29, ఆగస్టు 2020, శనివారం

ఈరోజు (29.08.2020) త్రిశూల్ సమాచారం దినపత్రికలో ప్రచురితమైన నా వచన కవిత "తెలుగంటే నా కవిత..తెలుగుంటే నా భవిత". ప్రచురించిన సంపాదకులు గారికి కృతజ్ఞతలు

 (ఆగష్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాసిన కవిత)

    తెలుగంటే నా కవిత..

   తెలుగుంటే నా భవిత(కవిత్వం)








✍️✍️✍️కవి:- లిఖిత్ కుమార్ గోదా,
        ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
        బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం 
        మండలం ఖమ్మం జిల్లా-507 202.

తెలుగు నా మాతృభాష
పది కోట్ల ప్రజల శ్వాస.
వేల సంవత్సరాలు చరిత గన్న ప్రాచీనభాష
నన్నయను మొదలుకొని నందిని సిద్ధారెడ్డి వరకు
పోతనను కలుపుకుని పోతగాని కవుల వరకూ
"కవి రేవా ప్రజాపతిః" అని చాటుకుంటున్నా
కవనాల భాష.. నా తెలుగు.
మమతలు ఎన్నో కూడగట్టుకున్న
మధురమైన, మహిలో ఘనమైన భాష
నా మాతృభాష తెలుగు.
కన్నడ రాజు శ్రీకృష్ణదేవరాయలు చేత
"దేశ భాషలందు తెలుగు లెస్స"
అని సగర్వంగా కీర్తింపబడిన అమర భాష
ఆముక్తమాల్యద శ్వాస.. నా తెలుగు భాష.
నికోలా డి కాంటీ చేత
"ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్"గా వర్ణించబడిన అజంత భాష.
మహనీయుడు సి.పి.బ్రౌనుల వంటి ఎందరో పరదేశస్థుల చేత తేజాన్ని పొందిన చైతన్య భాష.
గురజాడ అడుగులు, గిడుగు పిడుగులు
శ్రీ శ్రీ సెగలు, దేవులపల్లి సోయగాలు
సినారె సిరులు, దాశరధి శరధులు
సాహిత్యంతో పులకరించి పోయిన 
కంజాత వల్లి నా తెలుగు తల్లి.
ఉగాది పచ్చడి షడ్రుచులు, శ్రీ రామ నవమి ములు,
అట్లతద్దెలు, రాఖీ ఉత్సవాలు,
విగ్నేశ్వరుని ఉత్సవాలు,సంక్రాంతి సందడి భోగిమంటలు 
లాంటి మన్పావనాలు, మానవ అనుబంధాలతో
వర్షించి తడుస్తున్న కర్మభూమి నా తెలుగు సీమ.
అరుదైన ప్రాచీన హోదాను
ఏకగ్రీవంగా పొందిన అరుణోదయ జ్వాల 
నా తెలుగు భాష .
రోజుకొక కవి కర(ల)ము నుండి,
శిల్పమై చక్కబడుతున్న సుందరవల్లికా 
మందార మకరంద మల్లికా
నా తెలుగు భాష.
స్వర మెత్తి చాటాలి మన భాష అభిఖ్య ఆకాశం దాకా,
అతిధి లాగ భావించు పరాయి భాషను.
తెలుగంటే నా కవిత
తెలుగుంటే నా భవిత.

క్రింది లింక్లో దినపత్రిక చదవొచ్చు 👇👇👇

🔱🔱🔱త్రిశూల్ సమాచారం దినపత్రిక🔱🔱🔱
75వ రచనా ప్రచురణ
29.08.2020

27, ఆగస్టు 2020, గురువారం

మన అభిమాన బాలల పత్రిక మొలక న్యూస్ లో ప్రచురించిన నా ముత్యాల పూసలు (మిత్రుడు)

       ముత్యాల పూసలు (మిత్రుడు)
కవి:-లిఖిత్ కుమార్ గోదా,
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం,
బనిగండ్లపాడు గ్రామం ,ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202.
_____________________



1)
అమ్మా నాన్న తరువాత
ఆలనా పాలనల ఆపద్బాంధవుడు
అన్నీ తానై తోడుండు
కుచేలునికి శ్రీకృష్ణుడు మిత్రుడు
సుగ్రీవునికి శ్రీరాముడు స్నేహితుడు
దుర్యోధనుడికి కర్ణుడు మోనిస్
మిత్రుని తోడు శ్రీరామరక్ష.
2)
విదురుడై బోధించును నీతులు
అవ్యాజమైన పేర్మిని కురిపించు
చిరునవ్వులు పంచే శ్రేయోభిలాషి
నిత్యం నీడలా తోడుండు
నిత్యం సత్యం పలుకును
చేసిన తప్పులు మన్నించు
నిజాయితీగా మెలుగును నేస్తం.

మొలక న్యూస్
టి. వేదాంత సూరి గారు
74వ రచనా ప్రచురణ 🌱🌱🌱🌱
27.08.2020
క్రింది లింక్లో ముత్యాల పూసలు చదవొచ్చు 👇👇👇
https://molakanews.page/i0A_Pp.html

26, ఆగస్టు 2020, బుధవారం

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 10వ సంచిక కోసం నేను రాసిన కవిత: అమర చతుష్ట సారధి.. భగత్ సింగ్

    దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 10వ సంచిక కోసం..

అంశం:- విప్లవ జ్యోతి.. భగత్ సింగ్

శీర్షిక:- అమరచతుష్టయం సారధి...మన భగత్ సింగ్ 







కవి:-లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం.







ఆయన కేవలం 
భరతమాత అమృత గర్భం నుండి జన్మించలేదు,
అమ్మ గర్భంలో రూపుదిద్దుకుంటూనే
అప్రాచ్యుల అణచివేతల తూటా పోట్లను,
అన్యాయ బానిస పరిపాలన ఆక్రంధనలను
భరతమాత ఎద చప్పుడు స్పర్శ కంటూ
"అమ్మ కోసం పోరాడి,
ఆఖరికి ప్రాణమొడ్డైనా సరే
దాస్య శృంఖలాలను తెంపాలి" అనుకుంటూ
అరుణోదయములా జన్మించిన అసమాన శూర విప్లవ తేజం.

పదమూడేళ్ల పసిప్రాయం నుండే
పాఠశాల నుండి స్వాతంత్ర పోరుశాల వైపు
కదం తొక్కిన ఉద్యమ శౌర్యం.

"విదేశీ వస్త్రం మాయదారి
స్వదేశీ ఖాదీ విజయభేరి"
అంటూ బ్రిటిష్ పాలనను కళ్లెం వేసిన జయశాలి.

ఆరాధ్య దైవంగా సేవించే 'పంజాబ్ కేసరి'ని
సైమన్ కమిషన్ పోరులో
మరణానికి దారి తీసేలా చేసిన
బ్రిటిష్ పోలీస్ అధికారి సాండర్స్ ను
నిప్పు కణిక లాగా రగిలిపోయి
మరణ బాట నడిపించిన సవ్యసాచి.

చంద్రశేఖర్ ఆజాద్, రాజ్ గురు, సుఖ్ దేవ్
వంటి తిరుగులేని "విప్లవ చతుష్టయానికి సారధి."

బ్రిటిష్ పార్లమెంట్ పై
"బాంబుల వర్షం" కురిపించి
"ఇంక్విలాబ్ జిందాబాద్" అంటూ
పిడికిలిని ఆకాశంలో నిలిపిన సాహస విక్రమార్కుడు.

భగత్ సింగ్,
విప్లవానికి అతడొక నిలువెత్తు రూపం.
ఆ పేరు ఎగిసే ఉవ్వెత్తు కెరటం.
ఆ పేరు త్యాగానికి, దేశభక్తికి పర్యాయపదం.
తిరుగులేని నాయకత్వానికి నిండు సాక్ష్యం,
అఖండ భరత జాతికి గుండె ధైర్యం.
బ్రిటిష్ పాలిట సింహస్వప్నం.
ప్రతి భారత భాగ్య విధాతకు ఆయన ఆరాధ్య దైవం.
పోరాడే ప్రతి ఒక్కరికి ఆయనో ఆదర్శం.

 
 హామీ పత్రం:-
కవి పేరు: - లిఖిత్ కుమార్ గోదా,
శీర్షిక:- అమరచతుష్ట సారధి...మన భగత్ సింగ్ 
చిరునామా: 
ఇంటి నెంబర్ : - 1- 115/3,బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం,
ఖమ్మం జిల్లా - 507 202.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
హామీ పత్రం: -
ఈ కవిత దేశభక్తి సాహిత్య ఈ పత్రిక కోసం వ్రాయబడింది. ఈ రచన ఎక్కడా ప్రచురితం కాలేదని, ఈ కవిత ఏ రచనకి అనువాదం కాదని, ఎక్కడ కాఫీ కొట్టలేదని, ఈ కవిత నా సొంత రచనని, పేర్కొంటూ హామీ ఇస్తున్నాను.
( దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 10వ సంచిక కోసం రాసిన కవిత)
05.10.2020
దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 10వ సంచిక
క్రింది లింక్లో పుస్తక రూపంలో ఈ-సంకలనం కలదు 👇👇
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️



మహతి సాహితీ కవిసంగమం కరీంనగరం వాట్సాప్ గ్రూప్ ద్వారా నిర్వహిస్తున్న సాహిత్య ఈ సేవలో భాగంగా ఈసారి ఇష్టపదుల ప్రక్రియలో మొదటి సారి నేను రాసిన ఇష్టపదులు

     🌺🌺మహతి సాహితీ కవి సంగమం 🌺🌺



పేరు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్.
ఊరు:- బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా-507202.
సెల్ నెంబర్:- 9949618101

శీర్షిక :- దేశభక్తి, స్నేహం (ఇష్టపది ప్రక్రియ)
1)
ఎందరో త్యాగమిది-ఎందరో ఫలితమిది
ఎగరేయి కేతనం-ఎలుగెత్తు మన చరిత
సమత మమత పెంచుము-సఖ్యతతో మెలుగుము
తోచినట్టు సాయం-తోబుట్టువై చేయు
దేశభక్తి నింపుకొ-దేశాన్ని ప్రేమించు
కదులుము నింగి వైపు-కలహాలు చెరిపేయు
అంకితభావంతో -అందించు నీ సేవ
భరతమాతకు సేవ-బాధ్యతగాను లిఖిత్.
స్నేహం (ఇష్టపది ప్రక్రియ)

2)
స్నేహమే జీవితం-స్నేహమే శాశ్వతం
మిత్రుడు తోడుంటే-మిగులు సంతోషములు
అవ్యాజ మనసుతో-ఆనందము పంచును
అమ్మ లాగా చూడు-ఆలనా పాలనా
నాన్నలాగా చూపు- నాణ్యమైన బాటను
మిత్రుడు వెన్నంటే-మిగలరు మనకు రిపులు
మాటలు కఠినములె-మాధుర్యం లోపల
లిఖిత్ చేయు స్నేహం - లిఖించుము కవనాలు‌.
🔥🔥🔥🔥🔥🔥🔥🔥

ఇష్టపది నియమాలు::

1.ఎనిమిది పాదాలు ఉండాలి.

2.ప్రతి పాదం 10+10 మాత్రలుగా రెండు భాగాలుగా విభజించబడిఉంటుంది.

3.మొదటి భాగంలోని మొదటి అక్షరానికి,రెండవ భాగంలోని మొదటి అక్షరానికి యతిమైత్రిగాని,ప్రాసయతి గానీ కుదరాలి.

4.చివరి పాదంలోగానీ,చివరి రెండు పాదాలలోని గాని ఇష్టదైవమునకు వినతిచేస్తున్నట్లుగా "దైవ నామం" మకుటంగాను లేదా "కవి నామ ముద్ర" లేదా "రెండూ" ఉండాలి.

5.లఘువుకు ఒక మాత్ర-గురువుకు రెండు మాత్రలుగా లెక్కించాలి.

ఉదా :
అరవింద నేత్రుండు - అందాల ఎకిమీడు
I I U I U U I - U U I
I I U I
10 మాత్రలు + 10 మాత్రలు

అరవింద లోన "అ"కు, అందాల లోని "అ"కు యతిమైత్రి కుదిరింది.
🌋🌋🌋🌋🌋🌋🌋
ఇష్టపది వారపత్రికలో ప్రచురితమైన నా ఇష్టపది (3)

భరతమాత పుత్రుడు- బంగాలో పుట్టెను
భగత్ సింగ్ పేరులే- భయమే లేని వీరుడు
స్వాతంత్ర్యము కోరెను- సాహసాలు చేసెను
అసెంబ్లీ మీదతడు- అణుబాంబులు వేసెను
బ్రిటీషోళ్ల ఎదలో- బిక్కు బిక్కు లాడెను
నిండుగ దేశభక్తి- నింపుకున్న యువకుడు
మీసమతను తిప్పగ- మిన్నంటును ధైర్యం
అమర చతుష్టయంకు- అతడు సారధి అయ్యెను!! (03)





ఇష్టపది వారపత్రిక ఎడిటర్ అడిగొప్పుల సదయ్య గారికి కృతజ్ఞతలు 🙏
క్రింది లింక్లో పుస్తక రూపంలో ఈ-సంకలనం కలదు 👇 👇👇

https://drive.google.com/file/d/1DBt2M_FDCEj6TxiZRk2HkJjDOSwNIH4T/view?usp=drivesdk

92వ రచనా ప్రచురణ
ఇష్టపది వారపత్రిక:- అడిగొప్పుల సదయ్య గారు
(14/09/2020)-(20/092020)

కరోనా పై కవితలు సంకలనం కోసం మహమ్మద్ రఫీ (ఈ-వేమన) గారి ఆహ్వానం మేరకు రాసిన కవిత ఇది.

   ఘరానా కరోనాకు              చరమగీతం..

లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్, ఖమ్మం జిల్లా, తెలంగాణ-507204.



__________________________


కాటేస్తున్న కరోనాను కోరలు పీకి కదలాలి

జన చైతన్యం పొందితేనే కరోనాని జయించేది,

నిద్ర లేచింది మొదలు నిద్ర లోకి జారు వరకు

జాగ్రత్తలు తీసుకుంటే కరోనాని పడగొట్టినట్లే.

వేడి నీళ్లు తాగవోయ్ విపరీతంగా

కరోనాని మూడు చెరువులు నీళ్లు తాగించు.

సబ్బుతోన చేయి కలిపి కడుగు చేతిలెప్పుడు

కరోనాకు కన్నీరు తెప్పించు.

నిరంతరం పట్టుకోవాలి ఆవిరి

కోవిడ్ని ఉక్కిరి బిక్కిరి చేయడానికి.

బయటకు వెళుతున్న తరుణంలో మాస్కు పెట్టు ముఖానికి

కరోనాకి గోడ కట్టి కట్టిపెట్టు.

సామాజిక దూరం పాటించు

దుష్టులకు దూరంగా ఉండినట్లు.

వేరే వ్యాక్సిన్ వచ్చేదాకా ఆగడం ఎందుకు?

మేలు జరుగును చూడు

పూర్వీకులు సూచించిన జాగ్రత్తలు ఆచరిస్తే.

కరోనా సోకిన వ్యక్తికి

మానవత్వంతో బాసటగా నిలువు.

విధించిన షరతులను తూచా తప్పకుండా పాటిస్తే

ప్రతి మనిషీ కరోనాని జయించినట్లే

చరమగీతం పాడి కరోనాని తరిమితరిమి కొట్టినట్లే.


_________________


చిరునామా:- 


బనిగండ్లపాడు గ్రామం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం-507202

ఫోన్:- 9949618101


 

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారు ఆహ్వానించిన కాళోజీ నారాయణరావు గారిపై కవితలు ఈ-బుక్ లో నేను రాసిన కవిత.ఇది నా 73వ రచనా ప్రచురణ 🌱🌱.


73.    తెలంగాణ గళం... కాళోజీ
లిఖిత్ కుమార్ గోదా

















కాళోజీకి కవితాభిషేకం ప్రత్యేక ఈ-సంచికలో వచ్చిన నా కవిత.
సంపాదకులు శ్రీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు 🙏🙏🌷🏵️


ఉద్యమాల కలం.. తెలంగాణ గళం
నిరంకుశ రాజ్యాల మీద కలం పట్టి
నైజామును ఎదిరించిన విప్లవ దళం
అన్యాయాలపై, అణిచివేతలపై ఆగ్రహించి
తన వాదనతో నిప్పులు కక్కిన తెలంగాణ విప్లవ శౌర్యం.
అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకారాధ్యుడని నమ్మిన ప్రజా తేజం.
ప్రజల కోసమే జైలు జీవితాన్ని గడిపి
జీవితాంతం ప్రజాస్వామ్యవాదిగా బతికిన ప్రజాకవి.
అందమైన కథానికలతో వ్యంగ్యాస్త్రం ప్రయోగించి,
తెలంగాణేతరులను బుగులు పెట్టించిన కవన కిశోరం.
శ్రీశ్రీచే "లూయీ ఆరెగాన్" గా పిలవబడ్డ
బుగులు లేని దిగులు లేని ఉద్యమకవి.
తెలంగాణ వైతాళికుడు..మన కాళోజీ...
ఆ సాహితీకిరణం ప్రతి పౌరునికి ఆదర్శం..

----సమాప్తం-----

సెప్టెంబర్ 9, 2020 
ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా
" కాళోజికి కవితాభిషేకం"
కాళోజిపై కవితలు రాయండి. ప్రశంసా పత్రం పొందండి

కవిత form లోనే రాయాలి

- సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

https://docs.google.com/forms/d/e/1FAIpQLSf4fiVEse83ESuL2wkScFFTk1n75MbJl1j2yDYXYkr44dU6TQ/viewform

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక
కాళోజీ నారాయణరావు గారిపై కవితలు ఈ-బుక్ లో నేను రాసిన కవిత.
73వ రచనా ప్రచురణ 🌱🌱.

క్రింది లింక్లో కలర్ ఈ-సంకలనం కలదు 👇👇
https://drive.google.com/file/d/1sv_7hq7aCUIHxUj70Gz_kkiFqxAQslpW/view?usp=drivesdk

25, ఆగస్టు 2020, మంగళవారం

మన అభిమాన బాలల పత్రిక మొలక న్యూస్ లో ప్రచురించిన నా వ్యంజకాలు (25.08.2020)-ఇది నా 72వ రచనా ప్రచురణ 🌱🌱.

 72.           వ్యంజకాలు 

కవి:- లిఖిత్ కుమార్ గోదా (చిన్ని),


1)ఆటలాడితే శరీరానికి

మెదడుకు ఎంతో మేలన్నారు సరే,

ఆడదామని బయటకు వస్తే అమ్మానాన్నలు ఉపాధ్యాయులు

చదువులంటూ ఇంట్లోకి తరిమేస్తున్నారు.


2)రోజుకో "సేపు పండు" తింటే

డాక్టర్ అవసరం లేదన్నారు

మళ్లీ వాటిలో ఏవో రసాయనాలు

వాడారని నోటి వద్ద నుండి లాగేశారు.


3)దేశాన్ని పరిశుభ్రంగా ఊడవాలి అంటూ

మొదలెట్టారో మహోద్యమం

కాకపోతే మరిచిపోయారు 

మురికివాడల వద్ద ఉన్న దినార్తుల జీవితం.


4)మనసుంటే మార్గం ఉంటుంది అని

చక్కని హితబోధ చేస్తాడు

కష్టాలలో మనసుతో ఆలోచించకుండా

మార్గం కోసం వెతుకుతూ ఉంటాడు.

మొలక న్యూస్

25.08.2020

72వ రచనా ప్రచురణ 🌱🌱🌱🌱 🌱🌱


క్రింది లింక్లో వ్యంజకాలు చదవొచ్చు 👇👇👇

https://molakanews.page/Uza1I6.html

24, ఆగస్టు 2020, సోమవారం

మన అభిమాన బాలల పత్రిక మొలక న్యూస్ లో ప్రచురితమైన నా 71వ రచన ఉద్యమిస్తే అక్షరం.. అది దాశరథి రంగాచార్య (కవిత)


    ఉద్యమిస్తే అక్షరం.. అది దాశరథి రంగాచార్య



తెలుగు సాహితీ కుటుంబ సదనంలో

అందమైన నవలా చక్రవర్తి

మన దాశరధి రంగాచార్యులు.

తెలంగాణ జన జీవనం, రైతాంగ పోరాట నేపథ్యాన్ని జీవ శక్తిగా మలచుకుని,

తెలుగువారి సాంస్కృతిక జీవనాన్ని

తన పదునైన దీటైన నవలలతో

మయసభలా చిత్రించిన కళావల్లభుడు.

వరదాచార్యులుచే "గద్య దాశరధి" అని

పేర్మితో పిలిపించుకున్న రతనాల సారధి.

"చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు,జనపదం

జీవనయానం, రానున్నది ఏది నిజం"

వంటి మహత్తర రచనలకు పురుడు పోసిన

తెలుగు సాహితీ తేజం మన రంగాచార్య.

నవల రచన చరిత్రలో

పాత్రోచిత యాసను ప్రవేశ పరిచిన మహా పురుషుడు.

అక్షరం మానవ రూపం దాల్చి

ఉద్యమిస్తే అది దాశరధి రంగాచార్యనే.

✍️లిఖిత్ కుమార్ గోదా

24.08.2020

71వ రచనా ప్రచురణ

27వ కవితా ప్రచురణ

మొలక న్యూస్ 

టి. వేదాంత సూరి గారు

క్రింది లింక్లో కవితని చదవొచ్చు 👇👇👇

https://molakanews.page/3MkahM.html

23, ఆగస్టు 2020, ఆదివారం

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారం వారం కవితా హారం ఆన్లైన్ కవి సమ్మేళనంలో 7వ సారి నేను....

 

●●●●●●●●


దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 

Face Book Group 

వారి " వారం, వారం కవితా హారం" 

ఆన్లైన్ కవి సమ్మేళనం


ఆగస్ట్ 23, 2020 ఆదివారం

ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు


20 వ ఆదివారం

అంశం : 


((( ఆంధ్ర కేసరికి అక్షర మాలలు )))


పాల్గొనండి, వీక్షించండి


సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

అడ్మిన్.

21, ఆగస్టు 2020, శుక్రవారం

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 9వ సంచికలో నేను రాసిన కవిత:- భారతీయ భవధీయ తేజం.. పీవీ (70వ రచనా ప్రచురణ 🇮🇳)

   🇮🇳🇮🇳  మౌన ముని, స్థితప్రజ్ఞుడు,అపర చాణక్యుడు,మన తెలుగు తేజం.. శ్రీ పీవీ నరసింహారావ్ గారు.🇮🇳🇮🇳

61వ పుటలో ప్రచురితమైన నా కవిత..

పొందిన ఈ- ప్రశంసా పత్రం

  భారతీయ భవదీయ తేజం.. పీవీ

   లిఖిత్ కుమార్ గోదా

 ఇంటర్మీడియట్ విద్యార్థి, మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల,బోనకల్-507204

_______________________________________

పీవీ నరసింహారావు,

భరతమాత మానసపుత్రుడు,

బాసర జ్ఞాన సరస్వతి తల్లి ఒడిలో

అక్షరాభ్యాసం చేసిన గీర్వాణి పుత్రుడు,

విద్యార్థి దశలోనే నైజాం రిపులకు వ్యతిరేకంగా

గుండె బిగువుతో,పిడికెలు బిగించి,చేయెత్తి

"వందేమాతరం"అంటూ గర్జించిన కేసరిలా జైకొట్టిన,

రాటుతేలిన మహోజ్వల నాయకుడు.

అతని ఠీవితో

భారతీయ సంప్రదాయా వైభవాన్ని

ప్రపంచానికి చూపించిన స్ఫూర్తి కెరటం.

రాజకీయ రంగంలో శాసనసభ్యుడు అయ్యి,

తదుపరి రాష్ట్ర విద్యావంతుడై, 

తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి, 

తెలుగు నేలను ఏలిన తెలుగు కిశోరం.

తొలి తెలుగు ప్రధానిగా

దేశ ఆర్థిక వ్యవస్థ వెన్ను కోల్పోతున్న తరుణంలో,

తన అపర చాణక్య మేధస్సుతో,

దేశ ఆర్థిక సంస్కరణ ప్రవేశ పెట్టి

అమ్మకు (భారత మాత)మహత్తర వైభవాన్ని

తీసుకొచ్చిన పరిపాలనాదక్షుడు.

పుచ్చుకున్న ప్రతి పదవిని

ప్రజలు పెదవి విరవకుండా

పరిపూర్ణంగా పాలనకు న్యాయం చేసిన స్థితప్రజ్ఞుడు.

సంస్కృతంలో అనర్గళంగా ప్రసంగించి

విమర్శకుల మనసులను మన్పావనం చేసిన మహర్షి.

బహు భాషా కోవిదునిగా పేరెన్నికగని 

అంతర్జాతీయ సదస్సుల్లో

తను నేర్చిన పదిహేడు భాషల్లో

ఒకటైన స్పానిష్ భాషను

అనర్గళంగా మాట్లాడి

క్యూబా దేశ విప్లవ కిషోరమైన

ఫిడెల్ కాస్ట్రోనూ అబ్బురపరిచిన భారతీయ భాషా అభిఖ్య.


మధురమైన "విజయ" కల నామంతో

"గొల్ల రామవ్వ" వంటి చారిత్రాత్మక రచనలు చేసినప్పటికీ,

ఎందరో కవి సామ్రాట్ల రచనలు

వివిధ భాషల్లోకి అనువాదం చేసి

సాహిత్యానికి పచ్చ తోరణం కట్టిన సాహిత్య సామ్రాట్.

పీవీ మహాశయా,

భారతరత్నమా,

దేశహితోత్తమా,

పూజ్య మాణిక్యమా,

స్థిత ప్రజ్ణమా,

నీకు అపరిమిత కరములు కరములు.

__________________________________


కవి పేరు: - లిఖిత్ కుమార్ గోదా,

రచన: - భారతీయ భవదీయ తేజం.. పీవీ

చిరునామా: -

 హౌస్ నెంబర్ : - 

 1 - 115/3,బనిగండ్లపాడు గ్రామం, 

ఎర్రుపాలెం మండలం,

ఖమ్మం జిల్లా - 507 202.

21.08.2020

🇮🇳🇮🇳70వ రచనా ప్రచురణ🇮🇳🇮🇳

26వ కవితా ప్రచురణ.

క్రింది లింక్లో ఈ-బుక్ కలదు 👇👇👇

https://drive.google.com/file/d/1cz72jOfxgGSVrtEEcpUvoSp7RzfP60B-/view?usp=drivesdk

20, ఆగస్టు 2020, గురువారం

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారు ఆహ్వానించిన టంగుటూరి ప్రకాశం పంతులు ఈ-బుక్ లో నేను రాసిన కవిత :- ఆంధ్ర కేసరి..మన టంగుటూరి

 ఆంధ్ర కేసరి..మన టంగుటూరి 

(దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారు ఆహ్వానించిన టంగుటూరి ప్రకాశం పంతులు ఈ-బుక్ లో  నేను రాసిన కవిత 36 పుటలో ప్రచురితమైనది)

🌱 ఇది నా 69వ రచనా ప్రచురణ 🌱

      లిఖిత్ కుమార్ గోదా

కవిత రాసినందుకు పొందిన ప్రశంసా పత్రం.



భరతమాత సంకెళ్లను తెంపడానికి

పోరాటాల పాట నడిచినా తెలుగు ఉద్యమ సారథి.

స్వాతంత్ర సాధనలో బ్రిటిష్ సైనికుల తుపాకులకు,

రొమ్ము చూపి కాల్చిన అంటూ గర్జించిన పోరాట శరధి.

స్వరాజ్య, లాటైమ్స్ తో పత్రిక సంపాదకుడిగా వెలిగిన సూర్యుడు.

మహోన్నత న్యాయవాది వృత్తిని సైతం

స్వాతంత్ర సమర పోరు కోసం విడిచి

దేశ సేవ జీవితంగా ఊపిరిగా తలచిన

అంకిత భావ, అవ్యాజ దేశభక్తుడు మన టంగుటూరి.

తెలుగు ప్రజల గుండెల్లో

కోవెల కట్టుకొని పూజింపబడుతున్న మహోన్నత పరిపాలనాదక్షుడు.

🌉🌉🌉🌉🌉🌉🌉🌉🌉🌉🌉🌉

ఈ-బుక్ లింక్ 👇👇👇👇

https://drive.google.com/file/d/1cChVz4qSws4vVFQONUVoczMtoYIBh2qC/view?usp=drivesdk

16, ఆగస్టు 2020, ఆదివారం

దేశభక్తి సాహిత్య ఈ పత్రిక వారం వారం కవితా హారం ఆన్లైన్ కవి సమ్మేళనంలో 6వ సారి నేను...

ఈ కవితను 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా నిర్వహించిన అంతర్జాల జాతీయ ఆన్లైన్ కవి సమ్మేళనం లో నేను ఆలపించిన కవిత... 

●●●●●●●●


దేశభక్తి సాహిత్య ఈ పత్రిక 

Face Book Group 

వారి " వారం, వారం కవితా హారం" 

ఆన్లైన్ కవి సమ్మేళనం


ఆగస్ట్ 16, 2020 ఆదివారం

ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు


19 వ ఆదివారం

అంశం : 


((( " మువ్వన్నెల జెండా " )))


పాల్గొనండి, వీక్షించండి


సూదిరెడ్డి నరేందర్ రెడ్డి

అడ్మిన్.






అంతర్జాల జాతీయ ఆన్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొన్నందుకు అందుకున్న సర్టిఫికెట్

https://youtu.be/mBEQRJGE0gk


రచనలు

కుట్టు ఎవుసం పోయెమ్

కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...