కవి:- లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్, బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం,ఖమ్మం జిల్లా, తెలంగాణ-507202.
______________________________
నిరహంకారం, నిస్వార్ధం
నిండు మనసు, నిబద్ధత
మహోన్నత గుణాలు కలిగిన పరిపాలనాదక్షుడు.
ఆయన ప్రజల మనిషి,
నిత్యం ప్రజల కోసమే పరితపించి,
సేవా దృక్పథంతో పరిమళించిన మనస్వి.
ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వునే
దేవుని వద్ద వరంగా అడిగినా ప్రజా తపస్వి.
సుమారు 14 వేల కిలోమీటర్లు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసి,
ప్రతి ఊరుని.. ప్రతి వీధిని
ప్రతి మనిషిని పలకరించి
పేదవాణ్ణి అక్కున చేర్చుకుని
వారి బాధను అర్థం చేసుకొని
ప్రతి విషయంపై ప్రణాళిక రూపొందించిన రాజయోగ్యుడు.
రాష్ట్రం సుభిక్షంగా పంటలతో గుబాళించిడానికి
రైతన్న ముఖంలో చిరునవ్వులు పులకరించడానికి
ఉచిత విద్యుత్తును చేకూర్చిన అరుణుడు.
అపర భగీరథుడై
కోటి ఎకరాల సాగు భూమికి
నీరు సమకూర్చాలని జలయజ్ఞం తలపెట్టిన లక్ష్య సాధకుడు.
గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు
చేదోడు వాదోడుగా,
పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేసిన
ఆడబిడ్డల ఆత్మీయ బంధువు.
ప్రజల కన్నీరు చూస్తే కలవరి పడిపోయి
కన్నీళ్ళు తుడిచి
కష్టాన్ని నిర్మూలించే ప్రజానాయకుడు.
చిరు నవ్వుల రేడు
పేద ప్రజల ముంగిళ్లలో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు వరాలుగా ఇచ్చిన ఆపద్బాంధవుడు.
ఇందిరమ్మ ఇళ్లతో
ప్రతి పేదవాడికి గూడిచ్చి
వారి హృదయాలలో పూజింపబడుతున్న ఇలవేల్పు.
కార్పొరేట్ హాస్పిటల్లో తెల్ల రేషన్కార్డు ఉన్న పేదవారికి
రెండు లక్షల ఉచిత ఆరోగ్యశ్రీ బీమాతో
ధీమా కలిగించిన సిద్ధహస్తుడు.
పల్లెల నుండి పట్టణాల దాకా
నూటెనిమిది(108) నెంబర్ తో పలకరించి (పలకరిస్తూ)
ఉచితంగా ఆంబులెన్స్ సేవలందించిన ప్రజా వెజ్జు.
ఫీజు రీయింబర్స్ మెంట్ లో ప్రవేశపెట్టి
పేద విద్యార్థులు సైతం
ఐఐటి విద్యనభ్యసించేలా చేసి
పేదవాడు సైతం ఉన్నతంగా జీవించేలా శ్రమించిన గీర్వాణి పుత్రుడు.
మాతృభాష తెలుగు అమ్మకు
విశిష్టమైన ప్రాచీన హోదా కోసం
ఢిల్లీ స్థాయిలో ప్రతిపాదన పోరాటాలు తలపెట్టిన తెలుగు తల్లి ముద్దు బిడ్డ.
ప్రజాశేయస్సే తన ఊపిరిగా భావించి
ప్రజల్ని శీఘ్రంగా పాలించిన పరిపాలనాదక్షుడు.
రామ రాజ్యం.. రాజన్న రాష్ట్రం
రామ పాలన.. రాజన్న పాలన
పేదల నేస్తం.. మన రాజన్న.
త్రిశూల్ సమాచారం వైఎస్సార్ స్పెషల్ బుక్
02.09.2020
76వ రచనా ప్రచురణ 🌱🌱🌱🌱
క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇👇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి