30, జులై 2020, గురువారం

ముత్యాల పూసలు నూతన కవితా ప్రక్రియలో

💎💎 💎💎💎💎ముత్యాల పూసలు నూతన కవితా ప్రక్రియ💎💎💎💎💎💎
రూపకర్త:- ఆత్రం మోతిరాం
ఈ వారం అంశం:-ప్రగతికి మెట్టు-చెట్టు నాటు
కవి:- లిఖిత్ కుమార్ గోదా
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507204.
🌸🌸🌸🌸🌸🌸🌸🌸
1) 
ప్రగతికి చెట్టే మెట్టు,
మొక్క నాటితే పుణ్యం,
తను(రు)వు పొందును ధన్యం,
సకలసంపదలు కల్పంచే,
చెట్టు మనిషికి మిత్రుడు,
చెట్టు నాటితే విలాసం,
తరువు నరికితే విలాపం.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
2)
ఆరంభం కావాలి హరితహారం
ఇంటి పెరడు నుండి
ఇరువైపుల రోడ్లు వరకు
మొక్కలు నాటాలి అందరం
చెట్లను కాపాడాలి నిరంతరం
మహికి తరువులే ఆభరణం
తలపెట్టాలి చిప్కో ఉద్యమం.
💎💎💎💎💎💎💎💎
3)
ఉద్యమించి నాటాలి మొక్కలు
కంటికి రెప్పలా కాపాడాలి
మనిషికి లేనిది పరోపకారం
చెట్లకు ఉందా లక్షణం
ఆచరణ చేస్తే ముద్దు
ప్రచారములు అసలేం వద్దు
హరితహారం ప్రగతికి హారం.
🌻🌻🌻🌻🌻🌻🌻🌻
4)
మనిషి పాలిట కామధేనువై
పక్షుల పాలిట గూడై
జంతువుల పాలిట ఓగిరమై
విశ్వం పాలిట సైన్యమై
కాలుష్యం పాలిట శత్రువై
అనునిత్యం అన్నింటికీ అవసరమై
చెట్టు తల్లి కల్పవల్లి.
🌱🌱🌱🌱🌱🌱🌱🌱
5)
త్యాగానికి చిరునామా తరువు
సోచిస్తే తరువు గురువు
మోస్తున్నాయి ప్రపంచపు బరువు
చెట్టు ఇంటికి పరువు
బాపును ఆకలి కరువు
రైతులకు ఇచ్చును ఎరువు
వృక్షం జగతికి నేస్తం.
☀️☀️☀️☀️☀️☀️☀️☀️
6)
వృక్షం రైతులకు నేస్తం
పంటకి ఎరువును కల్పించు
పాడి పశువులకు నీడగా
ఇంటి నిర్మాణంలో కలపగా
పిల్లలను ఆడించే మిత్రుడిగా
పండుగకు పచ్చ తోరణంగా
వృక్షం సమస్తానికి రక్ష.
🌾🌾🌾🌾🌾🌾🌾🌾
7)
తేనెటీగలు తేనెపట్టు పెట్టడానికి
పక్షులు గూళ్ళు కట్టుకోవడానికి
జంతువులు సేద తీరడానికి
మనిషి ఇళ్ళు నిర్మించుకోవడానికి
చేతులు చాచి ఆహ్వానించు
ఆహ్లాదకరమైన వాతావరణం సమకూర్చు
పరోపకారానికి చిరునామా తరువు.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
వారం వారం ముత్యాల హారం ఈ వారం (జులై 26-ఆగష్టు 02) అంశం :-ప్రగతికి మెట్టు-చెట్టు నాటు. పై ముత్యాల పూసలు ప్రక్రియలో 10 కవితలు రాసినందుకు పొందిన "పద ముత్యం" పురస్కారం.
8)
వనజీవిగా మారాలి అందరం
మొక్క నాటి మనిషి
ప్రకృతి ప్రేమికుడు కావాలి
మొక్క నుండి మహావృక్షంగా
మహావృక్షం నుండి మహారణ్యాలుగా
నేలమ్మను తీర్చిదిద్దాలి మనమందరం
వృక్షాలు జీవకోటికి బంధువులు.
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
9)
చెట్లు జీవిస్తే రామరాజ్యం
లేకుంటే వినాశనానికి ఆజ్యం
ప్రేమిస్తే చెట్టును నిత్యం
అమ్మలా ఆదరించును సత్యం
ప్రపంచానికి చెట్లే అభిఖ్యం
విలువలు తెలిసిన ప్రద్న్యం
చెట్టు ప్రగతికి మెట్టు.
🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈
10)
ఇంటి చుట్టూ పెంచాలి
పాఠశాలలో మొక్కలు నాటాలి
పిల్లలు నుంచి పెద్దలు
చెట్లను స్నేహితునిగా భావించాలి
మొక్క నాటడం లక్ష్యంగా
చెట్లు పెంచడమే కర్తవ్యంగా
ప్రకృతికి మేలు చేయాలి.
🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
11)
ప్రతి ఇంటి ఆభరణం
అంతులేని సంపదకు నిలయం
నిత్యం కాలుష్యంతో సమరం
సమస్త జీవకోటికి పరోపకారి
సకల సంపదలిచ్చే ప్రజోపకారి
చెట్టు లేని చోట
ఎడారి బ్రతుకుల తోట.
🌏🌏🌏🌏🌏🌏🌏🌏

11)
ప్రతి ఇంటి ఆభరణం
అంతులేని సంపదకు నిలయం
నిత్యం కాలుష్యంతో సమరం
సమస్త జీవకోటికి పరోపకారి
సకల సంపదలిచ్చే ప్రజోపకారి
చెట్టు లేని చోట
ఎడారి బ్రతుకుల తోట.
🌏🌏🌏🌏🌏🌏🌏🌏
ఈ కరోనా రోజుల్లో పొందిన కొన్ని సర్టిఫికెట్లు 👇👇







27, జులై 2020, సోమవారం

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక ఫేస్బుక్ గ్రూపు వారు నిర్వహిస్తున్న వారం వారం కవితా హారం ఆన్లైన్ కవి సమ్మేళనంలో (15వ ఆదివారం) నేను ఆలపించిన కవిత"ఉరకలేసిన శరథి.. ఉద్యమాల దాశరథి"

కవితా పఠనం:-లిఖిత్ కుమార్ గోదా.

రెండవ ఆదివారం
●●●●●●●●

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 
Face Book Group 
వారి " వారం, వారం కవితా హారం" 
ఆన్లైన్ కవి సమ్మేళనం

July 19, 2020 ఆదివారం
ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు

15 వ ఆదివారం
అంశం : 
{{{ దాశరాది, తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ ల జయంతులు పురస్కరించుకుని వారిపై కవితలు, గేయాలు }}}

పాల్గొనండి, వీక్షించండి

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అడ్మిన్




ఆన్లైన్ కవి సమ్మేళనంలో 3వ ఆదివారం నేను..

మూడోసారి కవితా పఠనం
లిఖిత్ కుమార్ గోదా.
●●●●●●●●

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 
Face Book Group 
వారి " వారం, వారం కవితా హారం" 
ఆన్లైన్ కవి సమ్మేళనం

July 26, 2020 ఆదివారం
ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు

16 వ ఆదివారం
అంశం : 

((( కార్గిల్ విజయ్ దివాస్ జులై 26, 1999ను పురస్కరించుకుని " వీర సైనికులకు విజయ తిలకాలు " )))

పాల్గొనండి, వీక్షించండి

సూదిరెడ్డి నరేందర్ రెడ్డి
అడ్మిన్

పున్నమి తెలుగు దినపత్రిక వారు నిర్వహించిన"నల్ల సూరీడు నెల్సన్ మండేలా"అనే కవితాంశం పై నేను రాసిన కవిత ఇది.ప్రశంసా పత్రం కూడా..

*పున్నమి దినపత్రిక (సాహితీ డెస్క్)*వారు నిర్వహిస్తున్న "భారతరత్న నెల్సన్ మండేలా"
అంశంపై, నెల్సన్ మండేలా ఈ- కవితా సంకలనం కోసం నేను రాసిన కవిత..
అంశం:-భారత రత్న నెల్సన్ మండేలా
కవితా శీర్షిక:- శాంతి చేసిన సమరం.. నెల్సన్ మండేలా..
కవి:-లిఖిత్ కుమార్ గోదా,
        ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం.
______________________________
చిమ్మచీకట్లో నల్లజాతీయులు ఎదుర్కొంటున్న
వర్ణ వివక్షను వేలెత్తి ప్రశ్నించిన భానుడు.,
శాంతిని ఆభరణములా, మౌనాన్ని ఆయుధంగా,
శ్వేత వర్ణ రిపుల ఎదుట "చిరునవ్వుని" అస్త్రంగా,
ప్రయోగించిన అపర శాంత సమరయోధుడు.
మహాత్మా గాంధీకి అనుచరుడు,
అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్ వంటి
ఎందరో గుండె ధైర్యం గల ఉద్యమకారుల మోనిస్,
దాదాపు ముప్పది ఏళ్లు 
శాంతియుతంగా వర్ణవివక్షకు వ్యతిరేకంగా
జైలు గోడలతో ముచ్చటించిన ఉద్యమ కిరణం.
అతని శాంతి, అపార పోరాటం
ప్రపంచంలో ఎందరో నల్లజాతీయుల సంకెళ్లను బానిసత్వాన్ని తెంపింది.,
భారతరత్న, నోబుల్ శాంతి బహుమతి లు వంటి ప్రపంచం అంతటా కీర్తి గాంచి,
ఎన్నో మహోన్నత గౌరవాలు అందుకున్న మహాశయుడు.

నేటి ప్రస్థానం జాతీయ దినపత్రిక వెన్నెల సాహిత్య పేజీలో ప్రచురించబడిన నా కవిత...
91వ రచనా ప్రచురణ
నేటి ప్రస్థానం జాతీయ దినపత్రిక
(వెన్నెల సాహిత్య పేజీ)
21.09.2020
__________________________
హామీ పత్రం:-
ఈ కవిత పున్నమి సాహితీ డెస్క్ కోసం రాసిన కవితని, ఎక్కడా ప్రచురించలేదని, ఎక్కడ కాపీ కొట్టే లేదని దేనికి అనుకురణ కాదని, ఏ రచనకు అనువాదం కాదని హామీ ఇస్తున్నాను.

కవి:-లిఖిత్ కుమార్ గోదా
ఊరు:-బనిగండ్లపాడు గ్రామం,ఖమ్మం జిల్లా-507202.
ఫోన్:-9949618101

https://drive.google.com/file/d/1CfRIy1LMhhaeo-3987k6l6jgBtAv7tvH/view?usp=drivesdk

పున్నమి దినపత్రిక వారు నిర్వహించిన సర్ ఆర్థర్ కాటన్ దొర పై కవితల పోటీలో పాల్గొన్నందుకు అందుకున్న సర్టిఫికెట్ 👇👇

పున్నమి తెలుగు దినపత్రిక వారు 14-07-2020న నిర్వహించిన కాటన్ దొర (సర్ ఆర్థర్ కాటన్) పై కవిత రాసినందుకు గానూ,ఆ పత్రిక వారు అందించిన సర్టిఫికెట్.నాకు సర్టిఫికెట్ అందించిన పత్రిక సంపాదకులకు, నిర్వాహకులకు మనఃపూర్వక కృతజ్ఞతలు.

 

*పున్నమి దినపత్రిక*వారు నిర్వహిస్తున్న సర్ కాటన్ దొర పై కవిత.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
కవితా శీర్షిక:-తెలుగు జాతి ప్రజోపకారి.. సర్ ఆర్ధర్ కాటన్
కవి:- లిఖిత్ కుమార్ గోదా
____________________

అతడు ఉపమన్యుడు వంటి పట్టుదల, 
అపర భగీరథుడు వంటి తపోదీక్ష కలిగిన కరుణా సముద్రుడు.

బ్రిటిష్ దేశం లో పుట్టినా 
భారత దేశానికి మేలు చేసిన మహాశయుడు.
గోదావరి ప్రజల ఆర్తనాదం విని
చదివిన ఇంజనీరింగ్ చదువును ప్రజల కోసం,
వారి ఉన్నత జీవితం కోసం, 
తన కమనీయ చలువగలిగిన కరముతో,
దుఃఖదాయనిగా మారిన 
గోదావరి తల్లికి నమస్కరించి,
ధవళేశ్వరం ఆనకట్టను
అవధులు దాటుకుని నిర్మించి
తెలుగు జాతికి, భారతావనికి
సుఖ సంపదలు పండేలా
జగత్ కీర్తి పొందేలా
ఎంతో మేలు చేసి ప్రతి తెలుగోడు స్మరించుకో దగ్గ మహోన్నతుడు
కరుణా సముద్రుడు సర్ ఆర్ధర్ కాటన్.
____________________






హామీ పత్రం:-
గౌరవనీయులైన పున్నమి పత్రిక సంపాదకులకు తెలియజేయునది ఏమనగా, నేను ఈ కవితను ఎక్కడ కాపీ కొట్టలేదని, దేనికి అనుకరణ, అనువాదం కాదని, అంతర్జాలంలో కానీ ఇతర బ్లాగుల్లో కానీ సేకరించింది కాదని, హా మీద చేస్తూ మీకు ఈ కవితను పంపుతున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@@@@@@@@@@@
కవితా శీర్షిక:-తెలుగు జాతి ప్రజోపపకారి.. సర్ ఆర్థర్ కాటన్.
కవి:-లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం,
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
చరవాణి:-9949618101.
🔱🔱 త్రిశూల్ సమాచారం దినపత్రిక 🔱🔱
🌱🌱90వ రచనా ప్రచురణ 🌱🌱
18.09.2020
@@@@@@@@@@@@@@

18, జులై 2020, శనివారం

లిఖిత్ నానోలు 👇👇

లిఖిత్ నానోలు

నానో కవి:- లిఖిత్ కుమార్ గోదా😀



దూషణ
శిశుపాలుడు
శిక్షణ
శ్రీ కృష్ణుడు.

వాస్తవం
వేము
అవాస్తవం
మధురం.


సృష్టి
దృష్టి
ప్రాణం
కోణం.


సంపద
సుష్ఠి
రోగాలు
పుష్టి.


మేఘం
ఏడ్పు
గగనం
వేల్పు.


ఆన్లైన్ పాఠాలు
ఎడారి
బోధన
ఎండమావి


మనిషి
మోసకారి
పగ
దగ.


మితభాషణ
మేలు
అతిభాషణ
జైలు.


జనాలు
మూక
కరోనా
రాక.


వికాసం
మనిషి
వినాశనం
ప్రపంచం

కవనం
కూర్పు 
గమనం
ఓర్పు

నానో
ప్రాణం
జయహో
దేశం.

సర్వం
పిల్లలు
గర్వం
చదువులు.

అవసరం
ప్రతిభ
అనవసరం
వయసు.

కరోనా
విలాసం
జనం
విలాపం.

కోవిడ్
తాండవం
ప్రజలు
హాహాకారాలునానో


కాటుక
కళ్ళు
పీఠిక
పొత్తం

పిల్లలు
బైకులు
చక్కర్లు
చిక్కులు

అన్యాయం
రక్కసి
అక్షరం
అసి

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక కోసం రాసిన కవిత

త్రిశూల్ సమాచారం దినపత్రికలో ప్రచురితమైన నా కవిత

మనిషిని మలచేది మనసే..

3️⃣1️⃣/0️⃣7️⃣/2️⃣0️⃣2️⃣0️⃣

రచన:- లిఖిత్ కుమార్ గోదా

{22వ కవితా ప్రచురణ.

65వ రచనా ప్రచురణ}




______________________

ఒకరేమో దూర్వాస మహాముని,

ఇంకొకరేమో కుంతిదేవి,

ఒకరేమో కోపానికి మారుపేరు,

ఇంకొకరేమో శాంతికి ఉదాహరణ

మనిషిని మలిచేది మనసే.


ఒకరేమో రాజు రుక్మి

ఇంకొకరేమో కర్ణుడు

ఒకరేమో గొప్పల రాజు

ఇంకొకరేమో దానాల రాజు

మనిషిని మలిచేది మనసే.


ఒకరేమో వాలి

ఇంకొకరేమో సుగ్రీవుడు

ఒకరేమో అహంకారి

ఇంకొకరేమో అమాయకుడు

వారి మనసులను మలిచింది మనసే.


ఒకరేమో ధర్మరాజు

ఇంకొకరేమో దుర్యోధనుడు

ఒకరేమో సత్యమార్గంలో నడిచాడు

ఇంకొకరేమో కయ్యానికి సిద్ధపడ్డారు

మనిషిని మలిచేది మనసే.

3️⃣1️⃣/0️⃣7️⃣/2️⃣0️⃣2️⃣0️⃣


చేపల్ని కాపాడిన తాబేలు (పిల్లల కథ)


చేపల్ని కాపాడిన తాబేలు ( పిల్లల కథ)

రచయిత:- లిఖిత్ కుమార్ గోదా ,ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
___________________

ఒక చెరువులో చాలా చేపలు, తాబేలు ఉండేవి. అందులో ఒక తాబేలుకి చేపలతో చెలిమి చేయడమంటే చాలా ఇష్టం కానీ ఆ చెరువులోని చేపలు ఆ తాబేలుతో స్నేహం చేసేవి కావు.
ఒకసారి కొన్ని కొంగలు చాలా దూరం నుంచి చేపల వేట కోసం ఆ చెరువు దగ్గరికి వచ్చాయి. ఆ చెరువు లో పుష్కలంగా చేపలు ఉండడంతో ఆ చెరువుకు వెలుపలున్న చెట్ల పైన తమ ఇల్లు నిర్మించుకున్నాయి.
వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే అధిక సంఖ్యలో కొంగలు చేపల్ని వేటాడటం వల్ల చేపల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దాంతో మిగిలిన చేపలన్ని దిగ్భ్రాంతికి లోనయ్యాయి.
వాటి దిగులును చూసిన తాబేలు, చేపలు తనతో స్నేహం చేయనప్పటికీ ఒక శ్రేయోభిలాషులా, స్నేహితునిలా చేపల గురించి విచారం చెందింది.
ఎలాగైనా చేపల్ని ఆ కొంగలు బారినుండి కాపాడి వాటితో నెయ్యం కట్టాలనుకుంది. ఒక ఉపాయం ఆలోచించింది.
మరుసటి రోజు చేపల అన్నింటికీ ఇష్టం లేకపోయినా వాటిని సమావేశపరిచి, తాబేలు"మన చెరువులో మీ చేపల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. కాబట్టి మిమ్మల్ని కొంగల భారి నుండి నేను కాపాడతాను. నేను చెప్పినట్టు చేయండి చాలు. మీలో అనుభవం ఉన్న చేపలు ఎక్కువ సేపు గాలి తీసుకోని నీటి పైకి వచ్చి తేలండి ఆ కొంగలు వచ్చే సమయానికి. నేను నా పథకం ప్రకారం ఈ చెరువుకి మనుషుల వల్ల కరోనా సోకిందని చెప్తాను‌. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారికి భయపడి ఆ కొంగలు పారిపోతాయి. ఇక వాటి బెడద నుండి మీరు సురక్షితలవుతారు. సమ్మతమేనా?"అంది.
చేపలు అన్నింటికీ తాబేలు ఉపాయం నుంచి మనస్ఫూర్తిగా సమ్మతించాయి.
మరుసటి రోజు కొంగలు వస్తుండగా చేపలకి పిలుపునిచ్చింది తాబేలు.
"దాదాపు ఒక యాభై చేపలు దాకా పైకి తేలుతున్నాయి.
అప్పుడు కొంగల్లో ఒకటి "మనకు ఈరోజు శ్రమ లేదు తమ్ముళ్ళు" అని చెరువులోకి రాబోయేంతలో తాబేలు మిక్కిలి దగ్గుకుంటూ "కొంగ మిత్రులారా! ఈ చెరువులోకి రాకండి. గత వారం రోజులుగా ఈ చెరువులోని జీవరాసులన్నీ దగ్గు, జ్వరం, జలుబు, తలనొప్పి తదుపరి రోగాలతో మరణిస్తున్నాయి. ఊపిరి ఆడడం లేదంట వేటికి కూడాను. మీరు వచ్చి ఒక వారం రోజులు అవుతుంది కదా, ఈ చెరువు దగ్గరకి కొంతమంది మనుషులు వచ్చి దాదాపు ఒక పక్షం రోజులు అవుతుంది. వారికి ఏదో కరోనా వైరస్ ఉందని వారు మాట్లాడుకుంటే విన్నాను. అది చాలా ప్రమాదకరమైన రోగమట. బహుశా నాకు కూడా ఆ రోగం సోకినట్టు ఉంది‌. బాగా దగ్గు జలుబు జ్వరం ఉన్నట్టే ఉంది. మీ మంచి కోసమే చెప్తున్నాను. దయచేసి ఈ చెరువు దగ్గరకి రాకండి. మీ ప్రాణాలు కాపాడుకోండి.అహ్హు..అహ్హూ"అని అని గట్టిగా దగ్గింది.
"అమ్మో! కరోనా వైరసా? ఇక ఈ చేపలు వద్దు. చెరువు వద్దు. ఆ తాబేలు మామయ్యని చూస్తే నిజంగానే వాళ్ళకి కరోనా వచ్చినట్టుంది. వెళ్లి క్వారంటైన్ లో కూర్చుందాం. పారిపోయీ ప్రాణాలు రక్షించుకుందాం పదండి"అని రెక్కలకు పని చెప్పాయి కొంగలన్నీ‌.
తమను కొంగల బారి నుండి కాపాడిన తాబేలుకు కృతజ్ఞతలు తెలిపి, అప్పటినుండి దానితో స్నేహం మొదలెట్టాయి చేపలన్ని.

🔱🔱🔱🔱🕊️🕊️🕊️28.07.2020

13, జులై 2020, సోమవారం

నా సాహిత్య గురువులు శ్రీ పోతగాని సత్యనారాయణ గారి సంపాదకత్వంలో వెలువడిన పూల గోపురం పుస్తకంపై సమీక్ష 🌺🌺📗📗🧾🧾📚📚

పుస్తక సమీక్ష -2:- వర్తమాన సమాజ దర్పణం- పూల గోపురం
పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా

       పూల గోపురం
"ఉత్తేజాన్ని కలిగించేది, ఉన్నత విలువలు నేర్పించేది, ఊహాశక్తికి పదును పెట్టేది ఉత్తమమైన పుస్తకం"- 
ఈ సూక్తి నూటికి నూరుపాళ్ళు ఈ "పూల గోపురం బాలల కథా సంకలనానికి" సరితూగుతుంది. బాలసాహిత్య రంగంలో పూలగోపురం ఒక మహత్తరమైన బాలల కథా కదంబం.

సాహిత్యంలో కథలు రెండు రకాలు. ఒకటి కాలక్షేపం కోసం చెప్పుకునే కథలు,రెండోది ఒక నిర్దిష్ట సామాజిక ప్రయోజనాన్ని ఆశించి చెప్పుకునేవి లేదా రచించేవి. ఈ సంకలనం లోని కథలు సామాజిక ప్రయోజనాన్ని ఆశించి రాసినవి. అంటే రెండో కోవకు చెందినవన్న మాట.
      సమాజ శ్రేయస్సే ధ్యేయంగా, నైతిక విలువలేలక్ష్యంగా పెట్టుకొని, చిట్టి చేతులతో కలాలు పట్టుకొని వర్తమాన సమాజంలో చోటుచేసుకున్న సంఘటనలను, మనుషుల తీరును, నడవడికను, తొలి ప్రయత్నంలోనే చేయి తిరిగిన రచయితల్లా కథలు రాసి సమాజ హితానికి శ్రీకారం చుట్టారు. Vvr Zpss భీమవరం వర్ధమాన (బాల) రచయిత(త్రు)లు. 
ఈ పుస్తకం గురించి చెప్పే ముందు ఒక చిట్టి కథను చెప్పాలి.
"ఒకానొక కాలంలో "పోతగాని" అనే దివ్యమైన మహర్షికి కొంత మంది బాల శిష్యులు ఉన్నారు. శిష్యుల వయస్సు సుమారు 14 - 15 దాకా ఉంటాయి. వాళ్లు పరమానందయ్య శిష్యుల్లా కాదు, అపర మేధావులు. ఎటువంటి అంశానికైనా ఇట్టే స్పందించగలరు. చక్కని హితబోధలు, కథలు, ప్రవచనాలు, వ్యక్తిత్వ వికాసం గురించి బోధిస్తూ కలుషితం లేని ఆ విద్యార్థుల మదిలో జ్ఞాన,సంస్కార జ్యోతులను వెలిగించారు పోతగాని మహర్షి.
ఒకసారి ఈ ప్రపంచానికి ఆపద వచ్చింది. అది కేవలం మనుషుల్లో వస్తున్న మార్పుకి, సంభవిస్తున్న దురాలోచనలకి, దుర్బుద్ధికి, దురలవాట్లకు, అవి దారితీస్తున్న పరిణామాలకు ప్రపంచంలో "మంచితనం" అన్నది కనుమరుగై పోయిది. ఈ విషయం తెలుసుకున్న పోతగాని మహర్షి మనుషుల్లో మాయమవుతున్న మానవత్వానికి, వారిలో సంభవిస్తున్న దుష్టయోచనలకి ఏదైనా చక్కటి ఔషధం (మందు, విరుగుడు) తయారు చేయాలి అనుకున్నాడు. మనిషి మస్తిష్కం లో మానవత్వాన్ని మళ్ళీ చిగురింపజేయాలని అనుకున్నాడు.
అటు పిమ్మట తన శిష్యులకి ఈ ప్రళయం గురించి చెప్పి సమాజానికి ఉపయోగపడే ఔషధానికి తగిన మూలికలు వెదికి తీసుకురమ్మన్నాడు.
వెనువెంటనే శిష్యులందరూ తలొక దిక్కుకి వెళ్లి, కొన్ని రోజులు తర్వాత తిరిగి వచ్చారు. మూలికల్ని చేత పట్టుకొని. వాటిలో మేలైన మూలికలు ఏరారు పోతగాని మహర్షి. అందులో 15 మంది శిష్యులు తలా ఒక మూలికని తీసుకొస్తే, ఒక శిష్యురాలు మాత్రం రెండు సమాజహిత మూలికల్ని గురువుగారికి అందించింది.
ఇక ఆలస్యం చేయని పొతగాని మహర్షి, సంకల్ప బలం చేత తన శిష్యులు తెచ్చిన మేలైన 'సంజీవని' వంటి మూలికలతో కొంతమంది మునులు, మహర్షులుతో కలిసి ఒక యజ్ఞంలా, మనిషిలో దాగున్న కుబుద్ధుని మటుమాయం చేసి, మానవత్వాన్ని పరిమళింప చేసే "పూల గోపురం" అనే దివ్యౌషధాన్ని తయారు చేశారు.
తరువాత పూల గోపురం ఔషధాన్ని సేవించిన ప్రతి ఒక్క మనిషి, తన మస్తిష్కంలోని మలినాన్ని వదులుకొని, జ్ఞాన బోధ జరిగి, హితాన్ని తెలుసుకొని మళ్లీ మనిషిలా రూపుదిద్దుకున్నాడు.
___________
ఈ కథ నూటికి నూరు శాతం హిందీ ఉపాధ్యాయులు, పూల గోపురం బాలల కథా సంకలనం సంపాదకులు, శ్రీ పోతగాని కవి గారి కృషికి, వారికి తోడ్పడిన శిష్యులకి సరిగ్గా సరిపోలుతుంది.
సాధారణంగా పిల్లల కథల్ని పిల్లల కోసం పెద్దలు రాస్తుంటారు. కానీ ఇప్పుడు, కొన్ని దశాబ్దాల నుండి పిల్లల కోసం పిల్లలే రచనలు చేస్తూ "ఆహ్లాదకరమైన,అందమైన,కపటం లేని, కల్మషం లేని పిల్లల లోకాన్ని సృజించుకుంటున్నారు".వారికి తోడ్పాటుగా వెన్నుగా,దన్నుగా పోతగాని కవి గారి వంటి ఎందరో ఉపాధ్యాయులు సహకారంగా నిలుస్తున్నారు. వారిలోని కవిని,రచయితని వెలికి తీస్తున్నారు.
కథా రచన గురించి యువ రచయిత,కవి రాచమళ్ళ ఉపేందర్ గారు తొలిపాదులు పుస్తకంలో ముందుమాటగా ఇలా అంటారు-
"కథా రచన అనేది ఒక సృజనాత్మక కళ.కథ రక్తి కట్టాలంటే సమర్థవంతమైన ప్రతిభ,పాటువాలే కాదు నిరంతరం కృషి ఓపిక ఎంతో అవసరం.
కదిలే కాళ్లను,అల్లరి చేసి పిల్లలను కట్టిపడేస్తుంది మంచి కథ అంటారు.
మరి పిల్లల కథలు రాస్తే. చేయి తిరిగిన రచయితల్లా కథలు అల్లితే. అలా అల్లిన కథలకు పాఠకులకు కళ్ళు చెమ్మగిల్లితే, హృదయాలని పిండేస్తే.. దానికి మించిన సామాజిక ప్రయోజనం ఏముంటుంది? పిల్లల కృషికి అంతకు మించిన బహుమతి ఇంకేముంటుంది?" అంటారు.
పై మాటలు అన్నీ పూల గోపురంలో కథలు రాసిన తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు ఎటువంటి సందేహం లేకుండా చెల్లుబాటు అవుతాయి.
ఇప్పుడు వస్తున్న కథల పుస్తకాలలో కల్పితాలకు చోటు ఎక్కువ. మానవతా విలువలు, సమాజ పోకడ కలిగిన బాలల కథలు చాలా తక్కువ. ఈ విషయాన్ని గ్రహించిన పోతగాని కవిగారు వర్తమాన సమాజాన్నే కథలుగా మలిచేలా విద్యార్థుల చేత ఈ కథల సంకలనాన్ని రాయించారని భావించవచ్చు.
ఈ కథల పుస్తకంలోని కథలన్నీ విశిష్టమైనవి, విలువైనవి.
ముందుగా కథల సంకలనం ముఖచిత్రం మనల్ని ఆకట్టుకుంటుంది. పేరు కూడా సరికొత్తగా ఉంది "పూల గోపురం" అని.
కథలకు తగిన రీతిలో ఈ పిల్లలు రాసిన కధల శీర్షికలు ప్రతి పాఠకున్ని ఆకట్టుకుని, వేటికవే పోటీ పడుతుంటాయి.
పిల్లలందరూ గ్రామీణ జీవనం నుండి వచ్చారు కాబట్టి కథలన్నీ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబిస్తూ, సమాజానికి అద్దం పడుతూ ఎక్కడా విసుగును కలిగించకుండా హాయిగా సాగుతుంటాయి.
మొదటి కథ "భయం కాటు" ఎస్.నిహారిక రాసిన
కథ ఎదుటివారి సొత్తును దొంగతనం చేస్తే మనకు తెలియకుండా జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో చక్కగా వెల్లడించింది.
"చదువు విలువ"కథలో సాయి రాం ఎంతో పరిణితితో ప్రస్తుతం చాలామంది జీవితాల్లో జరిగే సంఘటనలే ఉదాహరణగా తీసుకొని చక్కని కథని అల్లాడు. కార్తీక్ చదువుకోకుండా బలాదూర్ తిరుగుతూ తల్లిదండ్రుల కష్టం తెలియకుండా ఉండడం, ఒకసారి తల్లిదండ్రులు ఎలా పని చేస్తున్నారోనని తెలుసుకోవడానికి పొలానికి వెళ్లి వాళ్ళు ఎండలో కష్టపడి పని చేయడాన్ని చూసి పశ్చాత్తాప్పడి చదువుపై శ్రద్ధ చూపడం ప్రతి పాఠకున్ని ఆకట్టుకుంటుంది.
(13.07.2020..
మిగతా తరువాయి భాగంలో అనగా వచ్చే సోమవారం ప్రచురణ)

కె. పావని రాసిన"చెలిమి చెరిచిన చరవాణి"కథలో వర్తమాన సమాజంపై సెల్ ఫోన్ పిచ్చి పిల్లల్లో ప్రేమానురాగాలను ఎలా దూరం చేస్తుందో తెలియపరచింది.తరువాత నాయనమ్మ యుక్తితో చేసిన పని వల్ల సెల్ ఫోన్ భూతం వీడి మళ్ళీ మిత్రుడు తో స్నేహం చేయడం తో మంచి ముగింపు నిచ్చింది.

ఎస్. అఖిల్ కుమార్ రెడ్డి రాసిన"పిల్లి సాక్ష్యం"కథ చదువుతూ ఉంటే అచ్చంగా చందమామ, బాలమిత్ర వంటి పత్రికల్లో కథలు చదివినంత ఆనందం కలిగింది.
ఎంతో తెలివితో, సమయస్ఫూర్తితో రాసిన కథ ఇది.
జి. అఖిల తన"వలపోత"కథలో పండిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల గురించి కన్నులు చెమ్మగిల్లేలా రాసింది. కథా ఇతివృత్తం నవ సమాజానికి అద్దం పట్టింది.

బి.నితిన్ "పిట్టల శాపం"కథలో చెట్లను నరికి పర్యావరణానికి నష్టం వాటిల్లడమే కాకుండా, పక్షులు, జంతువులు నివాసాలు కోల్పోవడం వల్ల పిట్టలు మనుషులపై ఆగ్రహించి శపించడం అనేది ఆలోచించాల్సిన అంశం. నీటి ప్రాముఖ్యతను తెలియపరిచిన కథ ఇది.

"ముగ్గురు మిత్రులు" కథలో కె.ఉమ
     "మంచి హృదయం ఉన్న వాళ్ళు ఎంతమంది కైనా స్నేహాన్ని పంచగలరు" అనే ఒక్క మాటను ఆధారం చేసుకొని కథను నడిపించింది.
మనుషుల మధ్య చిచ్చు పెట్టడం మంచిది కాదని, నిజమైన నిస్వార్ధమైన మిత్రులు చెప్పుడు మాటలకు తొందర పడరని మృదువుగా చెప్పి కథని ముగించింది.

"పాల పంచాయతీ" కథలో ఎన్. రక్షణ-
"కన్న తల్లి కి ఎంతమంది బిడ్డలు ఉన్నా అందరికీ సమానంగానే ప్రేమను పంచుతుంది"అనే సూక్తిని తీసుకొని యుక్తితో మన ఇంట్లో నిత్యం జరిగే అక్కాచెల్లెళ్ళు,అన్నాతమ్ముళ్లు,తోబుట్టువుల గొడవల్ని కథలా మలిచింది.
"కనులు చూసిన వెంటనే, బుద్ధికి పని చెప్పకుండా అనుమానాన్ని,తీర్చుకోకుండా అసూయతో రగిలి పోకూడదు" అంటూ 'అనుమానం పెను భూతం' అని చక్కని హితబోధ చేసింది.

కథా శీర్షికలోనే "తాగుడు వ్యసనం"అంటూ హెచ్చరిస్తున్న నఫ్రీన్ సమాజంలో నిత్యం జరిగే సంఘటననే కథావస్తువుగా తీసుకుని ఇంటి పెద్ద తాగడానికి అలవాటుపడి కుటుంబాన్ని ఒంటరిగా ఎలా రోడ్డుమీద వదిలేస్తుంటాడో దృశ్యమానం చేసింది.
"సంకల్పబలం"కథలో నందిని-
నేటి సమాజంలో తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోతే ఆడపిల్ల పడే అవస్థని కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఇది వర్తమాన అంశం. సంఘంలో అనుదినం చోటుచేసుకునేది.
ఈ కథలో శ్రావణి లాగే తల్లిదండ్రుల్ని కోల్పోయి సంకల్ప బలం చేత చక్కగా చదువుకొని విజ్ఞాన శిఖరాలు అధిరోహించిన ఆడపిల్లలు కోకొల్లలు. 
తల్లి తండ్రులు చనిపోతే ఆడపిల్ల నిస్సహాయంగా ఉంటుందని, చుట్టాలు ఎవరూ పట్టించుకోరని,అదే మగవాడైతే ఎవరైనా ముందుకు వచ్చి పెంచుకుంటారని నేటికీ కొనసాగుతున్న ఆడ మగ వివక్షని కళ్ళు చెమ్మగిల్లేలా కథలో చొప్పించింది.

        "ఆస్తులు-ఆత్మీయతలు"కథను రాసిన ఎం. సరస్వతిని అభినందించకుండా ఉండలేం.
ఈ కథను చదువుతున్నంతసేపు మనసుకు ఉల్లాసంగా,ఆలోచించే విధంగా ఉంటుంది.ఈ కథ చదువుతుంటే వారికి ఈ సమాజం పైన ఆత్మీయతలకు, డబ్బుకి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంతగా అవగాహన ఉన్నదో అర్థం అవుతుంది.ఈ కథను చదువుతూంటే ఒకప్పటి పాత సినిమాల్లోకి వెళ్ళిపోతాం. మానవ జీవితంలో ఆస్తులకు విలువ ఇస్తే ఎలా ఉంటామో, ఆత్మీయులకు విలువ ఇస్తే ఎలా బ్రతుకుతామో ప్రత్యక్షంగా చూపించే కథ.

         తొమ్మిదవ తరగతి చదివే బాలస్వామి "చదివే హక్కు" అంటూ ఒక నినాదాన్ని పలికినట్లు కథను రాశాడు.
ప్రభుత్వ పాఠశాలకు ప్రాధాన్యం ఇస్తూ,ప్రస్తుతం సంఘాల్లో పేదల పిల్లలు చదువుకోకుండా పనులు చేస్తూ ఉండడాన్ని చూపించాడు సూక్ష్మంగా.
కథలు రాయడం అంటే కేవలం కథ చెప్పడం కాదని, కథా రచయిత కథలోని పాత్రలతో మాట్లాడించాలని తన పదునైన పద, భావజాలంతో వ్యక్తపరిచాడు.
చివరిగా "దాన ఫలం" కథలో నాజియా బేగం "ఎదుటి వారి కష్టాలను ఎరిగి సాయపడితే మనం సాయం పొందుతామని" హితవు పలికింది.
పాఠశాలలో చదువుకునే దశలోనే ఇంతటి సమాజ అవగాహన, ప్రేమానురాగాలు, పదునైన భావజాలం కలిగిన (కలగలిసిన) ఈ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు భవిష్యత్తులో గొప్ప మానవతా విలువలు తెలిసిన రచయిత(త్రు)లు కాగలరని ఆశిస్తున్నాను.
పిల్లలకి ఇంతటి మహత్తరమైన జ్ఞానం, ప్రేమ, సద్గుణాలను తెలియపరిచి సమాజానికి "నైతిక విలువల టానిక్"ని అందించిన శ్రీ పోతగాని కవి గారిని అభినందించకుండా ఉండలేం.
ఇలాగే ప్రతి ఒక్క పాఠశాలలో పిల్లలు ,ఉపాధ్యాయులు నవ సమాజం కోసం పూలగోపురంతో ముందడుగు వేసిన భీమవరం పిల్లల్లా కృషి చేసి ఈ సమాజానికి మహోన్నత రచనలు అందిస్తే రేపు ఈ సమాజంలో మన చూపులు చాలా శుభ్రంగా ఉంటాయి.
ఇది కేవలం బాలసాహిత్యాన్ని, తెలుగు భాషని కాపాడుకుంటే జరిగే మార్పు.అందుకే తెలుగు భాషని, బాలసాహిత్యాన్ని కాపాడుకుందాం పరిశుభ్రమైన నవ సమాజాన్ని తరిద్దాం, సృష్టిద్దాం.

||జై బాలసాహిత్యం|| ||జై జై వర్ధమాన(బాల) సాహిత్యకారులు||
📚📚📚📚📚📚📚📚
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

12, జులై 2020, ఆదివారం

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారం వారం కవితా హారం జూలై 12 2020న ఆన్లైన్ కవి సమ్మేళనం లో నేను ఆలపించిన కవిత

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక ఫేస్బుక్ గ్రూపు వారు నిర్వహించు "వారం వారం కవితా హారం"కవి సమ్మేళనం 14వ ఆదివారం అనగా (12/07/2020)న మొదటి సారి నేను ఆలపించిన కవిత.

ఫేస్బుక్లో మొదటి సారి నా గొంతు వినిపించాను. కవితని చదివి మీ అమూల్యమైన సలహాలు తెలియజేయగలరు.
ఇంతటి అవకాశం కల్పించిన దేశభక్తి సాహిత్య ఈ పత్రిక గ్రూపు ఎడ్మిన్, నిర్వాహకులు శ్రీ సుదిరెడ్డి.నరేందర్రెడ్డి గారికి కృతజ్ఞతలు 



10, జులై 2020, శుక్రవారం

ప్రజాశక్తి వారి చిన్నారి పేజి కోసం నేను రాసిన కథ-అమ్మకు తోడు . ఈరోజు (10/07/2020) ప్రజాశక్తి లో ప్రచురించిన నా బాలల కథ.

కథ:- అమ్మకు తోడ్పాటు
రచయిత:- లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
( మొత్తం ప్రచురణ అయిన రచనలు:61
ప్రజాశక్తి దినపత్రిక చిన్నారి శీర్షికలో మొదటి కథ)
____________________

అమ్మకు తోడుగా!
9 July 2020, 12:00 am

'ఈ కరోనా వల్ల ఫంక్షన్లు ఏమీ జరగడం లేదు. లాక్‌డౌన్‌ వల్ల పనులు లేక అందరూ ఇళ్లల్లోనే ఉంటున్నారు. అందుకే మిషన్‌ నేర్చుకునే వాళ్లుగానీ, బట్టలు కుట్టించుకునే వాళ్లు గానీ మనింటికి రావడంలేదు. మీ నాన్న కూడా బయట పనికి వెళ్లడం లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బుతోనే మనం జాగ్రత్తగా ఉండాలి!'' అని వంట చేసుకుంటూ అన్నది టైలర్‌ పని చేసుకునే రాణి తన పిల్లలతో.
''అంటే అమ్మా! ఇక నువ్వు ఈ కరోనా తగ్గే వరకు ఖాళీగా ఉండటమేనా? మాకు స్టోన్‌వర్క్‌, డిజైన్‌ వర్క్‌ చేయడానికి పని లేనట్టేనా?'' అని అడిగాడు పదో తరగతి పూర్తయిన పెద్దోడు ఆకాష్‌.
''అవును రా!'' అన్నాడు తండ్రి వెంకటపతి ఇంట్లోకి కూరగాయలు తెస్తూనే.


''అయితే అమ్మా! నువ్వు ఎలాగూ ఖాళీ కాబట్టి చెల్లికి, నాకూ మిషన్‌ నేర్పించు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో చెల్లి, నేను చక్కగా నేర్చుకుంటాం. ఎప్పుడైనా అత్యవసర సమయంలో నువ్వు క్లాత్‌ కట్‌ చేసి ఇస్తే మేము వాటిని కుడతాము. నీకు కూడా పని త్వరగా అయిపోతుంది. మేము కూడా నీకు సహాయం చేసినట్లూ ఉంటుంది.'' అన్నాడు ఆకాష్‌. 
''చదువుకోండిరా అంటే మిషన్‌ నేర్చుకుంటాం అంటున్నారేంటిరా?'' అని కోపంతో అంది తల్లి. ''అలా కాదు అమ్మా'' చదువుని నిర్లక్ష్యం చెయ్యం. రోజులో రెండు గంటలు నేర్పించు. మిగిలిన టైం అంతా చదువుకుంటాం.'' అన్నాడు ఆకాష్‌. ''ఏం చెల్లి అంతేనా?'' అడిగాడు చెల్లి శ్రావణి వైపు చూస్తూ.
''అవునమ్మా పని నేర్చుకుంటే తప్పేంటి? ఏదైనా మన కోసమే కదా'' అంది శ్రావణి. ఇంటి పరిస్థితులను అర్థం చేసుకొని మాట్లాడుతున్న పిల్లలను చూసి రాణి కంటతడి పెడుతుంటే, ''పోనీలే రాణి! పిల్లలు అన్నది నిజమేగా! నేర్పించు. రేపు జీవితంలో ఉపయోగపడుతుంది'' అన్నాడు వెంకటపతి భార్యను ఓదార్చుతూ. అమ్మ ఆనందంతో పిల్లలిద్దరినీ గుండెలకు హత్తుకుంది...
- లిఖిత్ కుమార్ గోదా,
7658980766.

Dailyhunt
కథను క్రింది లింక్లో చదవొచ్చు 👇👇
http://dhunt.in/adKIJ?ss=wsp&s=pa
https://m.dailyhunt.in/news/india/telugu/prajasakti-epaper-prajasak/ammaku+toduga+-newsid-n197288684?listname=topicsList&index=0&topicIndex=0&mode=pwa

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...