దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 10వ సంచిక కోసం..
అంశం:- విప్లవ జ్యోతి.. భగత్ సింగ్
శీర్షిక:- అమరచతుష్టయం సారధి...మన భగత్ సింగ్
కవి:-లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం.
ఆయన కేవలం
భరతమాత అమృత గర్భం నుండి జన్మించలేదు,
అమ్మ గర్భంలో రూపుదిద్దుకుంటూనే
అప్రాచ్యుల అణచివేతల తూటా పోట్లను,
అన్యాయ బానిస పరిపాలన ఆక్రంధనలను
భరతమాత ఎద చప్పుడు స్పర్శ కంటూ
"అమ్మ కోసం పోరాడి,
ఆఖరికి ప్రాణమొడ్డైనా సరే
దాస్య శృంఖలాలను తెంపాలి" అనుకుంటూ
అరుణోదయములా జన్మించిన అసమాన శూర విప్లవ తేజం.
పదమూడేళ్ల పసిప్రాయం నుండే
పాఠశాల నుండి స్వాతంత్ర పోరుశాల వైపు
కదం తొక్కిన ఉద్యమ శౌర్యం.
"విదేశీ వస్త్రం మాయదారి
స్వదేశీ ఖాదీ విజయభేరి"
అంటూ బ్రిటిష్ పాలనను కళ్లెం వేసిన జయశాలి.
ఆరాధ్య దైవంగా సేవించే 'పంజాబ్ కేసరి'ని
సైమన్ కమిషన్ పోరులో
మరణానికి దారి తీసేలా చేసిన
బ్రిటిష్ పోలీస్ అధికారి సాండర్స్ ను
నిప్పు కణిక లాగా రగిలిపోయి
మరణ బాట నడిపించిన సవ్యసాచి.
చంద్రశేఖర్ ఆజాద్, రాజ్ గురు, సుఖ్ దేవ్
వంటి తిరుగులేని "విప్లవ చతుష్టయానికి సారధి."
బ్రిటిష్ పార్లమెంట్ పై
"బాంబుల వర్షం" కురిపించి
"ఇంక్విలాబ్ జిందాబాద్" అంటూ
పిడికిలిని ఆకాశంలో నిలిపిన సాహస విక్రమార్కుడు.
భగత్ సింగ్,
విప్లవానికి అతడొక నిలువెత్తు రూపం.
ఆ పేరు ఎగిసే ఉవ్వెత్తు కెరటం.
ఆ పేరు త్యాగానికి, దేశభక్తికి పర్యాయపదం.
తిరుగులేని నాయకత్వానికి నిండు సాక్ష్యం,
అఖండ భరత జాతికి గుండె ధైర్యం.
బ్రిటిష్ పాలిట సింహస్వప్నం.
ప్రతి భారత భాగ్య విధాతకు ఆయన ఆరాధ్య దైవం.
పోరాడే ప్రతి ఒక్కరికి ఆయనో ఆదర్శం.
హామీ పత్రం:-
కవి పేరు: - లిఖిత్ కుమార్ గోదా,
శీర్షిక:- అమరచతుష్ట సారధి...మన భగత్ సింగ్
చిరునామా:
ఇంటి నెంబర్ : - 1- 115/3,బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం,
ఖమ్మం జిల్లా - 507 202.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
హామీ పత్రం: -
ఈ కవిత దేశభక్తి సాహిత్య ఈ పత్రిక కోసం వ్రాయబడింది. ఈ రచన ఎక్కడా ప్రచురితం కాలేదని, ఈ కవిత ఏ రచనకి అనువాదం కాదని, ఎక్కడ కాఫీ కొట్టలేదని, ఈ కవిత నా సొంత రచనని, పేర్కొంటూ హామీ ఇస్తున్నాను.
( దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 10వ సంచిక కోసం రాసిన కవిత)
05.10.2020
దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 10వ సంచిక
క్రింది లింక్లో పుస్తక రూపంలో ఈ-సంకలనం కలదు 👇👇
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి