29, ఆగస్టు 2020, శనివారం

ఈరోజు (29.08.2020) త్రిశూల్ సమాచారం దినపత్రికలో ప్రచురితమైన నా వచన కవిత "తెలుగంటే నా కవిత..తెలుగుంటే నా భవిత". ప్రచురించిన సంపాదకులు గారికి కృతజ్ఞతలు

 (ఆగష్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాసిన కవిత)

    తెలుగంటే నా కవిత..

   తెలుగుంటే నా భవిత(కవిత్వం)








✍️✍️✍️కవి:- లిఖిత్ కుమార్ గోదా,
        ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
        బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం 
        మండలం ఖమ్మం జిల్లా-507 202.

తెలుగు నా మాతృభాష
పది కోట్ల ప్రజల శ్వాస.
వేల సంవత్సరాలు చరిత గన్న ప్రాచీనభాష
నన్నయను మొదలుకొని నందిని సిద్ధారెడ్డి వరకు
పోతనను కలుపుకుని పోతగాని కవుల వరకూ
"కవి రేవా ప్రజాపతిః" అని చాటుకుంటున్నా
కవనాల భాష.. నా తెలుగు.
మమతలు ఎన్నో కూడగట్టుకున్న
మధురమైన, మహిలో ఘనమైన భాష
నా మాతృభాష తెలుగు.
కన్నడ రాజు శ్రీకృష్ణదేవరాయలు చేత
"దేశ భాషలందు తెలుగు లెస్స"
అని సగర్వంగా కీర్తింపబడిన అమర భాష
ఆముక్తమాల్యద శ్వాస.. నా తెలుగు భాష.
నికోలా డి కాంటీ చేత
"ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్"గా వర్ణించబడిన అజంత భాష.
మహనీయుడు సి.పి.బ్రౌనుల వంటి ఎందరో పరదేశస్థుల చేత తేజాన్ని పొందిన చైతన్య భాష.
గురజాడ అడుగులు, గిడుగు పిడుగులు
శ్రీ శ్రీ సెగలు, దేవులపల్లి సోయగాలు
సినారె సిరులు, దాశరధి శరధులు
సాహిత్యంతో పులకరించి పోయిన 
కంజాత వల్లి నా తెలుగు తల్లి.
ఉగాది పచ్చడి షడ్రుచులు, శ్రీ రామ నవమి ములు,
అట్లతద్దెలు, రాఖీ ఉత్సవాలు,
విగ్నేశ్వరుని ఉత్సవాలు,సంక్రాంతి సందడి భోగిమంటలు 
లాంటి మన్పావనాలు, మానవ అనుబంధాలతో
వర్షించి తడుస్తున్న కర్మభూమి నా తెలుగు సీమ.
అరుదైన ప్రాచీన హోదాను
ఏకగ్రీవంగా పొందిన అరుణోదయ జ్వాల 
నా తెలుగు భాష .
రోజుకొక కవి కర(ల)ము నుండి,
శిల్పమై చక్కబడుతున్న సుందరవల్లికా 
మందార మకరంద మల్లికా
నా తెలుగు భాష.
స్వర మెత్తి చాటాలి మన భాష అభిఖ్య ఆకాశం దాకా,
అతిధి లాగ భావించు పరాయి భాషను.
తెలుగంటే నా కవిత
తెలుగుంటే నా భవిత.

క్రింది లింక్లో దినపత్రిక చదవొచ్చు 👇👇👇

🔱🔱🔱త్రిశూల్ సమాచారం దినపత్రిక🔱🔱🔱
75వ రచనా ప్రచురణ
29.08.2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...