నానీలు
(సెప్టెంబర్ 4న పేపర్ బాయ్స్ డే సందర్భంగా)
అరుణుడితో జత కలిసి
ప్రజా జాగృతికై
సైకిల్ మీద పయనం
మొదలెడతాడు పేపర్ బాయ్.
* * * *
సెలవే కోరక
సేవే మిన్నగా
అక్షరాల నిజాన్ని అందించే
సమాజ హితైషి.
* * * *
సమాజ సేవే చేసినా
సమజమే గుర్తించని
పేద ప్రజాసేవకుడు
పేపర్ బాయ్.
* * * *
పసివారైనా,ముదసలైనా
కుటుంబ పోషణ కోసం
వార్తలు అందించడమే
చిరు ఉద్యోగం.
సంపాదకులు:- మస్తాన్ వలీ
* * * *
నల్లని నిశీధిలో
తెల్లని కపోతమై
వార్తల మూటను
వాకిట్లోకి మోసుకొస్తాడతడు.
* * * *
అంగడి నుండి
అంతరిక్షం వరకు
సమాచారం పంచుతాడు
ప్రజల చేతుల్లోకి.
* * * *
ప్రజా చైతన్యమే లక్ష్యంగా
వీధి వీధి తిరుగుతూ
శుభాలు- అశుభాలు
మోసుకొచ్చే సమాజమిత్రుడు.
* * * *
పేదరికానికి ఎదురుగా
జీతం చిన్నదైనా
ధ్యేయం మిక్కిలి ఉన్న
ప్రజోపకారి పేపర్ బాయ్.
* * * *
జన జాగృతికై
పరితపించే బంధువు
సంవత్సరం శ్రమించినా
సన్మానం పొందని భానుడు.
✍️✍️నానీల కవి:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
ఊరు:- బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ-507202
క్రింది లింక్లో నానీలు చదవొచ్చు 👇👇👇
https://molakanews.page/6UjdAk.html
77వ రచనా ప్రచురణ 🌱🌱
మొలక న్యూస్ (సంపాదకులు శ్రీ వేదాంత సూరి తిరునగరి గారు)
🌱🌱🌱04.09.2020🌱🌱🌱
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి