7, జూన్ 2020, ఆదివారం

కరోనా కవిత[సంచిక అంతర్జాల వారపత్రికలో ప్రచురితమైన కవిత]{28/06/2020}

కరోనా కవిత- 1
కవితా శీర్షిక:- కరోనా పై కవిత్వం (సంచిక అంతర్జాల వారపత్రికలో)
{28/06/2020}
కవితా రచన:- లిఖిత్ కుమార్ గోదా

సాహితీవేత్తలందరూ
బ్యాట్ పట్టి క్రీజులోకి దిగి
కరోనా పై శతకాల దంచేస్తుంటే,
నేనేమో బ్యాట్ పట్టి కూడా
విడ్డూరంగా ఒక్క రన్ కూడా తీయలేదు
కనీసం కరోనా అన్న పేరు
రాయడం కాదు కదా!
అసలు దాని ఊసే మర్చిపోయాను.
రాద్దాం అనుకుంటే
ప్రతిసారి "శానిటైజర్తో
హ్యాండ్ వాష్" అంటూ
చేతులు కడిగి కడిగి
చేతులు నానిపోయాయి.
బ్యాట్ (పెన్ను) పట్టుకుంటే జారిపోతుందాయే.
"గంటకోసారి నీళ్లు తాగుతూ ఉంటే
నోట్లో నానుతున్న "కరోనా కవిత"
మళ్లీ నీటితో పాటే
లోనికి వెళ్లి పోతుందాయే."
సరే గట్టిగా కష్టపడి
'కరోనా పై సమరం'అంటూ
ఏదో రాద్దామనుకున్నా
వాయిస్ టైపు చేసి
బాల్ ని బౌండరీకి తరలిద్దామనుకుంటే
ఫీల్డర్లు చుట్టుముట్టినట్టుగా 
"మాస్క్ నా మూతికి అడ్డుగా" ఉందాయే!
సరే! జనంలోకి వెళ్లి
జన సంచారం చేస్తూ
ఎవరన్నా కవిమిత్రుల దగ్గర
కరోనా పై కవిత్వం చెప్పి
"వాహ్.. క్యా బాత్ హై"
అనిపించుకుందాం అనుకుంటే
ఇంటి బయటికి పోతే
పోలీసు మామయ్యలు బాల్ ని ఎప్పుడు
క్యాచ్ పడదామా అన్నట్టు
కళ్లప్పగించి నిప్పులు కక్కే ఎండలో ఎదురుచూస్తున్నారు.

ఇక "జనసంచారంని విరమించుకున్నా"
కరోనా కవిత్వానికి
లాక్ డౌన్ వేసా.
ఇక ఏమీ చేయలేక
నాకు నేనే లాక్‌డౌన్‌ వేసుకుని
ఇంట్లోనే ఉంటూ
వలస కూలీల ఇక్కట్లను ,
మహా దాతల త్యాగశీలితా బుద్ధిని,
రాలుతున్న జీవితాలను, 
వెజ్జు మహాశయుల
మహోన్నత కృషిని,
కరోనా పై కొత్త అప్డేట్స్ తిలకిస్తూ
వేసవికాలంలో
ఎండ తీవ్రతకు
నన్ను తడిపే చెమటను
నివారించుకోవడం కోసం
"వ్యక్తిగత శుభ్రత" పాటిస్తున్నాను.
ఇక ఏం చేయాలో
ఆ పరమేశ్వరుడుకెరుక.
ఈ కరోనా భావమేమి తిరుమలేశా?
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀

క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇
https://www.sanchika.com/corona-pai-kavitvam/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...