15, అక్టోబర్ 2020, గురువారం

కైతికాలు నూతన కవితా ప్రక్రియ: గోస్కుల రమేష్ గారు

 కైతికాలు రాయడం సులభం ఇలా.....

==============
✍మాత్ర ఛందస్సులో రాయాలి
✍ 1,2,3,4,పాదాలలో 9 నుండి 12 మాత్రలు ఉండాలి
✍ 2,4 పాదాలలో అంత్యానుప్రాసలో ఉండాలి
✍ 5 పాదంలో "వారెవ్వా" లేదా పై నాలుగు పాదాలను బలపరిచే మకుటం ,లేదా సరైన పదము గానీ వాడాలి
✍6 వ పాదంలో కవితాత్మక వాక్యం ,నూతన పదబంధం లేదా జాతీయం ,కొసమెరుపులా ఉండాలి 
✍5,6పాదాలలో మాత్ర ఛందస్సు నియమం అవసరం లేదు.కాని సరితూగే అక్షరాలు ఉండాలి.పెద్ద వాక్యాల రూపంలో ఉండకూడదు
====================
ఉదాహరణకు=
లఘవు=1,గురువు=2 మాత్రలు

1) పూ ల న్ని ప ర వ శిం చే
     2 2 1 1 1 1 2 2 =12 మాత్రలు
2) అం ద మై న పం డ గ
     2 1 2 1 2 1 1 =10
3) అ మ్మా యి లం ద రు
     2 2 1 2 1 1 =9
4) ఆ డి పా డు మెం డు గ
     2 1 2 1 2 1 1 =10

5) మా ఊరి బతుకమ్మ 

6) సిరి సంపదలివ్వమ్మ

==========
తీ రొ క్క పూ ల తో
2 2 1 2 1 2 =10

తీ ర్చి ది ద్దు వ ని త లు
2 1 2 1 1 1 1 1= 10

బ తు క మ్మ పా ట ల తో
1 1 2 1 2 1 1 2=11 

నా ట్య మా డు ప ల్లె లు
2 1 2 1 2 1 1= 10

మా ఊరి బతుకమ్మ 

చిరు నప్వుల పువ్వమ్మ
========
అ మ్మ లే ని ఇం టి లో
2 1 2 1 2 1 2 =11
అ ను రా గం మూ ల న
1 1 2 2 2 1 1==10
క న్న త ల్లి లే కుం టే 
2 1 2 1 2 2 2==12
జీ వి తం లో రో ద న
2 1 2 2 2 1 1 =11

కనిపించే దేవత

కన్నతల్లే ఇలలోన
=======
నా దే శం నీ దై న
2 2 2 2 2 1=11
నీ దే శం నా దై న
2 2 2 2 2 1=11
ఎ వ రై న నే ల పై నే
1 1 2 1 2 1 2 2=12
ఎం దు కు ఈ హై రా న
2 1 1 2 2 2 1=11

మారవోయి ఓ మనిషి 

ఉగ్రవాదాన్ని వదిలేసి

✍కోడెం సాంబయ్య (కోసా)
   పద్మాపురం.
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴


🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️

            

కైతికాలు


*లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం*

అక్షరాన్ని నమ్ముకున్న
నిలుచును మన జీవితాలు
కవిత్వాన్ని నమ్ముకున్న
కలుగు నిత్య సత్యాలు
వారెవ్వా లిఖితాలు
శాంతి కోరు కపోతాలు!!(01)

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

మదిలో భావాలు కోసి
పూసగుచ్చె కైతికాలు,
మదిలో బాధలు మరిచి
నేర్చెద నైతికాలు
వారెవ్వా లిఖితాలు
మదిని దోచే కవిత్వాలు!(02)

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

వీచే గాలికి తెలుసు
మనిషి ప్రాణం విలువ,
పీల్చే మనిషికి తెలుసా
ప్రకృతి తల్లి విలువ
ఇకనైనా మానవా !
ప్రకృతిని భాధించుట!!(03)

🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱


పిల్లల నవ్వులు కోరి
చందమామ స్థాపించెను,
కమ్మని కథలు చెప్పి
నీతి సారము పంచెను
వారెవ్వా చక్రపాణి
తెలుగు జనుల వాణి!!(04)

📖📖📖📖📖📖📖📖📖📖📖

పుస్తకాన్ని ప్రమిదలా
మార్చుకున్న రోజు,
జీవితమున నువ్వు
విజేతవైన రోజు
వినవయ్యా విద్యార్థి
అన్యాయానికి ప్రత్యర్థి!(05)

గురువు మాటలు వినాలి
మంచిని చెప్తారు కనుక,
విని వదిలేస్తే సరిపోదు,
పాటిస్తే అది కానుక,
వినవయ్యా విద్యార్థి
భావి తరపు ఆదిత్యా!!(06)
🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵
సన్మానాలాశించక 
కవిత్వాన్ని రాసుకో
శాలువాలు కోరె బుద్ధి
మనసు నుంచి వదులుకో
వినవయ్యా కవివర్యా,
మార్చుకో కవన చర్య!!(07)
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
జగతిలో వ్యాప్తించెద
కవన మొక్కలు నాటి,
పాఠకునెదలో నిలిచెద
శోక సంద్రాలు దాటి.
కవి రాసే సత్యాలు
ఆదిత్యుని కిరణాలు!!(08)
❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️
అబ్దుల్ కలామ్ ఆరాధ్య (కైతికాలు)

కలాం అడుగు జాడలతో
రామేశ్వరము తరించె
పేపరేసి చదువుకుని
దేశాన్ని పాలించె
వారెవ్వా మౌనముని!
జగతి మెచ్చిన విజ్ఞాన గని!!(09)
🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️
చదువుకునెను ప్రీతితో
క్రమశిక్షణ సమేత
జగతి మెచ్చేలా అయ్యె
అంతరిక్ష శాస్త్రవేత్త
వారెవ్వా మిసైల్ మ్యాన్!
భారతీయ మహాన్!!(10)
🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కష్టాలు దాటుకుని
కలామయ్యెను విజేత,
పట్టుదలతో జీవితము
సాధించిన అధినేత
భారతరత్న కలాం!
భరతజాతికాదర్శం !!(11)
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
మహర్షిలా మౌనముగా
మాటల రాశులు పంచెను
అందరికీ హితుడై
జీవితాన్ని నేర్పెను
కలాం వాక్కు ముత్యాలు!
పాటించే సత్యాలు!!(12)
💧💧💧💧💧💧💧💧
లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం
కలం పేరు:- ఆదిత్య శ్రీ
{ అబ్దుల్ కలాం ఆరాధ్య
 అబ్దుల్ కలామ్ ఆరాధ్య (కైతికాలు)-లిఖిత్ కుమార్ గోదా, (ఆదిత్య శ్రీ)ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం - MOLAKA - https://molakanews.page/C3rmy1.html]



✍️ *లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.*
కలం పేరు:- శ్రీ ఆదిత్య

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...