6, జూన్ 2020, శనివారం

మా సొసైటీ పై కవిత

మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల పై కవిత

_________________

కవితా శీర్షిక:-ప్రతి యంజేపీ విద్యార్థి
కవితా రచన:- లిఖిత్ కుమార్ గోదా.
🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚

📚📚చదువులమ్మ ఒడిలో సుస్వరాలు వింటూ
గుణవంతుడై మెలగాలి
ప్రతి యంజేపీ విద్యార్థి.

😊😊సంస్కారమే సలిలముగా
ఆనందాన్నే ఆహారముగా
ఉన్నదానినే వినయంగా సేవించాలి
ప్రతి యంజేపీ విద్యార్థి.

🥰🥰ఉదార స్వభావులై మెలిగి
సమాజాన్ని తమ కుటుంబంగా భావించాలి
ప్రతి యంజేపీ విద్యార్థి.

🏫🏫విద్యా నిలయమే కోవెలగా
👩‍🏫గురువులే దేవతామూర్తులుగా
👨‍🎓👨‍🎓👨‍🎓తోటి విద్యార్థులే తోబుట్టువులుగా భావించాలి
ప్రతి యంజేపీ విద్యార్థి.

🌊🌊ఎగసిపడే కెరటాల్లాగా,
తను ప్రీతి పొందే రంగంలో
సత్తా చాటి చూపాలి
ప్రతి యంజేపీ విద్యార్థి‌.

😔😓🙍మనోధైర్యాన్ని దెబ్బతీసే
అపజయాలను సైతం మట్టుపెట్టి,
🌃ఆకాశాన్నంటే శిఖరాల
🎤అంచుకెక్కి🧗🧗 విజయగీతిక పాడాలి
ప్రతి యంజేపీ విద్యార్థి.

🧒ఇంతింతై, 👩‍🚀👩‍🚀వటుడింతై
🌍🌍ఇళ్లలోన యశస్సు పొందాలి
ప్రతి యంజేపీ విద్యార్థి.

జనుల జీవిత చీకటి బాటకు
💡💡🔦🔦"దారిలో లాంతరు" తాను కావాలి
ప్రతి యంజేపీ విద్యార్థి.

🙍🙍సుఖాలు మరిచిన ముఖాలకు,
😭😭దుఃఖించే ముసుగులు తొలగించి
మళ్లీ నవ్వులు😁😃 అందించే
👬👬👭👭స్నేహితుడిగా మారాలి
ప్రతి యంజేపీ విద్యార్థి.

🌼🌼🌹🌹సిరి హాసం చేసే సుమాలలాగా
😃😃నవ్వుల ప్రపంచాన్ని సృష్టించాలి
ప్రతి యంజేపీ విద్యార్థి.

🧡🧡సమతా మమతలు పంచుతూ
సంఘంలోని కుళ్లు,కుతంత్రాలను తుంచుతూ
🤬🤬దుస్టులు, దుర్మార్గులను ఒంచుతూ
సమాజ హితాన్ని కోరాలి,
👉🇮🇳🇮🇳నవ భారతం సృష్టించాలి
ప్రతి యంజేపీ విద్యార్థి.

యంజేపీలో పునాదులు వేసుకొని
ప్రతి విద్యార్థి👨‍🎓👨‍🎓👨‍🔬👨‍🔬👩‍🏭👩‍🏭 ఉన్నతడై
మనిషి నుండి మనీషై
ఎన్నో ప్రపంచ వింతలు సృజించాలి
మార్గదర్శికంగా మారాలి...
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...