6, సెప్టెంబర్ 2020, ఆదివారం

షాడో నూతన కవితా ప్రక్రియలో భాగంగా అక్షరాల తోవ,భువన విజయం ఖమ్మం వారు వెలువరించనున్న సంకలనం కోసం నేను రాసిన షాడోలు. సృష్టికర్త: దేవయ్య యనుగందల.

       షాడో నూతన కవితా ప్రక్రియ

షాడో కవి:- లిఖిత్ కుమార్ గోదా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, (మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల బోనకల్ ఖమ్మం జిల్లా తెలంగాణ);
నివాసం:- బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202.

షాడోల సృష్టికర్త దేవయ్య యనుగందల


షాడో నియమాలు 👆👆👆



1)
అమ్మది లాలన
నాన్నది పాలన
చేయకు హేళన
ప్రీతితో చూడుమయా లిఖిత్!
2)
పాటించు సూక్తి
కావాలి యుక్తి
పొందాలి ముక్తి
సారము గ్రహించుమయా లిఖిత్!
3)
ముఖ్యం చెలిమి
మెలుగుము కలిమి
యుండును బలిమి
కదులు సఖ్యతతో లిఖిత్!

4)
బలము తరవాణి
సరి బాలవాణి
నేర్చు సత్యవాణి.
నిజ జీవితములివయా లిఖిత్!

5)
మేలుకోరు కవి
మేల్కొలుపును రవి
ఆగదసలు తరి
తెలిసి మసలాలోయ్ విను లిఖిత్!
6)
చదువు మక్కువ
డబ్బు తక్కువ
ఆశ ఎక్కువ
పేద బాలల వ్యధ లిఖిత్!
7)
మాటలు కసురు
ప్రేమను కొసురు
అహమును విసురు
కన్నతల్లి కరుణ లిఖిత్!
8)
మంచి పెంచును
చెడును తుంచును
శాంతి చేర్చును
పుస్తక బాట సరి లిఖిత్!
9)
ఆయుధం కలం
కేసరుల గళం
న్యాయంకు బలం
కవియె సమాజ మిత్రుడు లిఖిత్!

10)
నడకకు బాట
రసనకు మాట
గొంతుకు పాట
కావాలి మనిషికి లిఖిత్.
11)
మనిషికి డబ్బు
ఆశల జబ్బు
విలాప మబ్బు
ధనం మోహమొద్దు లిఖిత్!
12)
తీపి మనుషులు
వేము మనసులు
మాటలు అసులు
తెలిసి మసలాలోయ్ లిఖిత్!
13)
మన భాష తెలుగు
మనందరి వెలుగు
తెలుగులో మెలుగు
తరువాతే పరభాష లిఖిత్!
14)
విపినముల మనసు
విలాసం మనసు
విలాపం మనసు
మనిషి మనసు స్థితి ఎరుగు లిఖిత్!
15)
వర్షపు చినుకు
మెరుపుల మిణుకు
తడిచిన వణుకు
వర్షపు అనుభూతి లిఖిత్!

16)
ఒకటేలే మది
ఆలోచన పది
మురికి వున్న గది
చెడు వీడి కదలాలోయ్ లిఖిత్!

17)
కావాలి ఊహ
వదలాలి మోహ
చదవాలి దోహ
నిలుపుకో అలవాటును లిఖిత్!

18)
కమ్మని కవనం
మనసుకు పవనం
చేయును చలనం
ప్రశాంతి పొందు చిత్తం లిఖిత్!

19)
గతము మరువుము
నేడు పర్వము
రేపు కార్యము
ముందుకు సాగయా లిఖిత్!

20)
గురువు బోధన
తీర్చు శోధన
బాపు రోదన
శిష్యుడవయి మెలుగు లిఖిత్!

21)
విద్యను అర్జి
చేయుము అర్ధి
కాకు దర్జీ
విద్య బాట పట్టు లిఖిత్!

22)
ప్రగతికి మెట్టు
విషాన్ని నెట్టు
జీవము చెట్టు
తరువు కల్పవల్లి లిఖిత్!

23)
కోపము విడువుము
గురువును కొలువుము
నిలుపుకొ పరువును
మలుచుకోమయా నీలో లిఖిత్!
24)
పసిడి మనసులు
పలుకు పనసలు
పరుగు అనసలు
బాల్యం మధురమే లిఖిత్!
25)
అమూల్యం ఓటు
ముట్టకము నోటు
పొడుచునులె పోటు
బాధ్యతను నిలపాలోయ్ లిఖిత్!
26)
మాటలు ముళ్లు
మనసుకు పుళ్లు
వీడుము కుళ్లు
దీక్ష బూని మెలుగు లిఖిత్!
27)
అహమొక రోగం
పెట్టును శోకం
వీడిన భోగం
సత్యమిది ఆచరించు లిఖిత్!
28)
ఇవ్వుము కరము
చేయు ధర్మము
ఎరుగు మర్మము
కలుగు నిర్మల ఎద లిఖిత్!
29)
ఇల్లు ఆలయం
నవ్వుల నిలయం
చేయకు ప్రళయం
అనుబంధం గొప్పలే లిఖిత్!

30)
ఇంటికి రాణి
సవ్వడి పాణి
మధురిమ వాణి
ఆడపిల్ల ముద్దు లిఖిత్!

31)
లక్ష్యం గగనం
చేయుము మననం
సాగుము గమనం
సాధించి తీరాలోయ్ లిఖిత్!
32)
చదువు ఆసక్తి
చూపాలి భక్తి
జీవమున శక్తి
చేకూర్చును విలువలోయ్ లిఖిత్!
33)
చేయాలి పని
అది మనకు మణి
మాయమవు శని
శ్రమించితే జయం లిఖిత్!
34)
జరపుము పండుగ
అతిథులు నిండుగ
సరదా మెండుగ
మనసులు పులకరించును లిఖిత్!

35)
చరవాణి చెరుచు
తలనొప్పి (తె)తరుచు
చదువులు మరుచును
అవసరముతో మెలుగుము లిఖిత్!
36)
ఇంటికి తరువు
ఊరికి చెరువు
మనిషికి పరువు
తెస్తాయి అభిఖ్య లిఖిత్!
37)
చదవడు ఖలుడు
ఓర్వడు బలుడు
మూర్ఖుడు నరుడు
తెలుసుకో సత్యం లిఖిత్!
38)
మనసొక ఎడారి
తెలియదులె దారి
వెతుకు రహదారి (సత్ దారి)
సత్యాన్వేషివి కమ్ము లిఖిత్!

39)
చేయకు ద్రోహం 
దహించు మోహం
సృజించు లోకం
సత్యబాట పయనించు లిఖిత్!

40)
చేతులు చలువ
కన్నులు కలువ
సంపద విలువ
అవనిని ప్రేమించు లిఖిత్!

41)
దయగల కాయం
చేయుము సాయం
చూపుము న్యాయం
విశ్వ నరుడవే కమ్ము లిఖిత్!

42)
బుద్ధులు కుమతి
నామము సుమతి
ఇదియె భారతి
మార్పు తెమ్ము నీవు లిఖిత్!

43)
పెంచుము సమత
నింపుము మమత
దేశము నవత
ప్రేమ పెంచి బతుకు లిఖిత్!

44)
తుడుచుకొ ద్వేషం
తప్పులు శేషం
సేవలు దేశం
కీర్తి పెంచి నిలవాలి లిఖిత్!

45)
మాటలు మితం
పలుకుము హితం
మరువము క్రితం
మనిషిని ప్రేమించు లిఖిత్!

46)
పఠనం దివ్యం
చదువుము కావ్యం
గానం శ్రావ్యం
అలవర్చుకో సర్వం లిఖిత్!

47)
పేదల కిరణం
చేయుము శరణం 
చల్లని శరణం
చేయాలి పాలకులే లిఖిత్!

48)
ప్రేమించు బడి
అందాల మడి
కవ్వింపు జడి
దేవతలున్న గుడి లిఖిత్!

49)
చిన్నది చీమ
ఉండదు ధీమ
పొదుపుల సీమ
శ్రమించు సౌఖ్యము లిఖిత్!

50)
వీడాలి భ్రాంతి
పాటించు శాంతి
వెలిగించు క్రాంతి
బుగులు వీడి బ్రతుకుమోయ్ లిఖిత్!

51)
కమ్మనిది చూపు
సోయగం రూపు
దేవతల కూర్పు
అమ్మ రుణం తీరదోయ్ లిఖిత్!

👥👥షాడో👥👥
సాహితీ శరధి
చరితకు సారధి
ఉద్యమ వారధి
గద్య దాశరథి ఘనుడు లిఖిత్!(52)

కుటలం బుద్ధి
చేయుము శుద్ధి
పొందుము వృద్ధి
మనిషివలె మారుము లిఖిత్! (53)
____________


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...