(ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా)
గురువులంటే.. మార్గదర్శకులు ,బహుముఖ ప్రజ్ఞాశాలులు.
గుడిలాంటి బడిలో పాఠాల పూజారులు.
కల్మషం లేని మనసుల్లో సంస్కారాన్ని నాటి
ఛాత్రులను నిరంతరం కంటికి రెప్పలా కాపాడి
ప్రపంచానికి స్వచ్ఛమైన మనుషుల్ని పరిచయం చేసే తోటమాలులు.
నల్లని పలకపైన తెల్లని రాతలు రాసి, దిద్దించి
అంధకారం నుండి వెలుగులోకి తీసుకు వచ్చి
ఉన్నతి వైపు అడుగులను మలిచే ఉదయ భానులు.
దిశానిర్దేశాల్లో అర్జునుడిలా సతమవుతున్నప్పుడు,
శ్రీ కృష్ణుడి లాగా భుజం తట్టి,
గీతోపదేశం చేసి మార్గనిర్దేశకునిగా మారతారు.
తమ వద్ద ఉన్న సృజనను
స్వచ్ఛమైన మనసుతో పిల్లలందరికీ పంచే కల్పతరువు.. గురువులు.
వివక్ష చూపక విలువలెన్నో నేర్పి,
అక్షరాల పోరులో అందరినీ అజయేల్ని చేస్తారు.
కేవలం తరగతి గదిలో
పుస్తకాల్లో ఉన్న పాఠాలే కాదు
అమ్మ లాగా అందమైన కథలతో,కోకిల లాగా కమ్మని పాటలతో;
మనసులను హరివిల్లులతో పావనం చేసే స్నేహితులు.
గురువుల పాద పూజ చేసి గుణాన్ని పొందుతాం.
_________________
పేరు:- లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
ఊరు :- బనిగండ్లపాడు గ్రామం,
ఎర్రుపాలెం మండలం,
ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202.
చరవాణి :- 9949618101
🌱🌱 మొలక న్యూస్ 🌱🌱
🇮🇳🇮🇳79వ రచనా ప్రచురణ 🇮🇳🇮🇳
05.09.2020.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి