30, అక్టోబర్ 2020, శుక్రవారం

దోహాలు

 ☝️☝️దోహాలు☝️☝️

రచన:- లిఖిత్ కుమార్ గోదా

#మీరు తెలుగు దోహాలు రాయాలనుకుంటున్నారా?అయితే ఈ క్రింది దోహాలను చదివి,నియమాలను తెలుసుకోండి...త్వరలోవెలువడనున్న 'తెలుగు దోహాలు' సంకలనానికి మీ దోహాలను సిద్ధం చేయండి..


||తెలుగు దోహాలు||

÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

*

మమతపంచు 'సత్య'సూక్తే,తలచ మృధువైన ముంజ|

తాగుబోతు నోటిమాటే,బురదలొ పాతిన గుంజ||


*

గెలుపు లభించకుందంటే,'సత్యము' సాధన కొరత|

అంతర్బాహ్య శక్తులతో,పెనగకుంటె అస్థిరత||


*

దాపురించిన పరిస్థితే,సాహసాల జాబిల్లి|

'సత్య'!సందివ్వక కొడితే,తిరగబడునులే పిల్లి||


*

'సత్య'!ఆపత్కాలమునే,ఆలోచన లుదయించు|

దాలిన కాగని పాలలో,ఎట్లు వెన్న జనియించు||


*

తలచినకొద్ది 'సత్య'మిదే,మది కంపించే తీగ|

తోలినకొద్ది వాలునులే,'చింతే' తొలగని ఈగ||


*

'సత్య'!తృప్తినీని పనులే,వీడుట మేలగు రోసి|

కష్టము తప్ప నిష్ఫలమే,గుట్టకు కట్టెలు మోసి||


*

ఆశించక ఫలితాలనే,పనిచేయగ తలపెట్టు|

'సత్యము'చేయు సాధనయే,కీర్తి గుడికి తొలిమెట్టు||


÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷


#తెలుగుదోహా నియమాలు:

~~~~~~~~~~~~~~~

*దోహాలు రెండుపాదాలను కలిగి ఉంటాయి.ప్రతిపాదాన్ని రెండు భాగాలుగా విడగొట్టవచ్చు..


*ప్రతిపాదం తొలి అర్థభాగం 13 మాత్రలు కలిగి,పదమూడవ మాత్రాక్షరం గురువు(దీర్ఘాక్షరం)అయ్యుండాలి.


*ప్రతిపాదం రెండవ అర్థభాగం 11మాత్రలు కలిగి,పదకొండవ మాత్రాక్షరం లఘువు(హ్రస్వాక్షరం)అయ్యుండాలి.


*ఏ పాదంలోని ఏ అర్థభాగమైనా ఐదు మాత్రలతోను,'జ'గణం(IUI)తోను మొదలు కాకూడదు.


*ప్రతిపాదం చివర అంత్యప్రాసను రూపొందించాలి


*తఖల్లుస్(నామముద్ర)ప్రయోగించవచ్చు


*దోహాలు ముక్తకాలు.దేనికదే స్వతంత్రభావాన్ని కలిగి ఉంటుంది.


*దోహాలకు శీర్షిక ఉండదు.


@@@@@@@@@@@@


🌿విడువక చదివిన పొత్తమే, ఎదలో నిలుపును శాంతి|

పొత్తము విడిచిన చేరులే, మదిలో తెలియని భ్రాంతి||(01)


🌿 అధిరోహించిగ శిఖరమే,మనిషికి కీర్తి వచ్చును!

లిఖిత్ కూర్చోకు ఒట్టిగా, విప్పలేవుగ ఉచ్చును!!(02)


🌿ఘోర తపస్సు చేసిననూ,ఖలుడు వీడడు కుటిలము!

క్షీరము కలిసిన సలిలమును, విడదీయుటే జటిలము!!(03)


🌿శూలము పర దేహములకే, మిక్కిలి పెరిగిన గోరు!

శల్యమగును పరులెదలకే, "లిఖి"అదుపు లేని నోరు!!(04)


🌿వింటే సజ్జన పలుకులే,దరిచేరదుగా క్షోభ!

విని చూడు గురువు మాటలే,"లిఖిత్" జీవితమె శోభ!(05)


🌿ఖలుని ఎంతగ తిట్టిననూ,బాధ పెట్టవు చివాట్లు!

కొడితేనేమి శునకమునే, మార్చదు తన అలవాట్లు!(06)



🌿సన్మానాలనాశించే ,రాయకు లిఖిత్ కవితలు!

తెలుసుకుంటే సత్యములే,రాసినవగును తవికలు!!(07)


Trishul Samacharam daily Published

(27/10/2020)


✍️ లిఖిత్ కుమార్ గోదా.,

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...