8, జూన్ 2020, సోమవారం

ఈరోజు (08/06/2020) మొలక న్యూస్ లో వచ్చిన నా 26వ బాలల కథ ప్రచురించిన సంపాదకులు శ్రీ వేదాంత సూరి తిరునగరి గారికి 🙏 కృతజ్ఞతలు 🌹



కథ:-సుమధుర మైత్రి
 కథా రచయిత- లిఖిత్ కుమార్ గోదా

(ఇది ఎప్పుడో చిన్నప్పుడు రాసిన కథ. బహుశా ఏడో తరగతి అనుకుంటా. నిన్న పుస్తకాలు తిరగేస్తుంటే దొరికింది.)

ధర్మపురి రాజ్యానికి రాజు సత్యధర్ముడు. అతని దర్బారులో ఒక చిలుక ఉండేది. దాన్ని సత్యధర్ముడు ఎంతగానో ప్రేమించాడు. దానికి ప్రత్యేకంగా బంగారు పంజరం,బంగారు పళ్లెంలో ఆహారం పెడుతూ ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగారు. ఆ చిలుక కి కూడా తాను రాజదర్బార్ లో ఉంటూ భోగభాగ్యాలు పొందుతున్నాను అనే గర్వం కలిగింది.
ఒకసారి ఓ చిలక ఓ అడవి నుండి రాజదర్బార్ లోకి ప్రవేశించింది. ఏ విషయాలు, వింతలు ఉన్నాయో  చూడడానికి. అప్పుడు రాజసభలో చిలుక ఒక్కటే ఏకాంతంగా పంజరంలో ఉంది.
బయటి నుండి వచ్చిన చిలుక బంగారు పంజరం లో ఉన్న చిలుక దగ్గరికి వెళ్లి"మిత్రమా! నా పేరు మైత్రి. ఈ రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవి నుండి వచ్చాను. నీ పేరేమిటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్?"అని ప్రశ్నించింది.
బంగారు పంజరం లో ఉన్న చిలుక తన గొప్పతనం అంతా వెల్లబోస్తూ"నన్ను సుమధుర అంటారు. నేను ఇక్కడ ఆస్థాన పక్షిని. నేను మీకంటే చాలా గొప్పదాన్ని. నేను రాజ చిలక ని. మీరందరూ సాధారణ చిలకలు. నాకు ఉన్న ఈ భోగభాగ్యాలు మీకు ఎవరికీ మీ అడవి లో నివసించే జంతువులు జరగవు, దొరకవు. నాకు ఇక్కడ బంగారు పంజరం ఉంది బంగారు కంచం ఉంది. మీకు ఏమైనా ఉందా? నాకు ప్రతిక్షణం ఎలాంటి ఆహారం అయినా దొరుకుతుంది. మీకు దొరుకుతుందా?"అని హేళన చేసి మాట్లాడింది పంజరంలో ఉన్న సుమధుర. సుమధుర తన్ని హేళన చేసిందని గమనించిన మైత్రి వెంటనే "అవును రాజా! నువ్వు చాలా గొప్ప దానివి. నీకు జరిగే భోగభాగ్యాలు మాకు ఎవరికీ జరగవు. కానీ నీకు లేని "స్వేచ్ఛ" మాకుంది. మనం విహార పక్షులం. ఈ రోజు ఆహారం కోసం అన్వేషిస్తేనే మన కడుపు నిండుతుంది.  ఆహారం కోసం బయటికి వెళ్లడం వలన మనసు ఆహ్లాదంగా, ఉల్లాసంగా ఉంటుంది. మాకు ఆహ్లాదంగా ఉంది ఉల్లాసం ఉంది.మేము మాకు ఉన్న స్వేచ్ఛ వలన ఎన్ని మైళ్ళైనా, ఎక్కడికైనా వెళ్లి రాగలం. ఇప్పుడు నీ దగ్గరికి అడవి నుండి వచ్చినట్టుగా. మేము మా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాం. మా ఆహారం సంపాదించుకుంటాం. నువ్వు వేరే ఒకరిపై ఆధారపడుతున్నావు. మాకు ఆ అవసరం లేదు. మాకు స్వేచ్ఛ ఉంది, మనశ్శాంతిగా ఉంది, కష్టపడే తత్వం ఉంది. కానీ నీకు అదృష్టం లేదు గా"అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. బంగారు పంజరంలో ఉన్న సుమధుర తనకు "నిజమైన స్వేచ్ఛ" లేదని బాధ పడింది.
______________________

క్రింది లింక్లో కథను చదవొచ్చు

https://molakanews.page/article/%e0%b0%95%e0%b0%a5:-%e0%b0%b8%e0%b1%81%e0%b0%ae%e0%b0%a7%e0%b1%81%e0%b0%b0--%e0%b0%ae%e0%b1%88%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf:-%e0%b0%b0%e0%b0%9a%e0%b0%af%e0%b0%bf%e0%b0%a4:--%e0%b0%b2%e0%b0%bf%e0%b0%96%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%97%e0%b1%8b%e0%b0%a6%e0%b0%be-(%e0%b0%87%e0%b0%a6%e0%b0%bf-%e0%b0%8e%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%8b-%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81%e0%b0%a1%e0%b1%81-%e0%b0%b0%e0%b0%be%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%95%e0%b0%a5.-%e0%b0%ac%e0%b0%b9%e0%b1%81%e0%b0%b6%e0%b0%be-%e0%b0%8f%e0%b0%a1%e0%b1%8b-%e0%b0%a4%e0%b0%b0%e0%b0%97%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%85%e0%b0%a8/6nXZaq.html

1 కామెంట్‌:

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...