21, ఆగస్టు 2020, శుక్రవారం

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 9వ సంచికలో నేను రాసిన కవిత:- భారతీయ భవధీయ తేజం.. పీవీ (70వ రచనా ప్రచురణ 🇮🇳)

   🇮🇳🇮🇳  మౌన ముని, స్థితప్రజ్ఞుడు,అపర చాణక్యుడు,మన తెలుగు తేజం.. శ్రీ పీవీ నరసింహారావ్ గారు.🇮🇳🇮🇳

61వ పుటలో ప్రచురితమైన నా కవిత..

పొందిన ఈ- ప్రశంసా పత్రం

  భారతీయ భవదీయ తేజం.. పీవీ

   లిఖిత్ కుమార్ గోదా

 ఇంటర్మీడియట్ విద్యార్థి, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్-507204

_______________________________________

పీవీ నరసింహారావు,

భరతమాత మానసపుత్రుడు,

బాసర జ్ఞాన సరస్వతి తల్లి ఒడిలో

అక్షరాభ్యాసం చేసిన గీర్వాణి పుత్రుడు,

విద్యార్థి దశలోనే నైజాం రిపులకు వ్యతిరేకంగా

గుండె బిగువుతో,పిడికెలు బిగించి,చేయెత్తి

"వందేమాతరం"అంటూ గర్జించిన కేసరిలా జైకొట్టిన,

రాటుతేలిన మహోజ్వల నాయకుడు.

అతని ఠీవితో

భారతీయ సంప్రదాయా వైభవాన్ని

ప్రపంచానికి చూపించిన స్ఫూర్తి కెరటం.

రాజకీయ రంగంలో శాసనసభ్యుడు అయ్యి,

తదుపరి రాష్ట్ర విద్యావంతుడై, 

తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి, 

తెలుగు నేలను ఏలిన తెలుగు కిశోరం.

తొలి తెలుగు ప్రధానిగా

దేశ ఆర్థిక వ్యవస్థ వెన్ను కోల్పోతున్న తరుణంలో,

తన అపర చాణక్య మేధస్సుతో,

దేశ ఆర్థిక సంస్కరణ ప్రవేశ పెట్టి

అమ్మకు (భారత మాత)మహత్తర వైభవాన్ని

తీసుకొచ్చిన పరిపాలనాదక్షుడు.

పుచ్చుకున్న ప్రతి పదవిని

ప్రజలు పెదవి విరవకుండా

పరిపూర్ణంగా పాలనకు న్యాయం చేసిన స్థితప్రజ్ఞుడు.

సంస్కృతంలో అనర్గళంగా ప్రసంగించి

విమర్శకుల మనసులను మన్పావనం చేసిన మహర్షి.

బహు భాషా కోవిదునిగా పేరెన్నికగని 

అంతర్జాతీయ సదస్సుల్లో

తను నేర్చిన పదిహేడు భాషల్లో

ఒకటైన స్పానిష్ భాషను

అనర్గళంగా మాట్లాడి

క్యూబా దేశ విప్లవ కిషోరమైన

ఫిడెల్ కాస్ట్రోనూ అబ్బురపరిచిన భారతీయ భాషా అభిఖ్య.


మధురమైన "విజయ" కల నామంతో

"గొల్ల రామవ్వ" వంటి చారిత్రాత్మక రచనలు చేసినప్పటికీ,

ఎందరో కవి సామ్రాట్ల రచనలు

వివిధ భాషల్లోకి అనువాదం చేసి

సాహిత్యానికి పచ్చ తోరణం కట్టిన సాహిత్య సామ్రాట్.

పీవీ మహాశయా,

భారతరత్నమా,

దేశహితోత్తమా,

పూజ్య మాణిక్యమా,

స్థిత ప్రజ్ణమా,

నీకు అపరిమిత కరములు కరములు.

__________________________________


కవి పేరు: - లిఖిత్ కుమార్ గోదా,

రచన: - భారతీయ భవదీయ తేజం.. పీవీ

చిరునామా: -

 హౌస్ నెంబర్ : - 

 1 - 115/3,బనిగండ్లపాడు గ్రామం, 

ఎర్రుపాలెం మండలం,

ఖమ్మం జిల్లా - 507 202.

21.08.2020

🇮🇳🇮🇳70వ రచనా ప్రచురణ🇮🇳🇮🇳

26వ కవితా ప్రచురణ.

క్రింది లింక్లో ఈ-బుక్ కలదు 👇👇👇

https://drive.google.com/file/d/1cz72jOfxgGSVrtEEcpUvoSp7RzfP60B-/view?usp=drivesdk

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...