14, నవంబర్ 2020, శనివారం
తరణం జాతీయ దినపత్రిక నిర్వహించిన "బాలలు భావి భారత పౌరులు" అనే అంశంపై నేను పంపిన సమ్మోహనాల లఘు కవితలు
10, నవంబర్ 2020, మంగళవారం
ప్రముఖ సాహితీవేత్త వేంపల్లి రెడ్డి నాగరాజు రచించిన గోరుముద్దలు కథల సంపుటి పై నేను రాసిన పుస్తక సమీక్ష
లేత మనసులకు నూతన నేస్తాలు... రెడ్డి నాగరాజు "గోరుముద్దలు"
బాలసాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు మొలకెత్తినా పిల్లలకు విలువలు, నీతిని, చైతన్యాన్ని నేర్పేది మటుకు కమ్మని కథలే. వయసురీత్యా పెద్దలైనా, పిల్లల్లో జాగృతి కోరి, భావి తరానికి బలమైన పునాది వేయాలని అంకితభావంతో , పిల్లల వయస్సుకు దిగొచ్చి, వారికి అర్థవంతంగా, వారు మాట్లాడుకునే భాషలోనే, కథను అందరిలా(కొందరు రచయితలు) చెబుతున్నట్లుగా కాకుండా, కథను కళ్లముందు చూపిస్తూ జరుగుతున్నట్లు రాయడం, ఆ కథల్లో చదువరి బాలలే ఉన్నట్లుగా రాయడం, పరిస్థితుల రీత్యా సమకాలీన జీవనానికి అద్దం పట్టేలా కథలు అల్లడం బాల సాహితీవేత్తలకు కత్తి మీద సాము లాంటిది.
కానీ పరిశుభ్రమైన, పరిపూర్ణమైన సమాజం ఖచ్చితంగా వెలుగులోకి తీసుకురావాలనే సత్సంకల్పం ఉన్న రచయితలకు మాత్రం పైనున్న మాటలు "వెన్నతో పెట్టిన విద్య"ని చెప్పాలి.
రచయిత వేంపల్లి రెడ్డి నాగరాజు గారు వృత్తిరీత్యా ఎల్ఐసి ఉద్యోగి అయినప్పటికీ, సాహిత్యానికి తరగని విజ్ఞాన, నీతుల కోశాన్ని అందించాలనే సులోచనతో కథా,కవిత,ఇతర సాహిత్య ప్రక్రియల్లో తమ ఎనలేని అక్షర సేద్యాన్ని, సంపదను అందిస్తున్నారు.తన కలం నుండి వెలలేని సాహిత్యాన్ని ఇస్తున్నప్పటికీ ఇంకా ఏదో అందించాలనే తాపత్రయం. ముఖ్యంగా పిల్లల జీవితం మలినం లేని సమాజంలో తిరుగాడలనే లక్ష్యంతో బాల సాహిత్యంలో కూడా నూతన ఒరవడి ఆలోచనలతో, ప్రయోగాలతో నిరంతరం కృషి చేస్తున్నారు.
గత ముప్పయేళ్ల సాహిత్య అనుభవం ఉండటం చేత ప్రౌఢ సాహిత్యములో రాణిస్తూనే, ఇటు
బాలసాహిత్యంలో ఇప్పటికే చిన్నారి పొన్నారుల కోసం "బామ్మలు చెప్పని కమ్మని కథలు, బొమ్మలు చెప్పిన కమ్మని కథలు, పాల బుగ్గల- పసిడి మొగ్గలు" వంటి బాల సాహిత్య పోషణ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.రూపాయికే కథలు అంటూ బాలల కథలున్ధ ఫ్లిప్ బుక్ లు దాదాపు లక్షకు పైగా అమ్ముడుపోయాయి.ప్రౌఢ సాహిత్యంలో వీరు రాసిన రచనలపై కొందరు పి.హెచ్ డీ లు చేస్తున్నారు.
ప్రస్తుతం గోరు ముద్దలు కథల పుస్తకం వెలువరించారు. బాలల మనసులకు నీతుల కిరణాన్ని ప్రసరింపజేయడమే కాకుండా, పాతదనం నుండి కొత్తదనాన్ని ఎలా సృష్టించుకోవచ్చో తెలియపరిచారు.నేటి వర్ధమాన సాహితీవేత్తలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నారు.
బాగా ప్రాచుర్యం ఉన్న పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలనే తీసుకొని కొత్త తరహాలో సమకాలీన జీవితానికి అనుగుణంగా కథలు లిఖించారు.
ఇందులో ఉన్న 11 బాలల కథలు నవతరానికి దొరికిన ఆణిముత్యాలు అని చెప్పుకోవచ్చు.
ఈ గోరుముద్ద వయ్యి లోని మొదటి కథ "దేవత అనుగ్రహం" . ఇందులో ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. ఒకరోజు చెట్టెక్కి పెద్ద కొమ్మలను నరుకుతూ ఉండగా తన చేతిలోని గొడ్డలి జారీ వాగులో పడిపోతుంది. తన తాతల కాలంలో వాగులోని దేవత తన తాత గొడ్డలి ని పైకి తీసుకు వచ్చిన విషయం గుర్తుకు రావడం, ఎంతసేపు వేచి చూసినా దేవత ప్రత్యక్షమవ్వకుండా గొడ్డలిని ఇవ్వకపోవడంతో అసహనం చెంది ఆ వ్యక్తి గట్టిగా అరవడం, అటుగా పోతున్న ఓ కోతి ఆ వ్యక్తి అరుపులు విని, అతనితో"నువ్వు చెట్లు నరకడం వలన దేవత ప్రత్యక్షమవడం లేదు. ఎందుకంటే చెట్లను నరికి, వనాలను నాశనం చేసేవారు అంటే దేవతకు చాలా కోపం. ఇప్పుడు కట్టెలు అవసరం లేకుండా గ్యాస్ పై, సోలార్ కుక్కర్ లల్లో వంట వండుకునే సౌలభ్యం ఉంది. పర్యావరణానికి హాని తలపెట్టకుండా పట్టణానికి వెళ్ళి గోబర్ గ్యాస్, సోలార్ పవర్ ల ఏజెన్సీ ప్రారంభిస్తే దేవత నిన్ను అనుగ్రహిస్తుంది"అని బదులివ్వడం, ఆ కట్టెలు కొట్టుకునే వ్యక్తి లో మార్పు రావడంతో చక్కని ముగింపునిచ్చారు రచయిత.
"కాకి-కడవ" కథలో , మండువేసవిలో బాగా దాహంగా ఉన్న ఓ కాకి ఓ కడవలోకి తొంగి చూస్తే నీళ్లు ఉంటాయి. అయినా ఆ కాకి నీళ్ళు త్రాగడానికి మరో వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన మరో కాకి మన తాతల కాలంలో మాదిరి కడవ అడుగున కాక నిండుగా నీళ్ళున్నాయి. పైగా గులకరాళ్లు వేసాము కూడా లేకనే నీళ్లు అందుబాటులో ఉన్నాయి కదా! మరి నీళ్లు తాగకుండా నే వెళ్ళిపోతున్నావ్ ఎందుకు అని ప్రశ్నిస్తుంది. ఆ కడవలో నీళ్లు మలినంగా ఉన్నందున త్రాగడానికి తను ఆసక్తి చూపడం లేదని, ఒకవేళ త్రాగితే ఎన్నో జబ్బులతో బాధ పడాల్సి వస్తుందని, మొదటి కాకి రెండో కాకికి చెబుతుంది.
తద్వారా రచయిత ఈ కథలో పిల్లలకి త్రాగడానికి ఎప్పుడూ పరిశుభ్రమైన నీటికే ప్రాధాన్యం ఇవ్వమని సూచిస్తున్నాడు. ఏదైనా పని చేసే ముందు తొందరపడి చేయకూడదని, కొంచెం ఆలోచించి చేస్తే మంచిదని ప్రయోగించిన చక్కని నీతి కథ.
మనకు తాతల కాలం నుండి తెలిసిన "పిల్లి మెడలో గంట" కథను నవతరానికి కొత్త సువాసన వచ్చేలా లిఖించారు. పెద్ద సంఖ్యలో ఉన్న రైతు ఇంట్లో ఎలుకలను, చప్పుడు చేయకుండా రోజుకు ఒక దాన్ని పిల్లి తినేయడం, రోజురోజుకు తమ సంఖ్య దిగిపోవడం, పట్టణంలోని కళాశాలలో చదువుతున్న చిట్టెలుక సెలవులకు ఇంటికి వచ్చి విషయం తెలుసుకోవడం, రైతు కొడుకు పట్టణం నుండి వచ్చిన సెంట్ బాటిల్ ను అటక పై కూర్చొని పిల్లి పై గుమ్మరీయడం వలన ఆ పిల్లి దేహం నుంచి వచ్చే పరిమళం ద్వారా ఎలుకలు ప్రమాదాన్ని ముందే గ్రహించి తప్పించుకోవడంతో కధ ముగుస్తుంది. చదువుకుంటే ఎంతటి క్లిష్ట పరిస్థితినైనా పరిష్కరించుకోవచ్చునని నీతులు ఇమిడ్చి రాసిన కథ.
"మూర్ఖత్వం" కథలో 'మనకు హాని చేయని ఏ ప్రాణికైనా మనం హాని తలపెట్టకూడదని, అలా కాదని అల్లరి చేష్టలతో పర జీవులకు హాని తలపెడితే ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో' చక్కగా వివరించిన బాలకథ.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కథలన్నీ మానవ జీవితానికి చక్కని సందేశాత్మక రచనా ప్రయోగాలు. కథలన్నింటినీ సృజనాత్మకంగా రచించిన రచయిత రెడ్డి నాగరాజు గారి ప్రతిభను అభినందించకుండా ఉండలేం. తన మేధాశక్తికి పదునుపెట్టి పిల్లల కోసం చక్కని బాల కథలు రాశారు. వారి ఈ శ్రమ పిల్లల వరకు చేరితే అంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. వారికే కాదు ఏ బాల సాహితీవేత్త కైనా.
రేపు మన కళ్ళు శుభ్రంగా ఉండి, దేశాన్ని నవ్యంగా రూపొందించాలంటే ఇటువంటి పొత్తాలను పిల్లలు చదవడం ఆవశ్యం. తల్లిదండ్రులు లేత మనసులకు ఇటువంటి కథలు చేరవేయడానికి ప్రేరేపించాలి. అప్పుడే నవభారతం నిర్మితమవుతుంది. జై బాలసాహిత్యం!!
పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల కళాశాల, బోనకల్.
బనిగండ్లపాడు గ్రామం ఎర్రుపాలెం మండలం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం-507202.
ప్రతులకు:-
వేంపల్లి రెడ్డి నాగరాజు,
ఎల్.ఐ.సి.ఆఫ్ ఇండియా,
రాయచోటి శాఖ, కడప (జిల్లా) - 516269
మొబైల్:- 7989928459,9985612167.
నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష
బాలల అక్షర సేద్యం... నల్లగొండ జిల్లా బడి పిల్లల కథలు(పుస్తక సమీక్ష)
పుస్తక సమీక్షకుడు:- లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
"అచ్చటికిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచ్చటికో ఎగురుతుపోయే
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే
పిట్టల్లారా!
పిల్లల్లారా!!..."
9, నవంబర్ 2020, సోమవారం
ప్రముఖ సాహితీవేత్త గరిపల్లి అశోక్ గారి మా బడి కతలు పుస్తకం పై నేను రాసిన పుస్తక సమీక్ష
సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ "మా బడి కతలు"(పుస్తక సమీక్ష-06)
మొలక న్యూస్ లో ప్రచురించిన నా పుస్తక సమీక్ష (09/11/2020)
పుస్తక సమీక్షకుడు:-లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
![]() |
| గరిపల్లి అశోక్ గారి మా బడి కతలు కవర్ పేజి |
ప్రస్తుత తెలుగు బాలసాహిత్యం దినదినాభివృద్ధి చెందుతూ నూతన చరిత్రను సృష్టిస్తుంది. ఒకరకంగా చెప్పుకోవాలంటే సాహిత్యంతో చరిత్రను తారాస్థాయిలో నిలుపుతుంది. బాల సాహిత్య కృషికి నిండు మనసుతో, అంకితభావంతో అటు వర్ధమాన రచయితలు, బాల రచయితలు ( బడి పిల్లలు), ఇటు మేలైన సాహిత్యాన్ని, నవభారతాన్ని రూపొందించాలనే ఆశయం, లక్ష్యం కలిగిన పెద్దలు (రచయితలు) అహర్నిశలు తమ సిరా స్వేదాన్ని చిందిస్తున్నారు.పిల్లలు , పెద్దలు ఎవరికి వారు నిత్యం బాల సాహిత్య ఉద్యానవనం పెంచాలని పోటీ పడుతూనే ఉన్నారు. నిరంతరం పిల్లలు, పెద్దలు సాహిత్య కార్యశాలలు నిర్వహిస్తూ, పాల్గొంటూ తెలుగుజాతికీ నిండయిన గౌరవం తీసుకొచ్చేలా పిల్లలు ఉపమన్యులులా, పెద్దలు భగీరథ మహర్షుల పట్టుదలతో సాహిత్య తపస్సుని ఆచరిస్తున్నారు. సాహిత్య పరిమళాలను వెదజల్లుతూ ఉన్నారు.
అలా నిరంతరం సాహిత్యం కోసం పాటుపడుతూ, ఇప్పుడు మేలైన సాహిత్యాన్ని, చిగురించిన ప్రతి అక్షరాన్ని పిల్లల దాకా తీసుకెళ్లాలి అనే లక్ష్యం ఉన్న సాహితీవేత్తల్లో గరిపల్లి అశోక్ గారు ముందంజలో ఉంటారు. ఇంటర్మీడియట్ స్థాయిలోనే "నాంది" కవిత్వ సంకలనం తీసుకు రావడం తోనే బోధపడుతుంది వారికి సాహిత్యంపై అవధులు లేని అవ్యాజపు అభిమానం.
ముస్తాబాద్ బడి పిల్లలు రచించిన"జాంపండ్లు" కథా సంకలనానికి, తెలంగాణ బడి పిల్లల రాసిన"ఆకుపచ్చని ఆశలతో"కవితా సంకలనానికి, ఇలా ఎన్నో బాల సాహిత్యంలో బాలల మదిలో పూసిన అక్షరాలను సంకలనాలుగా వెలువరించిన సంపాదకులు.'బాలచెలిమి' నుండి మణికొండ వేదకుమార్ సంపాదకత్వంలో వెలువడిన 'తెలంగాణ బడి పిల్లల కథలు' ప్రాజక్టుకు కన్వీనర్ గా వ్యవహరించారు. 'దూడం నాంపల్లి రచనలు-పరిశీలన' ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం. "ఎంకటి కతలు', 'మా బడి కతలు', 'సరికొత్త ఆవు-పులి కథలు' ఇటీవల అచ్చయిన బాలల సాహిత్యం. . గరి పెల్లి అశోక్, డా, పత్తిపాక మోహన్ కలిసి తెస్తున్న 'కరోనా కతలు' అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇప్పుడు బడి పిల్లల జీవితం పై, సమాజంలో చోటుచేసుకునే అంశాలనే రచయిత గరిపల్లి అశోక్ కథావస్తువులుగా తీసుకుని తెలుగు సాహిత్యంలో ఒక నూతన చరిత్రను సృష్టించే గొప్ప ప్రయత్నం చేశారు.
బడిలో పిల్లలు ఎలా ఉంటారో, బడి జీవనం ఎలా ఉంటుందో (ప్రభుత్వ పాఠశాల ఇందులో), బడి పిల్లల అంతర్గత జీవితాలను, విద్యార్థుల వ్యవహారపు తీరు పట్ల ఉపాధ్యాయులు తీసుకునే జాగ్రత్తలను, పరిష్కారాలను అందంగా, కన్నీరు ఒలికేలా కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు.
ఈ కథల్లో కేవలం గరిపల్లి అశోక్ గారు అక్షరాలను కాదు, ఆశయం, ఆవేదనను జోడించి రచించారు. ఒకరకంగా చెప్పాలి అంటే కథ మన మాటలతో కాదు, కథలోని నాయకుడితో మాట్లాడితే కథ చదువరుల హృదయాల్లో జీవిస్తుంది అన్న తరహాలో లిఖించారు. అక్కడక్కడ తెలంగాణ యాసను జోడిస్తూ, కథలను కొత్త తరహాలో నడిపించారు.
మొదటి కథ "కరపత్రం", పేద కుటుంబంలో జీవిస్తూ, ఆలనా పాలనా చూసుకునే తండ్రి లేక, తల్లి కూలి కష్టంతో బ్రతుకుతూ, కనీసం రాసుకోవడానికి పుస్తకాలు కూడా కొనుక్కోలేక, దొరికిన కరపత్రాలనే రఫ్ నోట్స్ లాగా వాడుకుంటూనే, బడికి క్రమం తప్పకుండా వెళుతూ, ఎప్పుడూ ప్రథమంగా నిలిచే శేఖర్ లాంటి విద్యార్థుల జీవితాలు ఇప్పుడు కోకొల్లలు. అలాంటి జీవితా లను కళ్ళకు కట్టినట్లు రాసారు రచయిత.
"బొంతలు" కథలో కూడా విహార యాత్రలో భాగంగా విద్యార్థులందరూ కొత్త బెడ్షీట్లు, దిండ్లు తెచ్చుకుంటే మహేష్ మటుకు పాత చీరలతో , లుంగీ లతో, పాత ధోతీలతో అందంగా కుట్టిన బొంతులను తెచ్చుకోవడం, అది చూసిన సహవిద్యార్థులు మహేష్ ని హేళన చేయడం, మహేష్ బాధపడడం, తరువాత ఉపాధ్యాయులు వచ్చి మహేష్ ని ఓదార్చి సహ విద్యార్థులు అందరకు వ్యర్థాలకు అర్థాన్నిచ్చే విషయాలు చెప్పడం,వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకోవడం మంచి పద్ధతి అని బోధించడం, ధనం లేకపోవబట్టే మహేష్ మీలాగా కొత్త దిండ్లు బెడ్షీట్లు తెచ్చుకోలేదని, అతని వద్ద డబ్బు ఉంటే అతను కూడా మీలాగే చేసేవాడని, పక్క వారిని హేళన చేయకూడదు అని హితబోధ చేయడంతో కథ కంచికి వస్తుంది. అచ్చంగా ఈ కథలో జరిగేవే నేడు పాఠశాలలో జరుగుతున్నాయి.ఇలాంటి కథలు చదువుతున్నంత సేపు పాఠకుల కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉంటాయి.
"నీళ్లు" కథ అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా కథలు మటుకు విద్యార్థుల జీవితాలను చూపిస్తే, "నీళ్లు", "చెత్త బుట్టలు" వంటి కథలు రాజుల కాలం నాటివే అయినప్పటికీ, పరిశుభ్రత, పరిపూర్ణ హృదయం ఎలా ఉంటాయో చక్కగా వివరించిన కథలు. దురాశకు పోతే జరిగే పరిణామాలు వివరించిన కథలు.
"నిజాయితీ", "ఫిల్టర్లు" కథలు అందరినీ ఆకర్షిస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులోని 15 కథలు మణిరత్నాలే అని చెప్పుకోవచ్చు."మా బడి కతలు" వయ్యిలోని ప్రతి కథకు కూరేళ్ళ శ్రీనివాస్ గారు ఆయని కుంచెతో అందమైన చిత్రాలు చిత్రించి పుస్తకంలోని కథలలాగే శోభ తీసుకొచ్చారు. కేవలం నీతినే కాకుండా, మన కళ్ళ ముందు జరిగే జీవితాలనే కథలుగా రాయడం రచయిత గరిపల్లి అశోక్ గారికి సమాజం పై ఉన్న పట్టు, అవగాహన ఏంటో తెలుస్తుంది.
ఇలాంటి కథలు కచ్చితంగా నేటి తరానికి అవసరం. ఒక్క సారి చదివామంటే చాలు, ఇవి మన హృదయాలలో గూడు కట్టేసుకుంటాయి. అమలినమైన సాహిత్యాన్ని పిల్లల హృదయాలు దాకా తీసుకు రావాలనే రచయిత ఆకాంక్ష ఈ కథలో పొందుపరచబడి ఉంది. అన్ని వర్గాలకు వారికి ఉపయోగపడే ఇలాంటి కథలు (జీవితాలు) లిఖించి నందుకు రచయితను అభినందించకుండా ఉండలేం. ఇలాంటి రచనలు వెలుగులోకి వస్తే రేపు మన సమాజం దివ్యంగా, వైభవంతో విలసిల్లుతుంది. జై బాలసాహిత్యం!!
![]() |
| సమకాలీన బడి జీవనం... గరిపల్లి అశోక్ "మా బడి కతలు": - లిఖిత్ కుమార్ గోదా,ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం. - MOLAKA - https://molakanews.page/SX3Naz.html |
2, నవంబర్ 2020, సోమవారం
ప్రముఖ బాల సాహితీవేత్త గుడిపూడి రాధికా రాణి గారి పుస్తకం బాల కథంబం పై నేను సూర్య దినపత్రికలో రాసిన పుస్తక సమీక్ష (05)
నైతికాల మకరందం.. రాధికా రాణి గారి బాల కథంబం (పుస్తక సమీక్ష)
![]() |
| రచయిత్రి:- గుడిపూడి రాధికా రాణి గారు |
![]() |
| నా పుస్తక సమీక్ష-5 |
30, అక్టోబర్ 2020, శుక్రవారం
కైతికాలు: మొలక న్యూస్ లో ప్రచురణ (29/10/2020)
కైతికాలు
సాహితీ సాగరం ఫేస్బుక్ గ్రూప్ కవితాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన పదబాణీ నూతన కవితా ప్రక్రియలో పోటీ..
సాహితీ సాగరం ఫేస్బుక్ గ్రూప్(కవితాలయం) లో నిర్వహించిన పదబాణీ నూతన కవితా ప్రక్రియ కవిత పోటీలో తొలి ప్రయత్నంగా పాల్గొన్నందుకు వారిలో నేను కూడా ఒక విజేతను అయ్యినందుకు సంతోషంగా ఉంది ❤️❤️
![]() |
| విజేతల ప్రకటన |
దోహాలు
☝️☝️దోహాలు☝️☝️
రచన:- లిఖిత్ కుమార్ గోదా
#మీరు తెలుగు దోహాలు రాయాలనుకుంటున్నారా?అయితే ఈ క్రింది దోహాలను చదివి,నియమాలను తెలుసుకోండి...త్వరలోవెలువడనున్న 'తెలుగు దోహాలు' సంకలనానికి మీ దోహాలను సిద్ధం చేయండి..
||తెలుగు దోహాలు||
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
*
మమతపంచు 'సత్య'సూక్తే,తలచ మృధువైన ముంజ|
తాగుబోతు నోటిమాటే,బురదలొ పాతిన గుంజ||
*
గెలుపు లభించకుందంటే,'సత్యము' సాధన కొరత|
అంతర్బాహ్య శక్తులతో,పెనగకుంటె అస్థిరత||
*
దాపురించిన పరిస్థితే,సాహసాల జాబిల్లి|
'సత్య'!సందివ్వక కొడితే,తిరగబడునులే పిల్లి||
*
'సత్య'!ఆపత్కాలమునే,ఆలోచన లుదయించు|
దాలిన కాగని పాలలో,ఎట్లు వెన్న జనియించు||
*
తలచినకొద్ది 'సత్య'మిదే,మది కంపించే తీగ|
తోలినకొద్ది వాలునులే,'చింతే' తొలగని ఈగ||
*
'సత్య'!తృప్తినీని పనులే,వీడుట మేలగు రోసి|
కష్టము తప్ప నిష్ఫలమే,గుట్టకు కట్టెలు మోసి||
*
ఆశించక ఫలితాలనే,పనిచేయగ తలపెట్టు|
'సత్యము'చేయు సాధనయే,కీర్తి గుడికి తొలిమెట్టు||
÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
#తెలుగుదోహా నియమాలు:
~~~~~~~~~~~~~~~
*దోహాలు రెండుపాదాలను కలిగి ఉంటాయి.ప్రతిపాదాన్ని రెండు భాగాలుగా విడగొట్టవచ్చు..
*ప్రతిపాదం తొలి అర్థభాగం 13 మాత్రలు కలిగి,పదమూడవ మాత్రాక్షరం గురువు(దీర్ఘాక్షరం)అయ్యుండాలి.
*ప్రతిపాదం రెండవ అర్థభాగం 11మాత్రలు కలిగి,పదకొండవ మాత్రాక్షరం లఘువు(హ్రస్వాక్షరం)అయ్యుండాలి.
*ఏ పాదంలోని ఏ అర్థభాగమైనా ఐదు మాత్రలతోను,'జ'గణం(IUI)తోను మొదలు కాకూడదు.
*ప్రతిపాదం చివర అంత్యప్రాసను రూపొందించాలి
*తఖల్లుస్(నామముద్ర)ప్రయోగించవచ్చు
*దోహాలు ముక్తకాలు.దేనికదే స్వతంత్రభావాన్ని కలిగి ఉంటుంది.
*దోహాలకు శీర్షిక ఉండదు.
@@@@@@@@@@@@
🌿విడువక చదివిన పొత్తమే, ఎదలో నిలుపును శాంతి|
పొత్తము విడిచిన చేరులే, మదిలో తెలియని భ్రాంతి||(01)
🌿 అధిరోహించిగ శిఖరమే,మనిషికి కీర్తి వచ్చును!
లిఖిత్ కూర్చోకు ఒట్టిగా, విప్పలేవుగ ఉచ్చును!!(02)
🌿ఘోర తపస్సు చేసిననూ,ఖలుడు వీడడు కుటిలము!
క్షీరము కలిసిన సలిలమును, విడదీయుటే జటిలము!!(03)
🌿శూలము పర దేహములకే, మిక్కిలి పెరిగిన గోరు!
శల్యమగును పరులెదలకే, "లిఖి"అదుపు లేని నోరు!!(04)
🌿వింటే సజ్జన పలుకులే,దరిచేరదుగా క్షోభ!
విని చూడు గురువు మాటలే,"లిఖిత్" జీవితమె శోభ!(05)
🌿ఖలుని ఎంతగ తిట్టిననూ,బాధ పెట్టవు చివాట్లు!
కొడితేనేమి శునకమునే, మార్చదు తన అలవాట్లు!(06)
🌿సన్మానాలనాశించే ,రాయకు లిఖిత్ కవితలు!
తెలుసుకుంటే సత్యములే,రాసినవగును తవికలు!!(07)
Trishul Samacharam daily Published
(27/10/2020)
✍️ లిఖిత్ కుమార్ గోదా.,
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.
15, అక్టోబర్ 2020, గురువారం
కైతికాలు నూతన కవితా ప్రక్రియ: గోస్కుల రమేష్ గారు
కైతికాలు రాయడం సులభం ఇలా.....
కైతికాలు
{ అబ్దుల్ కలాం ఆరాధ్య*లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం*అక్షరాన్ని నమ్ముకున్ననిలుచును మన జీవితాలుకవిత్వాన్ని నమ్ముకున్నకలుగు నిత్య సత్యాలువారెవ్వా లిఖితాలుశాంతి కోరు కపోతాలు!!(01)🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿మదిలో భావాలు కోసిపూసగుచ్చె కైతికాలు,మదిలో బాధలు మరిచినేర్చెద నైతికాలువారెవ్వా లిఖితాలుమదిని దోచే కవిత్వాలు!(02)🌹🌹🌹🌹🌹🌹🌹🌹వీచే గాలికి తెలుసుమనిషి ప్రాణం విలువ,పీల్చే మనిషికి తెలుసాప్రకృతి తల్లి విలువఇకనైనా మానవా !ప్రకృతిని భాధించుట!!(03)🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱పిల్లల నవ్వులు కోరిచందమామ స్థాపించెను,కమ్మని కథలు చెప్పినీతి సారము పంచెనువారెవ్వా చక్రపాణితెలుగు జనుల వాణి!!(04)📖📖📖📖📖📖📖📖📖📖📖పుస్తకాన్ని ప్రమిదలామార్చుకున్న రోజు,జీవితమున నువ్వువిజేతవైన రోజువినవయ్యా విద్యార్థిఅన్యాయానికి ప్రత్యర్థి!(05)గురువు మాటలు వినాలిమంచిని చెప్తారు కనుక,విని వదిలేస్తే సరిపోదు,పాటిస్తే అది కానుక,వినవయ్యా విద్యార్థిభావి తరపు ఆదిత్యా!!(06)🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵🌵సన్మానాలాశించకకవిత్వాన్ని రాసుకోశాలువాలు కోరె బుద్ధిమనసు నుంచి వదులుకోవినవయ్యా కవివర్యా,మార్చుకో కవన చర్య!!(07)🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥జగతిలో వ్యాప్తించెదకవన మొక్కలు నాటి,పాఠకునెదలో నిలిచెదశోక సంద్రాలు దాటి.కవి రాసే సత్యాలుఆదిత్యుని కిరణాలు!!(08)❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️❄️అబ్దుల్ కలామ్ ఆరాధ్య (కైతికాలు)కలాం అడుగు జాడలతోరామేశ్వరము తరించెపేపరేసి చదువుకునిదేశాన్ని పాలించెవారెవ్వా మౌనముని!జగతి మెచ్చిన విజ్ఞాన గని!!(09)🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️🖊️చదువుకునెను ప్రీతితోక్రమశిక్షణ సమేతజగతి మెచ్చేలా అయ్యెఅంతరిక్ష శాస్త్రవేత్తవారెవ్వా మిసైల్ మ్యాన్!భారతీయ మహాన్!!(10)🌲🌲🌲🌲🌲🌲🌲🌲కష్టాలు దాటుకునికలామయ్యెను విజేత,పట్టుదలతో జీవితముసాధించిన అధినేతభారతరత్న కలాం!భరతజాతికాదర్శం !!(11)🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴మహర్షిలా మౌనముగామాటల రాశులు పంచెనుఅందరికీ హితుడైజీవితాన్ని నేర్పెనుకలాం వాక్కు ముత్యాలు!పాటించే సత్యాలు!!(12)💧💧💧💧💧💧💧💧లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంకలం పేరు:- ఆదిత్య శ్రీ
✍️ *లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం.*కలం పేరు:- శ్రీ ఆదిత్య
రచనలు
కుట్టు ఎవుసం పోయెమ్
కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...
-
కదిలించే కవనాలు... "హరివిల్లు"ల అక్షర జలపాతాలు Download e-book తరి ముందుకు నడుస్తున్న కొద్దీ తెలుగు సాహితీవనంలో కొత్త కొత్త మొల...
-
కుట్టు ఎవుసం •••••••••••••• నా ఏడో ఏటా, మా నాన్నకి మధుమేహం వచ్చి మహా వృక్షం లాంటి శరీరం తరుగుతున్నప్పుడు, అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల పె...
-
*మణిపూసల కుటుంబ సభ్యులకు వినమ్ర నమస్కారాలు!* నా పేరు *లిఖిత్ కుమార్ గోదా, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం* _మహాత్మా జ్యోతిభా ఫూలే తెలంగాణ బీస...















