4, ఆగస్టు 2020, మంగళవారం

ఆగష్టు 5న ప్రముఖ దర్శకుడు, అనువాదకులు, పత్రికా సంపాదకులు శ్రీ ఆలూరి వెంకట సుబ్బారావు (చక్రపాణి) గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాసిన కవిత.. తెలుగు వారి వాణి.. చక్రపాణి

   ప్రచురితమైన రచన:- 68.


   🌺🌺  తెలుగు వారి వాణి.. చక్రపాణి (కవిత)🌺🌺
కవి:- లిఖిత్ కుమార్ గోదా,
 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507204



చంద్రమండలాన్ని తెలుగు భువికి తీసుకొచ్చి,
చందమామతో చక్కనైన కబుర్లు చెప్పించి
పిన్నల నుండి పెద్దల దాకా అందరినీ రంజింప చేసే,
బాల సాహిత్య ముంగిట్లో 
ఎన్నో పత్రికలకు ప్రేరణిచ్చి,పోటీనిచ్చి
తెలుగు జాతి అభిఖ్య గాంచేలా 
పన్నెండు భాషల్లో అనువదించి
తెలుగు వాకిట్లో సిరిమల్లె కురిపించిన
తెలుగు సాహిత్య బాణీ.. చక్రపాణి.

తెలుగు ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లేలా 
నిర్మాతగా, దర్శకుడిగా,మాటల రచయితగా,
సువర్ణ చిత్రకథా కదంబాలు సృష్టించి
సినిమాలు,కినిమాలతో
సినీలోకానికి క్రొత్త రూపునిచ్చిన సినీవాణీ.

బెంగాలీ నుండి శరత్ బాబు నవలలు
వంటి ఎన్నో రచనలు అనువదించి,
తెలుగు సాహిత్య ప్రియులకు అసమాన అన్యోన్యతను
పంచిపెట్టిన బహుభాషా కోవిదుడు.

ఉప్పు-ఉసిరికాయ వంటి
బిఎన్ రెడ్డి-చక్రపాణి గార్ల నెయ్యం
తెలుగు జాతికి మిగిలిన తీపి జ్ఞాపకం.

సినీ లోకానికి "కినిమా"ని,
తెలుగు సాహిత్య అభిమానులు హృదయాల్లో
"సంచారి"లా సంచరించి,
"విహారి"లా విహరించి,
ఆంధ్ర జ్యోతితో అలరించి
చంటోళ్ళ కోసం చందమామను
పత్రికా రంగంలో దిగ్గజంగా
విలసిల్లిన సహస్రపాణి.. చక్రపాణి.
🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️🕊️
క్రింది లింక్లో త్రిశూల్ సమాచారం దినపత్రిక పీడీఎఫ్ కలదు 👇👇👇😀😀
https://drive.google.com/file/d/1UnGz-wTwvVeIhiz7FAOpO_H6Vcyxsl0P/view?usp=drivesdk

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...