5, సెప్టెంబర్ 2020, శనివారం

మహతీ సాహితీ కవి సంగమం (కరీంనగరం) వాట్సాప్ సాహిత్య గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన"గురుభ్యోనమః" కవితా సంకలనం కోసం నేను రాసిన కవిత.

                 నవ సమాజ నిర్మాతలు- గురువులు

అణువణువు అంకితభావంతో,
నన్ను తీర్చిదిద్దిన కృషి నాకు గుర్తుంది.
చిత్తశుద్ధితో పాఠాలు బోధించి,
చిరునవ్వులతో బాటలు వేసిన క్షణము గుర్తుంది.
మార్కులు మహారాజుగా గర్వించిన వేళ
"ఇంకా చదవాలి"అన్న అంతర్భావం నాకింకా గుర్తే.
దేశ సేవలో నిమగ్నమై, కఠోర శ్రమత మమ్మల్ని, రేపటి భావి పౌరులుగా, చైతన్య దీపాలుగా మలుస్తున్నది తెలుస్తుంది.
మదిలో దాగిన తిమిరాన్ని తరిమి,
విద్యార్థులందరికీ సరస్వతీ కటాక్షం ప్రసాదించే దివ్య మూర్తులు గురువులు.
కపటం ఉండదు ,కల్మషం ఉండదు;
మదిలో ప్రేమను కురిపించే మేఘం తప్ప.
సద్గుణులను చేస్తున్న సహృదయ గురువులను;
"ఓం శ్రీ గురుభ్యోనమః" అని ప్రాతస్మరణ చేద్దాం.
వారి పాద పూజ చేసి అజయులమై జీవిద్దాం.
🏞️🏞️🏞️🏞️🏞️🏞️🏞️🏞️



       మహతి సాహితీ కవిసంగమం (కరీంనగరం) వారి ఆధ్వర్యంలో వెలువరించిన గురుభ్యో నమః"ఈ- కవితా సంకలనంలో 44వ పుటలో ప్రచురితమైన నా కవిత.

సంపాదకులు శ్రీ "అడిగొప్పుల సదయ్య" గారు అందరిలానే నాకు పంపిన e-ప్రశంసా పత్రం


✍️లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం

ఊరు:- బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507 202
సెల్ నెంబర్:- 9949618101


ఉస్మానియా తెలుగు రచయితలు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బాల విపంచి కవితా పోటీలు వాట్సాప్ సమూహంలో కవిత రాసినందుకు పొందిన ప్రశంసా పత్రం.

మనుమసిద్ధి కవన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన గురుభ్యోనమః వాట్సాప్ సాహిత్య వేదికలో నేను పంపిన కవితకు పంపిన ఈ- ప్రశంసా పత్రం.(కానీ నా కవితని స్వీకరించలేదు).
🔱🔱🔱🔱🔱🔱🔱🔱


మహతి సాహితీ కవిసంగమం (కరీంనగరం)
80వ రచనా ప్రచురణ.
05.09.2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...