8, సెప్టెంబర్ 2020, మంగళవారం

హరివిల్లు నూతన కవితా ప్రక్రియ

 🌈🌈 హరివిల్లులు నూతన కవితా ప్రక్రియ 🌈🌈



కోకిల గానం తెచ్చు

తెలుగింటికి పరవళ్లు

కవుల కమ్మని కలమే

సృజించును హరివిల్లు.(ప్రోత్సాహక విజేత)

(26.08.2020)



గర్జించితే సింహమే

వణుకే పొందును వనము

కలం పెడితే కవులే

కవనం భేరి ఘనము.(2) 27.08.2020.



అంకిత భావ కవులే

సృజించు కమ్మని కవనం,

మహిలో ప్రశాంతికి చెట్లు

తపించి పంచును పవనం (03)

(28.08.2020)


ఖలుని కమ్మని పలుకులే

తెచ్చును మనకు ముప్పు

చల్లగా ఉండు నీరే

ఇనుముకు పట్టును తుప్పు!(04)

(ప్రోత్సాహక విజేత)

(29.08.2020)



తనలోని ప్రతిభను మరిచి

పరులలో వెతుకు మనిషి.

తనలో సౌరభం మరిచి

పూలను వెతుకు కస్తూరి.

(30.08.2020)












కపటం కలిగిన మదికి

తిమిరమై ఉండు లోకం

అవ్యాజముగల మనిషికి

దరిచేరదులే శోకం.(06)

(ప్రోత్సాహక విజేత)

(31.08.2020)


గాయం చేయును పరులకు

ఎక్కువ(మిక్కిలి) పెరిగిన గోరు.

బాధే పెట్టును పరులను

అదుపే లేని నోరు.! (07)

(ద్వితీయ విజేత){01.09.2020}


వెలుగే లేని దారిలో

పయనించితే కే(వే)తనం.

వెలుగులున్న బాటలో

శ్రమించకుంటే పతనం. (08)(02.09.2020)

🔱🔱త్రిశూల్ సమాచారం దినపత్రిక 🔱🔱

08.09.2020

84వ రచనా ప్రచురణ

ఖలుడ్ని ఎంత తిట్టినా

బాధపెట్టవు చివాట్లు,

ఎంత చెబితేని గేదెకు

మార్చదు తన అలవాట్లు. (09)(03/09/2020)


ఘోర తపస్సు చేసినా

ఖలుడు వీడడు కుటిలం,

పాలు కలిసిన "వారి"ని

విడదీయుట జటిలం. (10)

(ప్రోత్సాహక విజేత)(04.09.2020)


నిత్యం కష్టపడినా

గర్వపడదెపుడూ చీమ,

గొప్ప కార్యాలు చేసిన

పోడు వివేకి ధీమా!(11)

05.09.2020


మానవత్వమున్న మనిషి

తీర్చును పరుల గోడు,

కష్టం తెలిసిన మనిషి

నిత్యం ఉండును తోడు. (12)

(ప్రోత్సాహక విజేత)(06.09.2020)




నేటి ప్రస్థానం జాతీయ దినపత్రిక (వెన్నెల సాహిత్య పేజీ)

88వ రచనా ప్రచురణ

14.09.2020.

మనిషికి కావాలి

మానవత్వపు బుద్ధి,

మనిషివై నిర్మూలించు

సమాజ రోగాల్ని శుద్ధి. (13)

(07.09.2020)


పేరు:- లిఖిత్ కుమార్ గోదా

ఊరు:- బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202

   హరివిల్లు నూతన కవితా ప్రక్రియ నియమాలు 👇👇

రోజుకొక హరివిల్లు చొప్పున రాసిన వారికి,100 హరివిల్లులు అయిన తర్వాత హరివిల్లు పురస్కారం ఇవ్వబడును

 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


  🌈🌈 *ప్రక్రియ ..హరివిల్లు* 🌈🌈



 రూపకర్త :-

 *శ్రీ మామిడి రమేష్ గారు** 


నిర్వాహకులు:-

 *శ్రీ వి.టి.ఆర్. మోహనరావు గారు* 

 *శ్రీ సీర హరిప్రసాద్ గారు* 



 *నియమాలు* 


 *1. నాలుగు పాదాలు* 


 *2.ప్రతీపాదములో 8నుండి 12 మాత్రలు మాత్రమే ఉండాలి.* 


 *3. 2,4 పాదాలలో చివర అంత్య ప్రాస ఉండాలి.* 


 *4. రోజుకు ఒక హరివిల్లు మాత్రమే రాయాలి .* 


🌈1

హృదయం మేఘమైతే

భావం కురిసే జల్లు

సాహిత్యాకాశంలో

కైత విరిసే హరివిల్లు


🌈2

గొప్పకాదు బతుక 

కొన్ని వత్సరములు 

నీతి తప్పకుండ 

నిముషమైన చాలు



🌈3

మనసులోని భావాలు

సుస్వరాల రాగాలు

చక్కని కళాఖండాలు

అవే మన హరివిల్లులు  




🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

హరివిల్లు సంఖ్య.. 


--------------------------

-------------------------

-------------------------

---------------------------


పేరు... 

ఊరు.. 


   పై ఫార్మేట్ ప్రకారం రోజుకి ఒక హరివిల్లు మాత్రమే రాయగలరు..

   ప్రతీ రోజు ఉదయం ..6 నుండి సాయంత్రం 6 లోపు పోస్ట్ చెయ్యాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...