచే కల్పతరువు.. గురువులు.
వివక్ష చూపక విలువలెన్నో నేర్పి,
అక్షరాల పోరులో అందరినీ అజయేల్ని చేస్తారు.
కేవలం తరగతి గదిలో 
పుస్తకాల్లో ఉన్న పాఠాలే కాదు
అమ్మ లాగా అందమైన కథలతో,కోకిల లాగా కమ్మని పాటలతో;
మనసులను హరివిల్లులతో పావనం చేసే స్నేహితులు.
గురువుల పాద పూజ చేసి గుణాన్ని పొందుతాం.
_________________

పేరు:- లిఖిత్ కుమార్ గోదా,
         ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
ఊరు :- బనిగండ్లపాడు గ్రామం, 
             ఎర్రుపాలెం మండలం,
        ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202.
చరవాణి :- 9949618101
 🌱🌱 మొలక న్యూస్ 🌱🌱
🇮🇳🇮🇳79వ రచనా ప్రచురణ 🇮🇳🇮🇳
05.09.2020.

27, ఆగస్టు 2020, గురువారం

మన అభిమాన బాలల పత్రిక మొలక న్యూస్ లో ప్రచురించిన నా ముత్యాల పూసలు (మిత్రుడు)

       ముత్యాల పూసలు (మిత్రుడు)
కవి:-లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం,
బనిగండ్లపాడు గ్రామం ,ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202.
_____________________



1)
అమ్మా నాన్న తరువాత
ఆలనా పాలనల ఆపద్బాంధవుడు
అన్నీ తానై తోడుండు
కుచేలునికి శ్రీకృష్ణుడు మిత్రుడు
సుగ్రీవునికి శ్రీరాముడు స్నేహితుడు
దుర్యోధనుడికి కర్ణుడు మోనిస్
మిత్రుని తోడు శ్రీరామరక్ష.
2)
విదురుడై బోధించును నీతులు
అవ్యాజమైన పేర్మిని కురిపించు
చిరునవ్వులు పంచే శ్రేయోభిలాషి
నిత్యం నీడలా తోడుండు
నిత్యం సత్యం పలుకును
చేసిన తప్పులు మన్నించు
నిజాయితీగా మెలుగును నేస్తం.

మొలక న్యూస్
టి. వేదాంత సూరి గారు
74వ రచనా ప్రచురణ 🌱🌱🌱🌱
27.08.2020
క్రింది లింక్లో ముత్యాల పూసలు చదవొచ్చు 👇👇👇
https://molakanews.page/i0A_Pp.html

24, ఆగస్టు 2020, సోమవారం

మన అభిమాన బాలల పత్రిక మొలక న్యూస్ లో ప్రచురితమైన నా 71వ రచన ఉద్యమిస్తే అక్షరం.. అది దాశరథి రంగాచార్య (కవిత)


    ఉద్యమిస్తే అక్షరం.. అది దాశరథి రంగాచార్య



తెలుగు సాహితీ కుటుంబ సదనంలో

అందమైన నవలా చక్రవర్తి

మన దాశరధి రంగాచార్యులు.

తెలంగాణ జన జీవనం, రైతాంగ పోరాట నేపథ్యాన్ని జీవ శక్తిగా మలచుకుని,

తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని

తన పదునైన దీటైన నవలలతో

మయసభలా చిత్రించిన కళావల్లభుడు.

వరదాచార్యులుచే "గద్య దాశరధి" అని

పేర్మితో పిలిపించుకున్న రతనాల సారధి.

"చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు,జనపదం

జీవనయానం, రానున్నది ఏది నిజం"

వంటి మహత్తర రచనలకు పురుడు పోసిన

తెలుగు సాహితీ తేజం మన రంగాచార్య.

నవల రచన చరిత్రలో

పాత్రోచిత యాసను ప్రవేశ పరిచిన మహా పురుషుడు.

అక్షరం మానవ రూపం దాల్చి

ఉద్యమిస్తే అది దాశరధి రంగాచార్యనే.

✍️లిఖిత్ కుమార్ గోదా

24.08.2020

71వ రచనా ప్రచురణ

27వ కవితా ప్రచురణ

మొలక న్యూస్ 

టి. వేదాంత సూరి గారు

క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇

https://molakanews.page/3MkahM.html

1, ఆగస్టు 2020, శనివారం

పుస్తక సమీక్ష-3(పసందైన బుజ్జి పాటల హరివిల్లు.. ఉయ్యాల జంపాల)

పుస్తకం:- ఉయ్యాల జంపాల
పుస్తక రచయిత:- గంగదేవు యాదయ్య
పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల బోనకల్ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం-507204
చిరునామా:-
హౌస్ నెంబర్:-1-115/3,
బనిగండ్లపాడు గ్రామం ,ఎర్రుపాలెం మండలం ,ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202
ప్రచురించిన పత్రిక:- మొలక న్యూస్
01-08-2020

పసందైన బుజ్జి పాటల హరివిల్లు... ఉయ్యాల జంపాల
(పుస్తక సమీక్ష)


బుజ్జి పాటలమ్మా.. బుజ్జి పాటలు‌. పసందైన పల్లె పాటలు, పిల్లలు మెచ్చే ఆట"పాటలు", ఆహ్లాదాన్ని కలిగించే అందమైన పాటలు, పిల్లల మనసులను చురగొనే కొంటైన పాటలు, అందరినీ అలరించి, ఆకట్టుకునే అపురూపమైన పాటలు.

పసిపిల్లలు బుజ్జి పాటలకి భలే తొందరగా ఆకర్షితులవుతారు. బుజ్జి పాటలంటే చెవి కోసుకొంటారు. అమ్మ ఒడిలో కూర్చుని అమ్మ పాడే"చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా?","చికుబుకు రైలు వస్తుంది.."వంటి పాటలు నుండి, స్కూల్లో టీచర్ లు చెప్పే రైమ్స్, పద్యాలు , పాటలు వరకూ ఊ ప్రతిదాన్ని చటుక్కున ఆకలింపు చేసుకుని ముద్దు ముద్దు స్వరాలతో, ముచ్చటైన పదాలతో అందంగా పాడుతుంటారు. సృజనకు తొందరగా ఆకర్షితిమయ్యే మనస్తత్వం పిల్లలది.
అలాంటి పసి మనసులు తెలిసిన గంగాదేవు యాదయ్య గారు బాలల్లో తియ్యటి చిరునవ్వుల కోసం వారు పాడుకోదగిన బుజ్జి పాటలు ఎన్నో సృష్టించారు. ఆ పసి మనసు దోచే బుజ్జి పాటలు ఉన్న బంగారు పుస్తకమే ఈ "ఉయ్యాల.. జంపాల".
గత 30 ఏళ్లు బోధనా శాస్త్రం లో నూతన పద్ధతులు రూపకల్పనా, వయస్సును, స్థాయిని, ఈ ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకొని పాఠ్యాంశాలు తయారుచేస్తున్నారు యాదయ్య గారు. లిపిలేని కోయ, గోండి భాషల్లో బాల సాహిత్య సృజన కోసం శ్రీకారం చుట్టి ఆయా భాషల్లో మొదటి తరం రచయితలను వెలికి తీసి తమ కార్యశాల ద్వారా ఉత్సాహపరిచి మెరుగులు దిద్దుతున్నారు.
కోయ భాషలో తెలుగు లిపితో 8 పుస్తకాలు, కొండరెడ్ల మాండలికంలో నాలుగు పుస్తకాలు రావడానికి సూత్రధారి యాదయ్య గారు. కోయ భాషలో బాల సాహిత్య సృజనను ఒక ఉద్యమంలా చేశారు. ఇవాళ అనేకమందికి కోయ పిల్లలు వారి మాతృభాషలో బాలగేయాలు పాడుకుంటున్నారు.
ఈ ఉయ్యాల జంపాల బుజ్జి పాటల పుస్తకం లో పాటలు భలే గమ్మత్తుగా, పిల్లలను అలరిస్తూ, ఆకర్షిస్తూ కొత్త లోకానికి తీసుకుపోతాయి. కొన్ని బుజ్జి పాటలు నిత్యం ఇంటి దగ్గర, పరిసరాల దగ్గర జరిగే విషయాలే చెబుతూ "అరే నిజమే కదా! మనము ఎలా చేసుంటాం కదా అనుకుంటాం కదా"అని అబ్బురపడేలా చేస్తాయి.

హా..హా.. ఆహా.. బుజ్జి పాటను ఒకసారి పరిశీలిద్దాం,
 "అమ్మ నీళ్లు తీస్తుంటే
నేను కూడా తెస్తాను!
అమ్మ వంటలు చేస్తుంటే
ఆశ్చర్యంగా చూస్తాను!
ఘుమ ఘుమ వాసన వస్తుంటే
గుటకలు వేస్తూ ఉంటాను!
వంటలు తయారు అవ్వంగానే
అంతా స్వాహా చేసేస్తాను!
శుభ్రంగా స్వాహా చేసేస్తాను
ఆహా
ఏమి ఆహారం!!
- ఈ బుజ్జి పాటను పాడుతూ ఉన్నంతసేపు అమ్మ చుట్టూ తిరుగుతూ, అమ్మ చేసే వంట తరించి ఎవరు అలా చేయరు?
అలాగే "వాన.. గానం" భలే గమ్మత్తుగా ఉంటుంది..
"పై నుండి వాన
కింద నుండి నాన
చెట్టు చేమ స్నానం
ఆకు అలమా గానం"-
నిజమే కదా. పై నుండి వాన పడుతుంది ‌. కింద ఆ వర్షం వలన నేల నానుతోంది. చెట్టు చేమ ఆ వాన చినుకులతో తడిచి స్నానం చేస్తాయి. వాన చినుకులు ఆకుల మీద పడుతూ ఉంటే 'టపటప'మని శబ్దం వస్తుంటే అవి పాడుతున్నట్లే గోచరిస్తుంది.
కొన్ని పాటలు భలే నవ్వులు కురిపిస్తాయి.మొదట గొప్పతనం చెప్పినట్లే చెప్పి తరువాత గాలి తీసినంత పని చేసి నవ్విస్తూ ఉంటాయి. అలాంటిదే ఈ "అనగనగా రాజు"..
"అనగనగా రాజు
కొడతాడు పెద్ద ఫోజు
మూరెడు మూరెడు మీసాలు
బారెడు బారెడు గడ్డాలు
గుర్రాల మీద సవారి
పులిని చూస్తే ఫరారీ"-
నవ్వుకోడానికి పసందైన బుజ్జి పాట ఇది. ఇట్లాంటివి మన బడి పిల్లల నోట్లో కోకొల్లలు.
"నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు" అన్నట్లు సాగుతోందీ "నాగలి..అరక" పాట,
"భూమిని దున్నే బురుక
ఎద్దులు లాగితే ఉరుక
దున్నలు లాగితే బరుక
దున్నిన వానికే ఎరుక
దున్నని వారికి ఏమెరుకా?"
అంటూ హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఇందులో రైతన్న కష్టం ,దానికి పశువుల తోడ్పాటు గురించి ఒకింత అస్త్ర ప్రయోగం జరిగినట్లు తెలుస్తుంది. ఇది ఆనందం కోసమే కాదు ఆలోచించాల్సిన బుజ్జిపాట కూడా.
"నేను పోత ఢిల్లీ"లో-
"కొణిదెస
  కొణిజెర్ల
 కొణిజేడు
 కొడిగెనవాల్లి
ఆపు.. ఆపురా.. నీ లొల్లి
నే.. వెళుతున్నారా.. ఢిల్లీ
నే వచ్చానంటే
చేస్తాను రా నీ పెళ్లి"-
అని పాడుకుంటూ ఉంటే పిల్లలు గొడవలు పెట్టుకుని "నీ పెళ్ళికి డొక్కు లారీ" అనుకున్నట్లు నవ్వొస్తుంది.

"చెక్కెరకేళి" లో
పండుగ హోళీ
తినేది గోళీ
కొట్టేది డోలీ
నమ్లేది పోలి
రాకండి నా జోలి"-అంటూ కొంటెగా బుడుగులు
కుదిరి కుదరక చూపుడు వేలుతో ముందుకి వెనక్కి అంటూ ముఖంలో కోపాన్ని ప్రదర్శిస్తూ అన్నట్లు ఉంది కదూ.
ఇట్లాంటి పాటలు ఎన్నో మనకి ఉయ్యాల జంపాల పుస్తకాలు పొందుపరిచారు రచయిత.
పిల్లలూ! మనం ఈ పుస్తకాన్ని చదివి అటు హాస్యాన్ని, ఇటు ఆలోచనాశక్తిని పెంచుకుని కల్మషం లేని మనుషులుగా, సమాజంపై అవ్యాజమైన ప్రేమను ఒలికిస్తూ అందమైన ప్రపంచాన్ని సృజించు కుందాం. ఏమంటారు బుడుగు లారా! అల్లరి పాపల్లారా!" పండే"నా?.

🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
క్రింది లింక్లో పుస్తక సమీక్ష చదవొచ్చు 👇👇👇👇
https://molakanews.page/qsZH84.html

18, జులై 2020, శనివారం

చేపల్ని కాపాడిన తాబేలు (పిల్లల కథ)


చేపల్ని కాపాడిన తాబేలు ( పిల్లల కథ)

రచయిత:- లిఖిత్ కుమార్ గోదా ,ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
___________________

ఒక చెరువులో చాలా చేపలు, తాబేలు ఉండేవి. అందులో ఒక తాబేలుకి చేపలతో చెలిమి చేయడమంటే చాలా ఇష్టం కానీ ఆ చెరువులోని చేపలు ఆ తాబేలుతో స్నేహం చేసేవి కావు.
ఒకసారి కొన్ని కొంగలు చాలా దూరం నుంచి చేపల వేట కోసం ఆ చెరువు దగ్గరికి వచ్చాయి. ఆ చెరువు లో పుష్కలంగా చేపలు ఉండడంతో ఆ చెరువుకు వెలుపలున్న చెట్ల పైన తమ ఇల్లు నిర్మించుకున్నాయి.
వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే అధిక సంఖ్యలో కొంగలు చేపల్ని వేటాడటం వల్ల చేపల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దాంతో మిగిలిన చేపలన్ని దిగ్భ్రాంతికి లోనయ్యాయి.
వాటి దిగులును చూసిన తాబేలు, చేపలు తనతో స్నేహం చేయనప్పటికీ ఒక శ్రేయోభిలాషులా, స్నేహితునిలా చేపల గురించి విచారం చెందింది.
ఎలాగైనా చేపల్ని ఆ కొంగలు బారినుండి కాపాడి వాటితో నెయ్యం కట్టాలనుకుంది. ఒక ఉపాయం ఆలోచించింది.
మరుసటి రోజు చేపల అన్నింటికీ ఇష్టం లేకపోయినా వాటిని సమావేశపరిచి, తాబేలు"మన చెరువులో మీ చేపల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. కాబట్టి మిమ్మల్ని కొంగల భారి నుండి నేను కాపాడతాను. నేను చెప్పినట్టు చేయండి చాలు. మీలో అనుభవం ఉన్న చేపలు ఎక్కువ సేపు గాలి తీసుకోని నీటి పైకి వచ్చి తేలండి ఆ కొంగలు వచ్చే సమయానికి. నేను నా పథకం ప్రకారం ఈ చెరువుకి మనుషుల వల్ల కరోనా సోకిందని చెప్తాను‌. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారికి భయపడి ఆ కొంగలు పారిపోతాయి. ఇక వాటి బెడద నుండి మీరు సురక్షితలవుతారు. సమ్మతమేనా?"అంది.
చేపలు అన్నింటికీ తాబేలు ఉపాయం నుంచి మనస్ఫూర్తిగా సమ్మతించాయి.
మరుసటి రోజు కొంగలు వస్తుండగా చేపలకి పిలుపునిచ్చింది తాబేలు.
"దాదాపు ఒక యాభై చేపలు దాకా పైకి తేలుతున్నాయి.
అప్పుడు కొంగల్లో ఒకటి "మనకు ఈరోజు శ్రమ లేదు తమ్ముళ్ళు" అని చెరువులోకి రాబోయేంతలో తాబేలు మిక్కిలి దగ్గుకుంటూ "కొంగ మిత్రులారా! ఈ చెరువులోకి రాకండి. గత వారం రోజులుగా ఈ చెరువులోని జీవరాసులన్నీ దగ్గు, జ్వరం, జలుబు, తలనొప్పి తదుపరి రోగాలతో మరణిస్తున్నాయి. ఊపిరి ఆడడం లేదంట వేటికి కూడాను. మీరు వచ్చి ఒక వారం రోజులు అవుతుంది కదా, ఈ చెరువు దగ్గరకి కొంతమంది మనుషులు వచ్చి దాదాపు ఒక పక్షం రోజులు అవుతుంది. వారికి ఏదో కరోనా వైరస్ ఉందని వారు మాట్లాడుకుంటే విన్నాను. అది చాలా ప్రమాదకరమైన రోగమట. బహుశా నాకు కూడా ఆ రోగం సోకినట్టు ఉంది‌. బాగా దగ్గు జలుబు జ్వరం ఉన్నట్టే ఉంది. మీ మంచి కోసమే చెప్తున్నాను. దయచేసి ఈ చెరువు దగ్గరకి రాకండి. మీ ప్రాణాలు కాపాడుకోండి.అహ్హు..అహ్హూ"అని అని గట్టిగా దగ్గింది.
"అమ్మో! కరోనా వైరసా? ఇక ఈ చేపలు వద్దు. చెరువు వద్దు. ఆ తాబేలు మామయ్యని చూస్తే నిజంగానే వాళ్ళకి కరోనా వచ్చినట్టుంది. వెళ్లి క్వారంటైన్ లో కూర్చుందాం. పారిపోయీ ప్రాణాలు రక్షించుకుందాం పదండి"అని రెక్కలకు పని చెప్పాయి కొంగలన్నీ‌.
తమను కొంగల బారి నుండి కాపాడిన తాబేలుకు కృతజ్ఞతలు తెలిపి, అప్పటినుండి దానితో స్నేహం మొదలెట్టాయి చేపలన్ని.

🔱🔱🔱🔱🕊️🕊️🕊️28.07.2020

7, జులై 2020, మంగళవారం

ఈరోజు (07/07/2020) మొలక న్యూస్ లో ప్రచురించిన నా 28వ బాలల కథ [చదువు ఇష్టం లేని చందు]. ప్రచురించిన సంపాదకులు శ్రీ వేదాంత సూరి తిరునగరి గారికి కృతజ్ఞతలు 🌹🌹🌹🌹.

కథ:- చదువు ఇష్టం లేని చందు
(మొలక న్యూస్)
రచయిత:- లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్ .
(మొత్తం ప్రచురణ అయిన రచనలు:-60
మొలక న్యూస్ లో ప్రచురించిన రచనలు:-37)

___________________
స్కూల్ కి వెళ్లడం ఇష్టం లేని చందు ఊరికి, అడవికి మధ్యలో ఉన్న చింత చెట్టు దగ్గరకెళ్ళి, దాని కింద కూర్చుని బ్యాగులో తెచ్చుకున్న బిస్కెట్లు,చాక్లెట్లు తింటూ ఉండసాగాడు.
ఆ చింత చెట్టు మీద ఉన్న దెయ్యం చందూని చూసి, అతనికి చదువుకోవడం ఇష్టం లేదని, అందుకే అ(ఇ)క్కడికి వచ్చాడని గ్రహించింది.
చందూని ఎలాగైనా చదువు వైపు మొగ్గు చూపేలా చేయాలనుకున్నది. కొంచెం సేపు ఆలోచించింది.మెదడులో ఏదో ఒక పదునైన ఆలోచన తగలడంతో చటుక్కున క్రిందకు దూకి ఒక రైతు రూపాన్ని దాల్చి చందు బ్యాగు పట్టుకుని అతని ముందర నడుస్తుంది.
ఆ రైతు రూపంలో ఉన్న దెయ్యం, తన బాగు తీసుకెళ్లడం చూసి చందు "ఏ అంకుల్! ఎక్కడికి తీసుకెళ్తున్నారు నా బ్యాగ్ ని?" అని అడిగాడు.
"నీకు చదువు కూడా ఇష్టం లేదు కదా. అందుకే ఈ బ్యాగ్ ని మా ఇంటికి తీసుకెళ్లి, మా అమ్మకి ఇద్దామని" అన్నాడు.
"అయినా మీకు ఎందుకు? నా ఇష్టం. అది నా బ్యాగు మీరు ఎందుకు తీసుకెళ్తారు?" అడిగాడు చందు.

"నాకెందుకా! అయితే అస్సలు ఇవ్వను. నీకు దిక్కున్న చోట చెప్పుకో పో"అన్నాడు రైతు.
చందు తలదించుకుని,ప్రాధేయ పడుతూ "నా బ్యాగ్ నాకు ఇవ్వండి. ఇంటికి వెళితే అమ్మవాళ్ళు కొడతారు అంకుల్" అని అన్నాడు.
"ససేమిరా కుదరదు.నీ బ్యాగ్ నీకు కావాలంటే నేను ఒక ప్రశ్న వేస్తా. సరిగ్గా జవాబు చెబితే నీ బ్యాగ్ నీకు ఇచ్చేస్తా" అన్నాడు రైతు.
"ఓకే అంకుల్ అడగండి!" అన్నాడు చందు.
          "జీడి వారి కోడలు, వేడి వారి మరదలు, వైశాఖ మాసంలో ఇంటికి తిరిగి వస్తుంది. ఏమిటది?" 
అని అడిగాడు రైతు.
చందు కొంచెంసేపు ఆలోచించాడు. తమ తెలుగు టీచర్ ఒకసారి ఆ ప్రశ్న అడిగితే తన ఫ్రెండ్ సంతోష్ జవాబు చెప్పిన మాటలు గుర్తొచ్చి "మామిడిపండు అంకుల్ జవాబు" అన్నాడు చందు.
"సరిగ్గానే చెప్పావు. కానీ ఆ జవాబు నీకు ఎలా తెలుసు?" అడిగాడు రైతు.
చందు విషయం చెప్పాడు.
"మరి ఆ విషయం ఎలా తెలిసింది నీకు చదువుకోడానికి బడికి వెళితేనే కదా! పాఠశాల అనేది దేవాలయం లాంటిది. గురువులు అందులో దేవుళ్ళు వంటి వారు. బడిని ఆదరించి వెళ్లాలి కానీ, చీదరించుకోకూడదు.
బడికి వెళితే మనకు మంచి సాంగత్యమే కాదు, సర్వ సద్గుణాలు అబ్బుతాయి. అన్ని విషయాలు తెలుస్తాయి. అందరి పట్ల ఎలా నడుచుకోవాలో తెలుస్తోంది.అంతేకానీ బడికి వెళ్ళకుండా ఇలా తిరిగితే నీకు వచ్చే జ్ఞానం, వినయం, సంస్కారం శూన్యం. ఇంకెప్పుడూ ఇలా బడి మానేసి బయట తిరగకు.క్రమం తప్పకుండా బడికెళ్ళి జీవితంలో గొప్పవాడు అయ్యాక నాకు కనబడు. నేను ఇటువైపే ఉంటాను సరేనా. ఇందా నీ బ్యాగ్.."అని అందించాడు రైతు.
చందు ఆ రైతు మాటలో ఆంతర్యం తెలుసుకుని చదువుకుంటే కలిగే ప్రయోజనం ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఇట్టే మటుమాయం చేయొచ్చని తెలుసుకుని రైతు కి నమస్కరించి బడి వైపు అడుగులు వేశాడు‌.

కథను క్రింది లింక్లో చదవొచ్చు 👇👇👇
https://molakanews.page/YNJDRf.html

4, జులై 2020, శనివారం

మొలక న్యూస్ లో ప్రచురించిన నా నానోలు

లిఖిత్ నానోలు 👇👇{మొలక న్యూస్ లో ప్రచురించిన నానోలు}
(58వ రచనా ప్రచురణ)

లిఖిత్ నానోలు
కవి:-లిఖిత్ కుమార్ గోదా.
అంత్రం
రోగం
అస్త్రం
ప్రయోగం.

చేతి గడియారం
పిల్లలు
కాశీదారం
నాన్న.

అహంకారం
వాలి
అమాయకత్వం
సుగ్రీవుడు.

కవనం
కూర్పు
గమనం
ఓర్పు

నానో
ప్రాణం
జయహో
దేశం.
__________________
నానోలు క్రింది లింక్లో చదవొచ్చు 👇👇👇👇
https://molakanews.page/HCHfvX.html
లేదా
https://molakanews.page/article/%e0%b0%b2%e0%b0%bf%e0%b0%96%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf:-%e0%b0%b2%e0%b0%bf%e0%b0%96%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%97%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be.-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b0%e0%b1%8b%e0%b0%97%e0%b0%82-%e0%b0%85%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%82-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b0%82.-%e0%b0%9a%e0%b1%87%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%97%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%aa%e0%b0%bf%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b0%b2%e0%b1%81-%e0%b0%95%e0%b0%be%e0%b0%b6%e0%b1%80%e0%b0%a6%e0%b0%be%e0%b0%b0%e0%b0%82-%e0%b0%a8%e0%b0%be/HCHfvX.html

ఈరోజు (04/07/2020) మొలక న్యూస్ లో ప్రచురించిన నా కవిత.

🌱🌱హరితహారం (కవిత)🌱🌱[ప్రచురించిన 59వ రచన]
🌳🌳కవి:-లిఖిత్ కుమార్ గోదా🌳🌳

అందరం కలిసి, బృందమై
మానవత్వం అనే మాటను చేపట్టి
బ్రతుకునిచ్చే మొక్కల్ని (చెట్లను) నాటుదాం.,
ఆ మొక్కను మనలో ఒకరిగా
కల్పవృక్షంగా తయారయ్యేలా పెంచుదాం,
అందరం "చిప్కో ఉద్యమం" చేస్తూ,
ఆ వృక్షాన్ని కాపాడుకుందాం,
ఆ కల్పవృక్షం ప్రసాదించే
గాలిని, సంపదను, నీడను పొందుదాం,
ఆ వృక్షాన్ని నరకకుండా, సహృదయంతో
కాస్త దాని పై దయ చూపుదాం,
ఆ వృక్షం ప్రసాదించే
పూలు పళ్ళను అందరికీ పంచుదాం,
ఇంత చేస్తున్నా ఆ వృక్షానికి కాస్తంత
నీరు,నేల, సూర్యకిరణాన్ని అందిద్దాం,
ప్రపంచాన్ని మొత్తం హరితహారం చేసి
సకల సంపదలూ పొంది ధన్యులుగా జీవిద్దాం.

__________________
క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇
https://molakanews.page/2fi1qi.html

22, జూన్ 2020, సోమవారం

అంతర్జాతీయ పితృ దినోత్సవ సందర్భంగా "మా నాన్న.."అంటూ నేను రాసిన కవిత...

కవితా శీర్షిక:- మా నాన్న... 
కవితా రచన:- లిఖిత్ కుమార్ గోదా
_____________________

ఎందుకో తెలీదు
మా నాన్నకి నేను అంటే అంతులేని ప్రేమ,
ఎనలేని ఆప్యాయత.
అవధులు లేవు మా నాన్న విధులు నిర్వహణకు నా కోసం.
"అడుగు" నేలమీద పెట్టనివ్వకుండా
అల్లారుముద్దుగా పెంచాడు.
నేను అక్షరాన్నే కానీ
ఆ అక్షరం ఉద్భవించేలా చేసిన
"సిరా" మాత్రం "మా నాన్నే".
నేను అందమైన భవంతినే అయినా
మా నాన్న మాత్రం
ఆ భవంతి ముందు తెలుగింటి ముగ్గు.
నన్ను పరుపు మీద పడుకోబెట్టి
తాను మాత్రం అరుగుమీద పడుకొని
నాకు రక్షణగా నిలిచిన సైనికుడు.
నన్ను ఆకర్షణల పై
మొగ్గు చూపకుండా
చేయడానికి సైనికుడిలా
ఎలా కాపాడుకున్నాడో మా నాన్న.
తన కళ్ళల్లో ఎప్పుడూ
కష్టాల ప్రవాహాన్ని
నాకు తెలియకుండా దాచిపెట్టినా
ఒకసారి కాకపోయినా
ఒకసారైనా ఆ కన్నీటి ప్రవాహాన్ని గ్రహించే వాణ్ని.
నాన్నకు తనచుట్టూ కష్టాలు
ద్వీపం చుట్టూ నీళ్లునట్లు
చెట్టుకు ఆకులు ఉన్నట్లు ఉన్నా
నాకు మాత్రం గవ్వల సవ్వడిని
శంఖాల స్వరాల్ని వినిపిస్తూ
సంతోషాన్ని అందించేవాడు.
ఎప్పుడూ చాటుగా కన్నీళ్లు
దాచుకున్న నాన్న కళ్ళల్లో
పరీక్షల్లో ఉత్తమంగా మార్కులు సంపాదించుకున్న అప్పుడు చూసా
వెలకట్టలేని సంతోషాన్ని
మెరుపులాంటి ఆనందాన్ని
ఖర్చులేని సంబరాన్ని.
మా అమ్మ చంకన వేసుకుని తిప్పింది
మురిపాల ముద్దులు కురిపించింది
అమ్మ నన్ను గుండెల్లో దాచుకుంటే
కానీ మా నాన్న మాత్రం
అంతకు మించి ఎత్తుకు నన్ను మోస్తూ ప్రేమిస్తూ లాలిస్తూ
నన్ను తన భుజాల మీద
ఎత్తుకొని ఆడించాడు.
అడిగితే వరాలు ఇచ్చేవాడు దేవుడు,
కానీ అడగకుండానే
ఏ వరమివ్వాలో,
ఏ వరం ఇవ్వకూడదో తెలిసిన
ఒకే ఒక్క ప్రాతఃస్మరణీయుడు మా నాన్న.
నేను కవినే అయినా
అక్షరాభ్యాసం చేయించింది మాత్రం
మా నాన్నే.
నా చేతికి డిజిటల్ వాచ్ పెట్టి
తను మాత్రం కాశి దారాల తోనే
సరిపెట్టుకుంటూ పోతున్నాడు
మా నాన్న.
నా కాళ్ళకి బ్రాండెడ్ షూస్ తొడిగి
తను మాత్రం అరిగిపోయిన
పాదరక్షలతో పయనమవుతున్నాడు.
సాధారణ బట్టలు
తాను ధరించి
వేలు పెట్టి కొన్న బట్టలు
నాకు తొడిగి
నాలో తనను చూసుకుని
సంబరపడిపోతూ ఉన్నాడు మా నాన్న.
మా నాన్న ముందు
"నలుడు"కూడా సరిపోడేమో
నన్ను అంత గొప్పగా తీర్చిదిద్దాడు.
జీవిత బాటలో
ఉత్తమంగా ఎదగడానికి
"రామ వారధి"ని
నిర్మించిన నలుడు ఆ నాన్న.
_______________________
🌱🌱🌱(ఈ కవిత {22/06/2020)నీ మొలక న్యూస్ లో ప్రచురితమైనది}🌱🌱🌱

🌼🌼క్రింది మొలక న్యూస్ 🌱🌱లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇👇

https://molakanews.page/article/%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be-%e0%b0%b6%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf%e0%b0%95:---%e0%b0%ae%e0%b0%be-%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be-%e0%b0%b0%e0%b0%9a%e0%b0%a8:--%e0%b0%b2%e0%b0%bf%e0%b0%96%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%97%e0%b1%8b%e0%b0%a7%e0%b0%be-_-%e0%b0%8e%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%8b-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%80%e0%b0%a6%e0%b1%81-%e0%b0%ae%e0%b0%be-%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%87/vbUN0W.html
లేదా 👇👇
https://molakanews.page/vbUN0W.html
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

18, జూన్ 2020, గురువారం

నానోలు (26-35)


26)
మక్కువ 
చదువు
తక్కువ
డబ్బు

27)
కోపము
దూర్వాస మ
శాంతం
కుంతిదేవి

28)
చదువు
జ్ఞానం
సాధన
నైపుణ్యం

29)
చీకటి
దుఃఖం
వెలుగు
నవ్వు.

30)
సువాసన
పువ్వు
ప్రతిభ
మనిషి.

31)
ఇరుకు
మెదడు
ఆలోచన
మురికి.

32)
విద్యార్థి
కలుషిత నీరు
గురువు
చిల్లగింజ.

33)
పాణి
దానం
వాణి
మధురం.

34)
కరువు
తరుణం
తరువు
దానం.

35)
ఆస్తులు
ఇంద్రధనస్సు
ఆత్మీయులు
ఆకాశం.
@@@ లిఖిత్ కుమార్ గోదా. @@@

క్రింది లింక్లో నానోలు చదవొచ్చు...👇👇👇👇

https://molakanews.page/article/%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8b%e0%b0%b2%e0%b1%81-27)-%e0%b0%95%e0%b1%8b%e0%b0%aa%e0%b0%ae%e0%b1%81-%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%be%e0%b0%b8-%e0%b0%ae%e0%b0%b9%e0%b0%be%e0%b0%ae%e0%b1%81%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%b6%e0%b0%be%e0%b0%82%e0%b0%a4%e0%b0%82-%e0%b0%95%e0%b1%81%e0%b0%82%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a6%e0%b1%87%e0%b0%b5%e0%b0%bf-28)-%e0%b0%9a%e0%b0%a6%e0%b1%81%e0%b0%b5%e0%b1%81-%e0%b0%9c%e0%b1%8d%e0%b0%9e%e0%b0%be%e0%b0%a8%e0%b0%82-%e0%b0%b8%e0%b0%be%e0%b0%a7%e0%b0%a8-%e0%b0%a8%e0%b1%88%e0%b0%aa%e0%b1%81%e0%b0%a3%e0%b1%8d%e0%b0%af%e0%b0%82-29)-%e0%b0%9a%e0%b1%80%e0%b0%95%e0%b0%9f%e0%b0%bf-%e0%b0%a6%e0%b1%81%e0%b0%83%e0%b0%96%e0%b0%82-%e0%b0%b5%e0%b1%86%e0%b0%b2%e0%b1%81/rTlZA9.html

8, జూన్ 2020, సోమవారం

బాలకవి ముచ్చట్లు_నాకు నేనే శ్రీ శ్రీ కవితల పుస్తకంలో నేను రచించిన కవితలు

దాచుకున్న పుస్తకం
చిన్ననాటి కవితల జ్ఞాపకం
నాకు నేనే శ్రీ శ్రీ

 నేను నా 13వ ఏట కవితలు రాయడం తెలుసుకున్నాను. అప్పుడప్పుడు చిన్న కవితలు చదవడం,ఈనాడు సంస్థ నుంచి వెలువడే తెలుగు వెలుగును అనుక్షణం అనుసరించడం ద్వారా కవితలు అంటే ఇలా ఉంటుందా అని తెలిసింది. తెలిసీ తెలియని ఊహలతో వర్ణనలతో చిన్న చిన్న కవితలు రాస్తూ ఒక చిట్టి పుస్తకంలో నాకు నేనే శ్రీ శ్రీ అంటూ చిన్న చిన్న కవితలు రాశాను. పదోతరగతి ధ్యాసలో పడి ఆ కవితల పుస్తకం ఎక్కడ పోయిందో మర్చిపోయాను. గత వారం రోజుల నుంచి పుస్తకాలన్నీ తిరగేస్తుంటే ఈ రోజు ఆ కవితలు పుస్తకం నాకు నేనే శ్రీశ్రీ బయటపడింది.

నాకు నేనే శ్రీ శ్రీ
కవిత- 1
కవితా శీర్షిక:-దేశం మనదే
కవితా రచన:-లిఖిత్ కుమార్ గోదా
********
భారతావని బిడ్డలం
వెలుగునిచ్చే వీరులం!!
గాంధీ తెచ్చిన స్వేచ్ఛకు రూపం మనమే
బోస్ చేసిన ప్రయత్నానికి రెక్కల మనమే
నెహ్రూ పెంచిన శాంతికి ప్రాయశ్చిత్తం మనమే
భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్
రాజ్ గురు సుఖ్ దేవ్ల ప్రతిఫలం మనమే!!
సమతా మమతలు పెంచుదాం,
నవ్య మానవతను పెంచుదాం,
ధైర్యం, ప్రేమను పెంచుదాం,
భయాన్ని, మోసాన్ని తుంచుదాం,
కోపాన్ని, కుళ్ళును వొంచుదాం,
అసూయని, గర్వాన్ని ముంచుదాం!!
దేశం మనదే, దేశం మనదే
క్షేమం మనదే, పరువు మనదే
బరువు మనదే, బాధ్యత మనదే
కష్టం, నష్టం అంతా మనదే మనదే!!
____________________
క్రింది లింక్లో గేయకవితని చదవగలరు
https://molakanews.page/article/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%B6%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%95:-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%82-%E0%B0%AE%E0%B0%A8%E0%B0%A6%E0%B1%87-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%A8:-%E0%B0%B2%E0%B0%BF%E0%B0%96%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%97%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE.-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B5%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%B2%E0%B0%82-%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B1%87-%E0%B0%B5%E0%B1%80%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B0%82!!-%E0%B0%97%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%80/tM1rwm.html
లేదా
https://molakanews.page/tM1rwm.html
___________________

కవిత-2
కవిత శీర్షిక:-పుస్తకం

అక్షరాలు మిత్రులయ్యాక
తిండి, దాహం అవసరం లేదు.
పుస్తకాలే జీవితం అయ్యాక
పగటి నిద్రల ధ్యాస లేదు.
చదవడం మొదలెట్టాక
తలవని పలుకు లేదు.
చేతిరాత అలవాటయ్యాక
పేపర్ల మీద చోటు లేదు.
ఇప్పుడు నాకు అక్షరం నేస్తం అయింది
దాని నా మెదడులో పదిలపరచి,
ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకగలను
నా దేశానికి గొప్ప పేరు తీసుకురాగాలను.

https://molakanews.page/article/%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%b6%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf%e0%b0%95:-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%95%e0%b0%82-%e0%b0%b0%e0%b0%9a%e0%b0%a8:--%e0%b0%b2%e0%b0%bf%e0%b0%96%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%97%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b0%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b1%81%e0%b0%b2%e0%b0%af%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%95-%e0%b0%a4%e0%b0%bf%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf,-%e0%b0%a6%e0%b0%be%e0%b0%b9%e0%b0%82-%e0%b0%85%e0%b0%b5%e0%b0%b8%e0%b0%b0%e0%b0%82-%e0%b0%b2%e0%b1%87%e0%b0%a6%e0%b1%81.-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%95%e0%b0%be/o76oum.html

లేదా 👇👇
MOLAKA - https://molakanews.page/o76oum.html

______________________
కవిత _3
కవితా శీర్షిక:-చెట్టు తల్లి

తల చుట్టూ పూలు పెట్టుకొని,
తన చేతులైన కొమ్ములతో,
తన ఒత్తయిన జుట్టుని పట్టుకుంటూ,
తన కాళ్ళను భూమిలోకి దింపి,
రాత్రి పగలు నిలబడుతూ,
చలి వణికిస్తున్నా,
ఎండ భగ్గు చేస్తున్నా,
వానకు తడుస్తున్నా,
సుస్థిరంగా నిలబడుతూ
తనకోసం ఆకస్మాత్తుగా వచ్చిన
వాయు మిత్రుడు తగిలి
తన పూలను పుడమితల్లికి సమర్పిస్తూ
తన సంతానమైన పండ్లను
మానవులకు, జంతువులకు
ఈ సమస్త జీవకోటికి అందిస్తున్న
చెట్టు తల్లికి వందనాలు.
క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇👇
https://molakanews.page/article/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%B6%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%95:-%E0%B0%9A%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%A4%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%A8:--%E0%B0%B2%E0%B0%BF%E0%B0%96%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%97%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE-%E0%B0%A4%E0%B0%B2-%E0%B0%9A%E0%B1%81%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%82-%E0%B0%AA%E0%B1%82%E0%B0%B2%E0%B1%81-%E0%B0%AA%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B0%BF,-%E0%B0%A4%E0%B0%A8-%E0%B0%9A%E0%B1%87%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%88%E0%B0%A8-%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE/e1BFrZ.html
_________________
కవిత-4
కవితా శీర్షిక:-అమ్మ

"అమ్మ"మనసులో "ప్రేముంది"
"అమ్మ"కళ్ళలో "ఆప్యాయతుంది"
"అమ్మ"ఒడిలో"అనురాగముంది"
"అమ్మ"తొలి తెలుగు పిలుపు అయింది
"అమ్మ" కోపం గొప్పపాఠం నేర్పింది
"అమ్మ"పెట్టిన గోరుముద్ద "ఆకలి తీర్చింది"
"అమ్మ" కష్టం "దారి చూపింది"
"అమ్మ" పెంపకం "గొప్పవాణ్ణి చేసింది"
అందుకే "అమ్మ" నాకు "ఆదర్శం అయింది.
___________________
కవిత-5
కవితా శీర్షిక:-నేర్చుకో

అద్దాన్ని చూసి నేర్చుకో,
ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు అని.,
వెలుగునీడల్ని చూసి నేర్చుకో,
ఎప్పుడూ ఒకరికి ఒకరు తోడుండాలని.

సూర్యుణ్ణి చూసి నేర్చుకో,
బద్ధకం వీడాలని.,
పుస్తకాన్ని చూసి నేర్చుకో,
ధర్మాన్ని నేర్పాలని.,
వాయువును చూసి నేర్చుకో,
ధర్మాన్ని ప్రతిచోటా విస్తరింపాలని.,
చెట్టును చూసి నేర్చుకో,
సహాయ గుణం వీడకూడదని.,
నీటిని చూసి నేర్చుకో,
ఎదుటివారి దాహం తీర్చాలని.,
గొప్ప వీరుణ్ణి చూసి నేర్చుకో,
ధైర్యాన్ని ఎదలో నిలిపి ముందుకు సాగాలని.,
నీ గమ్యాన్ని చేరుకో,
జీవితంలో ఆనందంగా జీవించు!!
_https://molakanews.page/article/%E0%B0%B6%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B7%E0%B0%BF%E0%B0%95:-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%8B-%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%B0%E0%B0%9A%E0%B0%A8:--%E0%B0%B2%E0%B0%BF%E0%B0%96%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D-%E0%B0%95%E0%B1%81%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%97%E0%B1%8B%E0%B0%A6%E0%B0%BE-%E0%B0%85%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9A%E0%B1%82%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%A8%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%8B,-%E0%B0%8E%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%A1%E0%B1%82-%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%82-%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%95%E0%B1%82%E0%B0%A1%E0%B0%A6%E0%B1%81-/iYmcRP.html
లేదా 👇👇
https://molakanews.page/iYmcRP.html
_________________
కవిత-6
కవితా శీర్షిక:-ఆశ

ఆశే మనిషి
ఆశే మనిషి జీవితం
ఆశే మనిషికి నిలయం
ఆశే మనిషికి దారి చూపిస్తుంది
ఆశే నీకు అవకాశన్నిస్తుంది
ఆశే నీ లక్ష్యం నెరవేర్చుతుంది
ఆశే నీకు ఆయువు
ఆశే నిన్ను బ్రతికించే అమృతం.
_______________
కవిత-7
కవితా శీర్షిక:-చిరునవ్వు

ఒంటరిగా
దిగులు బరువు
మోయకు,
నీ మౌనం నీకు
దారి చూపిస్తుందా?
కష్టం వచ్చినప్పుడే
నీ గుండె ధైర్యం 
నీకు తెలుస్తుంది.
ఒడిదొడుకులు,
కష్టాలు,కన్నీళ్లు
అణుచుకుంటేనే
చిరునవ్వు మిగులుతుంది.

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...