5, సెప్టెంబర్ 2020, శనివారం

సెప్టెంబర్ 5న ఒక విశిష్టమైన రోజు. ఎందుకంటే ఈ రోజు మనకు అక్షరాలు దిద్దించి మన జీవన గమనంలో మనకు తోడ్పాటుగా ఉంటారు ఉపాధ్యాయులు. వారికిదే నా కవిత అంకితం..

                  అమృత మూర్తులు.. ఉపాధ్యాయులు
(సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులు దినోత్సవ సందర్భంగా)


మదిలో అంకితభావంతో,
మేనులో క్రమశిక్షణను అలవర్చుకొని,
కలమూ పొత్తాలే ఆయుధంగా చేసుకుని
విద్యార్థుల్ని సౌజన్య శీలురుగా మలచడమే ధ్యేయంగా;
దేశ సేవనే కాంక్షగా
తపించిపోయే తేజ మూర్తులు,
నిస్వార్ధ అమృత మూర్తులు వారు.

అనంతమైన సహనానికి నిండు సాక్ష్యంగా,
అందమైన ముఖ తేజస్సుతో చిరునవ్వులు పండిస్తూ,
విద్యార్థులు అడిగే సందేహాలను
పూస గుచ్చి వివరించే విద్యార్థి (స) హితులు వారు.

పాలబువ్వ కథలు చెప్పి
పసిపాపల మనసులో
సద్గుణాలు పదిల పరుస్తూ;
కోయిల స్వరముతో
కోలాహల పాటలతో
తరగతి గదిని స్వర్గసీమ చేసి,
వెన్నెల కురిపించే చంద్రులు వారు.

అపర చాణిక్యులై
అజ్ఞానాంధకారంలో మునిగిన
పసి మనసుల మదిలో
"విద్య"అనే చిల్లి గింజలు వేసి
వారిలో ఇమిడిన మలినాన్ని తొలగించే
నవ సమాజ నిర్మాతలు వారు.

ఎంత తెలిసినా అణిగిమణిగి
తాము నిరంతర విద్యార్థులై
ప్రపంచమంతా విహరించి
వింతలను, విశేషాలను, విలువలను
వినూత్నంగా వివరించే సృజనశీలురు వారు.

నిస్వార్థ రహితంగా విద్యార్థులందరికీ
నైతిక విలువలు నూరుపోస్తూ,
సరస్వతి కటాక్షాన్ని ప్రసాదించే విద్య ప్రదాతలు వారు.

శాంతత్వం, అమలినమైన వాత్సల్యం,
నిరంతర కృషి, పట్టుదల, క్రమశిక్షణ
స్నేహశీలత, అంకిత భావాలు వంటి 
మహోన్నత సద్గుణాలను తమలో ఇముడ్చుకొని
విద్యార్థులందరికీ ఆదర్శప్రాయమైన
అమృత మూర్తులు.. ఉపాధ్యాయులు.

తమ ప్రాయము మరిచి
పసివాళ్ళై ఛాత్రులతో కలిసి ఆటలాడి
మధుర జ్ఞాపకాలు ఎన్నో మొలకెత్తించే
స్నేహశీల స్వభావులు.. గురు దేవుళ్ళు.

అలాంటి నా గురువులకు పాదాభివందనం చేసి,
ప్రాతస్మరణీయం చేసుకుని
"ఓం శ్రీ గురుభ్యోనమః" శ్లోకాన్ని ఆచరణలో పెడుతూ,
వారు నిర్దేశించిన సత్ బాటలో నడుస్తాను.
అజయుడనై దేశానికి వన్నె తెస్తాను.
✍️✍️✍️✍️✍️✍️✍️✍️
లిఖిత్ కుమార్ గోదా
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం,
బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202
ఫోన్:- 9949618101

క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇👇
(త్రిశూల్ సమాచారం దినపత్రిక పీడీఎఫ్)

https://drive.google.com/file/d/1oh63zcoviAjM0u6muFiRVozZ-dYny3lX/view?usp=drivesdk


🔱🔱🔱 త్రిశూల్ సమాచారం దినపత్రిక 🔱🔱🔱

78వ రచనా ప్రచురణ

05.09.2020.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...