8, ఆగస్టు 2020, శనివారం

ముత్యాల పూసలు నూతన కవితా ప్రక్రియలో భాగంగా గృహహింస చట్టం పై అవగాహన కవితలు

ముత్యాల పూసలు నూతన కవితా ప్రక్రియ


రూపకర్త:- ఆత్రం మోతిరాం

కవి-లిఖిత్ కుమార్ గోదా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల బోనకల్ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం-507204.

నివాసం:-బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202.

----------

1)

అమ్మలా చూడాలి భార్యని

గౌరవించాలి ప్రతి ఇల్లు

అతివల శ్రేయస్సు ముద్దని

గృహహింసలు అసలే కద్దని

అంటూ సాగితే ప్రతి

ఇల్లు అవుతుంది స్వర్గం

ఆనందాలు వెలిసే దేవాలయం.


2)

ఇల్లాలి శోకం ఇంటికి 

తెస్తుంది చేటు సత్యం 

గృహ హింస జరిగితే 

ఉపేక్షించదు భారత ప్రభుత్వం

ఇల్లాలి నవ్వులు తెచ్చును

ఇంటికి హరివిల్లుల సంబరం

ఇంటికి దీపం ఇల్లాలు.


3)

బోనులో బంధించిన జీవియై

పడతి శోకాల సంద్రంలో

సంకెళ్ళు చేతికి వేసుకొని

ఇక్కట్ల క్షోభ అనుభవిస్తే

చెల్లించాలి భారీ మూల్యం

ప్రతి కుటుంబ సభ్యుడు

ఇంటికి వెలుగు పడతి.


4)

పట్టీల సవ్వడితో పండుగలను

గాజుల రవళితో చందమామలా

ఇంటిని ఆనందంగా నిలిపే

అతివని అల్లరి చేస్తే

అమ్మ నాన్నలై తోడు ఉండాల్సిన

అత్తమామలే క్షోభ పెడితే

ప్రభుత్వ చట్టమే అండ.

గృహహింస- చట్టం పై అవగాహన భాగంలో ముత్యాల పూసలు ప్రక్రియలో 10 కవితలు రాసినందుకు పొందిన"చైతన్య ముత్యం"పురస్కారం..

5)

కార్చీకట్లో గదిలో సంసారం

తాగుబోతుల తారకులు మ(మృ)గాళ్ళు

సిగరెట్ల వాతలు అనుభవిస్తే

తాగి తందనాలు ఆడితే

తీరిక లేకుండా దండిస్తుంటే

తిట్ల దండకాలు క్షోభపెడితే

కాలుమోపు చట్టం వైపు.


6)

ఇంట్లో పతియే యముడయ్యి

ఇంటి నరకంగా మార్చి

అనునిత్యం సూటిపోటి మాటలతో

తాగి తందనాలు ఆడుతూ

పడతిని గుచ్చిగుచ్చి వేధిస్తే

గురుడికి తప్పదు చిప్పకూడు

జైలు అతనికి గూడు.


7)

చట్టానికి విరుద్ధంగా మారి

కట్నాల కష్టాలు పెట్టి

కన్నీళ్లతో ముఖాన్ని తడిపి

కలహాలతో మనసును నలిపి

మానసిక క్షోభకు గురిచేస్తే

ఆడది చట్టంకై నడిస్తే

మగాడికి తప్పవు కొరడాదెబ్బలు.


8)

అవ్యాజము తన ప్రేమ

అసమానం తన కష్టం

ఆప్యాయత అనురాగం ప్రేమ

అత్తమామలను చేయును నిత్యం

అమ్మ లాగా లాలన

నాన్న లాగా పాలన

గృహహింసలు తెచ్చిన చేటు.


9)

యత్ర నార్యంతు పూజ్యంతే

రమంతే తత్ర దేవత

అన్న సూక్తిని మరిచి

అవధులు దాటి హేళనచేస్తూ

సూది లాంటి మాటలు

దెబ్బలు కొట్టి వేధించడం

తగునా నీకు మగాడా?


10)

గొళ్లాల చాటున రోదన 

ఇల్లాలు ఇక్కట్లు పడుతుంటే

అమ్మ లాంటి అతివలను

అవధులు దాటి అల్లరిపరిస్తే

సహనం కోల్పోయి భార్య

సంసారం బాగు కోసం

చట్టం వైపు నడకలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...