22, జూన్ 2020, సోమవారం

అంతర్జాతీయ పితృ దినోత్సవ సందర్భంగా "మా నాన్న.."అంటూ నేను రాసిన కవిత...

కవితా శీర్షిక:- మా నాన్న... 
కవితా రచన:- లిఖిత్ కుమార్ గోదా
_____________________

ఎందుకో తెలీదు
మా నాన్నకి నేను అంటే అంతులేని ప్రేమ,
ఎనలేని ఆప్యాయత.
అవధులు లేవు మా నాన్న విధులు నిర్వహణకు నా కోసం.
"అడుగు" నేలమీద పెట్టనివ్వకుండా
అల్లారుముద్దుగా పెంచాడు.
నేను అక్షరాన్నే కానీ
ఆ అక్షరం ఉద్భవించేలా చేసిన
"సిరా" మాత్రం "మా నాన్నే".
నేను అందమైన భవంతినే అయినా
మా నాన్న మాత్రం
ఆ భవంతి ముందు తెలుగింటి ముగ్గు.
నన్ను పరుపు మీద పడుకోబెట్టి
తాను మాత్రం అరుగుమీద పడుకొని
నాకు రక్షణగా నిలిచిన సైనికుడు.
నన్ను ఆకర్షణల పై
మొగ్గు చూపకుండా
చేయడానికి సైనికుడిలా
ఎలా కాపాడుకున్నాడో మా నాన్న.
తన కళ్ళల్లో ఎప్పుడూ
కష్టాల ప్రవాహాన్ని
నాకు తెలియకుండా దాచిపెట్టినా
ఒకసారి కాకపోయినా
ఒకసారైనా ఆ కన్నీటి ప్రవాహాన్ని గ్రహించే వాణ్ని.
నాన్నకు తనచుట్టూ కష్టాలు
ద్వీపం చుట్టూ నీళ్లునట్లు
చెట్టుకు ఆకులు ఉన్నట్లు ఉన్నా
నాకు మాత్రం గవ్వల సవ్వడిని
శంఖాల స్వరాల్ని వినిపిస్తూ
సంతోషాన్ని అందించేవాడు.
ఎప్పుడూ చాటుగా కన్నీళ్లు
దాచుకున్న నాన్న కళ్ళల్లో
పరీక్షల్లో ఉత్తమంగా మార్కులు సంపాదించుకున్న అప్పుడు చూసా
వెలకట్టలేని సంతోషాన్ని
మెరుపులాంటి ఆనందాన్ని
ఖర్చులేని సంబరాన్ని.
మా అమ్మ చంకన వేసుకుని తిప్పింది
మురిపాల ముద్దులు కురిపించింది
అమ్మ నన్ను గుండెల్లో దాచుకుంటే
కానీ మా నాన్న మాత్రం
అంతకు మించి ఎత్తుకు నన్ను మోస్తూ ప్రేమిస్తూ లాలిస్తూ
నన్ను తన భుజాల మీద
ఎత్తుకొని ఆడించాడు.
అడిగితే వరాలు ఇచ్చేవాడు దేవుడు,
కానీ అడగకుండానే
ఏ వరమివ్వాలో,
ఏ వరం ఇవ్వకూడదో తెలిసిన
ఒకే ఒక్క ప్రాతఃస్మరణీయుడు మా నాన్న.
నేను కవినే అయినా
అక్షరాభ్యాసం చేయించింది మాత్రం
మా నాన్నే.
నా చేతికి డిజిటల్ వాచ్ పెట్టి
తను మాత్రం కాశి దారాల తోనే
సరిపెట్టుకుంటూ పోతున్నాడు
మా నాన్న.
నా కాళ్ళకి బ్రాండెడ్ షూస్ తొడిగి
తను మాత్రం అరిగిపోయిన
పాదరక్షలతో పయనమవుతున్నాడు.
సాధారణ బట్టలు
తాను ధరించి
వేలు పెట్టి కొన్న బట్టలు
నాకు తొడిగి
నాలో తనను చూసుకుని
సంబరపడిపోతూ ఉన్నాడు మా నాన్న.
మా నాన్న ముందు
"నలుడు"కూడా సరిపోడేమో
నన్ను అంత గొప్పగా తీర్చిదిద్దాడు.
జీవిత బాటలో
ఉత్తమంగా ఎదగడానికి
"రామ వారధి"ని
నిర్మించిన నలుడు ఆ నాన్న.
_______________________
🌱🌱🌱(ఈ కవిత {22/06/2020)నీ మొలక న్యూస్ లో ప్రచురితమైనది}🌱🌱🌱

🌼🌼క్రింది మొలక న్యూస్ 🌱🌱లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇👇

https://molakanews.page/article/%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be-%e0%b0%b6%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b7%e0%b0%bf%e0%b0%95:---%e0%b0%ae%e0%b0%be-%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be-%e0%b0%b0%e0%b0%9a%e0%b0%a8:--%e0%b0%b2%e0%b0%bf%e0%b0%96%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d-%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b0%be%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%97%e0%b1%8b%e0%b0%a7%e0%b0%be-_-%e0%b0%8e%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95%e0%b1%8b-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%80%e0%b0%a6%e0%b1%81-%e0%b0%ae%e0%b0%be-%e0%b0%a8%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%95%e0%b0%bf-%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%85%e0%b0%82%e0%b0%9f%e0%b1%87-%e0%b0%85%e0%b0%82%e0%b0%a4%e0%b1%81%e0%b0%b2%e0%b1%87/vbUN0W.html
లేదా 👇👇
https://molakanews.page/vbUN0W.html
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...